Table of Contents
గమనిక: ఈ బ్లాగ్ బయటి బ్లాగర్ ద్వారా వ్రాయబడింది. ఈ పోస్ట్‌లో వ్యక్తీకరించబడిన ఉద్దేశ్యాలు ఇంకా అభిప్రాయాలు కేవలం రచయితవి మాత్రమే.
బిట్‌కాయిన్‌ను గతంలో దాని ధర కేవలం డాలర్లుగా ఉన్నప్పుడు దానిపై డబ్బులు పెట్టినవారు గత సంవత్సరాల్లో గణనీయమైన లాభాలను ఆర్జించారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ గత దశాబ్దంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆస్తిగా ఉంది, దాని ఫలితంగా చాలా మంది అనుభవం లేని పెట్టుబడిదారులు సరైన సమయాన్ని వెచ్చించి, వారి సతోషి(బిట్‌కాయిన్ డెవలపర్ మొదటి డేటాబేస్)లను నమ్ముకొని లక్షాధికారులుగా మరియు అనేక సందర్భాల్లో బిలియనీర్లుగా మారారు.
క్రిప్టోకరెన్సీ మార్కెట్ విస్తరిస్తున్నందున మరియు స్వీకరణ రేటు ఆల్-టైమ్ హైలో ఉన్నందున, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఊహాత్మకమైన ‘చంద్రుని’పైకి చేరవేసే తదుపరి పెద్ద క్రిప్టోకరెన్సీ కోసం వెదుకుతున్నారు. మిగిలి ఉన్న ఏకైక సమస్య, భవిష్యత్తులో దూసుకుపోయే క్రిప్టోకరెన్సీని మనం ఎలా గుర్తించగలం?
మౌలికాంశాలు
కొనుగోలు ధర కీలకమైనది
ఇంకొక గొప్ప దాని కోసం చూస్తున్నప్పుడు, టోకెన్ ధరను గుర్తుంచుకోండి. తక్కువ మూలధనంతో సాధారణ బిట్‌కాయిన్ పెట్టుబడిదారులకు అంతకన్నా తక్కువ ధర గల క్రిప్టోకరెన్సీలు అనువైన పెట్టుబడి కావచ్చు.
$5,000 పెట్టుబడితో బిట్‌కాయిన్‌లో కొంత భాగాన్ని లేదా నేటి ధరను బట్టి ఒక డాలర్ కంటే తక్కువ విలువైన వేలకొద్దీ నాణేలను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. తక్కువ-ధర నాణేలు పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణకు అద్భుతమైన మార్గాన్ని అందిస్తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం
అవలంభించే అవకాశాలు
2017 చివరి త్రైమాసికంలో, రిప్పల్ గణనీయమైన వృద్ధిని సాధించింది. XRP ఈ సంవత్సరం హిట్ అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ఊహాజనిత క్రిప్టోకరెన్సీ మార్కెట్ వెలుపల ఉపయోగం కోసం చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశముంది. రిప్పల్ యొక్క సెటిల్మెంట్ సిస్టమ్ యొక్క అంతర్లీన సాంకేతికత, ఇది కార్యరూపం దాల్చుతుందని కేంద్ర బ్యాంక్‌లు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు హామీ ఇస్తుంది.
పాలిగాన్ గురించి కూడా అదే చెప్పవచ్చు. భారతీయ ప్రాజెక్ట్ క్రిప్టోకరెన్సీ పరిశ్రమలో విస్తృత ఆమోదం పొందుతోంది. ఎథేరియమ్ యొక్క దాని నిర్గమాంశ, పేలవమైన వినియోగదారు అనుభవం (వేగం మరియు ఆలస్యమైన లావాదేవీలు) మరియు సంఘ నియంత్రణ లేకపోవడం వంటి కొన్ని కీలక లోపాలను అధిగమించడానికి, పాలిగాన్ కొత్త సైడ్‌చెయిన్ విధానాన్ని ఉపయోగిస్తోంది. అందుకని, దానికి పోటీదారులు చాలా తక్కువగా ఉన్నందున ఇది చాలా హైప్‌ను అందుకుంటుంది.
పోటీ కంటే ప్రయోజనాన్ని కలిగి ఉన్న క్రిప్టోకరెన్సీని కనుగొనడం వల్ల (మరియు అందువల్ల విస్తృత ఆమోదం లభించే అవకాశం ఉంది) అది ఒక తెలివైన పెట్టుబడిగా అవ్వోచ్చు.
పరిగణించవలసిన అంశం సరఫరా
చాలా క్రిప్టోకరెన్సీల గరిష్ట సరఫరా ముందుగానే నిర్ణయించబడుతుంది. సాధారణంగా మైనింగ్‌ని ఉపయోగించడం ద్వారా క్యాప్‌ను చేరుకున్న తర్వాత మరిన్ని టోకెన్‌లు సృష్టించబడవు.
డిమాండ్ స్థిరంగా ఉంటే ధర పెరిగే అవకాశం ఉంది, కానీ సరఫరా పరిమితంగా ఉండాలి. మీరు ఏదైనా క్రిప్టోకరెన్సీలో కొనుగోలు చేసే ముందు, మొత్తం సరఫరాతో పాటు ప్రస్తుత సర్క్యులేషన్‌ను అంచనా వేయాలి.
ధర మరియు వాల్యూమ్
క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ సమాచారం కోసం ఆన్‌లైన్ వనరులు తక్షణమే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో, పెరుగుతున్న ధరలు మరియు లావాదేవీల వాల్యూమ్‌లతో డిజిటల్ కరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
ట్రెండ్ పైకి ఎగబాకుతుందని ఎటువంటి హామీ లేనప్పటికీ, అత్యధిక పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే డిజిటల్ కరెన్సీలకు ఇది మంచి సూచిక.
మీ స్వంత పరిశోధన చేయడం (డూయింగ్ యువర్ ఓన్ రీసెర్చ్- DYOR)
వీటన్నింటిని పరిశీలిస్తే, మీరు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. ఇదే జరిగితే, మీరు మీ డబ్బు మొత్తాన్ని ఒకే ప్రాజెక్ట్‌లో పెట్టకుండా మీ టోకెన్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలి. మీ పోర్ట్‌ఫోలియో బాగా సమతూకంగా ఉందని నిర్ధారించుకోవడానికి, మీరు మీ టోకెన్‌లను ఎలా ఎంచుకోవాలి? ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి:
టోకెన్ ప్రాచుర్యం
మీరు క్రిప్టోకి కొత్తవారైనా కాకపోయినా, బిట్‌కాయిన్ మరియు ఈథర్ వంటి అత్యంత ప్రసిద్ధ టోకెన్‌ల గురించి మీరు నిస్సందేహంగా వినే ఉంటారు. ఇవి ఆర్థికంగా అత్యంత విజయవంతమైన నాణేలు మరియు దాదాపు ఏదైనా క్రిప్టో పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో వీటిని చూడవచ్చు. ఈ టోకెన్‌లు సాధారణంగా పాతవి, “సురక్షితమైన” పెట్టుబడి అయిన మరింత విశ్వసనీయమైన టోకెన్‌లు కాబట్టి సాధారణంగా ప్రాచుర్యం పొందాయి.
ఇవి, సందేహం లేకుండా, మీ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉండాలి, కానీ అవి మాత్రమే ఉండకూడదు. ఒక బిట్‌కాయిన్ లేదా ఈథర్ బుల్ రన్ ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలను సృష్టించినప్పటికీ, మార్కెట్‌ను అధిగమించే అతి కొద్దిగా-తెలిసిన ఆల్ట్‌కాయిన్‌లు చాలా ఉన్నాయి. మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి మరియు మీ పందాలను ఎదో విధంగా అదుపుచేయడానికి కొన్ని ఒక మోస్తరు-తెలిసిన నాణేలను కనుగొనడానికి క్రిప్టో-సంబంధిత ఫోరమ్‌లను సందర్శించండి.
సంభావ్య అంతర్లీన యూజ్ కేసుతో టోకెన్లు
సంభావ్య అంతర్లీన యూజ్ కేసుతో కూడిన క్రిప్టోకరెన్సీలు మీ పోర్ట్‌ఫోలియోకు జోడించడాన్ని మీరు పరిగణించాల్సిన టోకెన్‌ల తరగతి. ఉదాహరణకు, కొన్ని క్రిప్టోకరెన్సీలు బ్లాక్‌చెయిన్-ఆధారిత కార్యక్రమాలతో ముడిపడి ఉంటాయి, ఇవి కాలక్రమేణా ట్రాక్షన్‌ను పొందగలవని అంచనా వేయబడ్డాయి, వాటి విలువ కాలక్రమేణా పెరుగుతుందని సూచిస్తున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ విజయవంతం కానప్పటికీ, వారి మాతృ ప్రాజెక్ట్‌ల వాగ్దానం ఆధారంగా కొన్ని టోకెన్‌లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం
క్రిప్టో-సంబంధిత పత్రికలు మరియు బ్లాగ్‌లు సాధారణంగా కొత్త లేదా సంభావ్య బ్లాక్‌చెయిన్ వెంచర్‌ల గురించి తెలుసుకోవడానికి ఉపయోగకరమైన ప్రదేశాలు.
గత మార్కెట్ పనితీరుe
ఏదైనా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసే ముందు, దాని మునుపటి మార్కెట్ పనితీరును పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ డేటా కాలక్రమేణా పెరిగే దాని విలువను అంచనా వేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. బిట్‌కాయిన్ వంటి కొన్ని టోకెన్‌లు మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నట్లు కనుగొనబడ్డాయి మరియు వాటి ఫలితంగా, ప్రస్తుత మార్కెట్ నష్టాల నుండి దాదాపుగా కోలుకుంటుంది. టోకెన్ యొక్క చరిత్ర ప్రారంభించిన కొద్దికాలానికే అది గరిష్ట స్థాయికి చేరుకుని ఆ తర్వాత నాటకీయంగా పడిపోయిందని తెలీస్తే, అది చాలావరకు మీరు దాటవేయాల్సిన పంప్ అండ్ డంప్ ఆపరేషన్.
ఇది ఖచ్చితమైన నియమం కానప్పటికీ, నాణెం కొనుగోలు చేసే ముందు దాని గత మార్కెట్ చరిత్రను పరిశీలించాలి.
సంఘం తీర్మానం
ఒక వ్యక్తిగా మీరు పెట్టుబడి పెట్టడానికి క్రిప్టోస్‌పై మీకు పరిమిత అవగాహన ఉండొచ్చు, కానీ సంఘం అలా కాదు. దీనికి భిన్నంగా, ఇంటర్నెట్ క్రిప్టో పెట్టుబడికి సంబంధించిన సమాచారంతో నిండి ఉంది, మీరు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి.
ఏ టోకెన్‌లపై చర్చ జరుగుతున్నాయో గమనించేందుకు క్రిప్టోకరెన్సీ ఫోరమ్‌లు, టెలిగ్రామ్ గ్రూపులు ఇంకా సోషల్ మీడియా ప్రొఫైల్‌లకు వెళ్లండి. మీరు నిర్దిష్ట కరెన్సీలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీరు సలహా కోసం సంఘాన్ని సంప్రదించవచ్చు ఇంకా దాదాపు ప్రతిసారి మీరు వారి ప్రతిస్పందనను పొందుతారు. ఎలాంటి సందర్భంలోనైనా, క్రిప్టోకరెన్సీ అనేది కమ్యూనిటీకి సంబంధించినది, కాబట్టి దాని ప్రయోజనాన్ని పొందండి.
అయితే, మీ క్రిప్టోకరెన్సీల మాదిరిగానే, మీరు మీ సమాచారాన్ని ఎక్కడ నుండి సేకరిస్తున్నారో తెలుసుకోవడం తెలివైన నిర్ణయం. ప్రఖ్యాత ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇంకా వ్యాపారులు మీరు మొదలుపెట్టేందుకు ఒక గొప్ప చోటు, అయితే ఏ వ్యక్తి కూడా అన్ని సమయాలలో ఒకేలా సరిగ్గా ఉండలేరని గుర్తుంచుకోండి.
సారాంశం
ప్రత్యేకించి క్రిప్టోకరెన్సీల వంటి సంక్లిష్టమైన వాటికోసం, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సృష్టించడం అనేది అంత సులభమేమి కాదు. ఆనందించాల్సింది ఏంటంటే, దీన్ని నావిగేట్ చేయడానికి మరియు ఉత్తమ టోకెన్‌లను ఎంచుకోవడానికి వ్యూహాలు కూడా ఉన్నాయి. పెట్టుబడి పెట్టడానికి క్రిప్టోలను ఎంచుకున్నప్పుడు, ఇటీవలి సంవత్సరాలలో దాని ప్రాచుర్యం నుండి విజయం వరకు గల ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోండి.
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.