Table of Contents
గతంలో ఎన్నడూ లేనివిధంగా కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచాన్ని తాకడం దానితో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లు కుప్పకూలడంతో, పెట్టుబడిదారులు ఎక్కువగా కోరుకునే ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బిట్‌కాయిన్ ఉద్భవించింది.
దాదాపు స్థిరమైన మంచి రాబడి కారణంగా, ఎక్కువ మంది వ్యాపారులు ప్రతిరోజూ భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంకా బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడం కాలక్రమేణా దాదాపు సునాయాసంగా మారింది – ముఖ్యంగా వ్యాపారులు భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడానికి, మరియు విక్రయించడానికి అనుమతించే క్రిప్టో ఎక్స్ఛేంజీల ద్వారా, భారతదేశంలో బిట్‌కాయిన్ 2021 లో మీరు సులభంగా కొనుగోలు చేయడానికి క్రిప్టో మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఇది ఖచ్చితంగా మంచి తరుణం.
ఈ పోస్ట్‌లో, మీరు భారతదేశంలో 2021 లో బిట్‌కాయిన్‌పై ఎలా పెట్టుబడి పెట్టవచ్చనే అనేదాని గురించిన అన్ని వివరాలను మేము మీకు అందిస్తున్నాము!
బిట్‌కాయిన్ అంటే ఏమిటి?
బిట్‌కాయిన్ అనేది వికేంద్రీకృత డిజిటల్ కరెన్సీ, దీనిని బ్యాంకుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు మరియు మార్పిడి చేయవచ్చు.
2009 లో నిగూఢమైన సతోషి నకమోటో ద్వారా ప్రారంభించబడిన బిట్‌కాయిన్ ఇప్పటివరకు ఉనికిలో ఉన్న మొట్టమొదటి క్రిప్టోకరెన్సీగా విస్తృతంగా పరిగణించబడుతుంది. బిట్‌కాయిన్ అనేది రెండువిధాలుగా చేసే మార్పిడి విధానం, అంటే కరెన్సీ మరియు విలువ యొక్క నిల్వ లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడి వాడవచ్చు.
చాలా క్రిప్టోకరెన్సీల మాదిరిగానే, బిట్‌కాయిన్ అనేది వికేంద్రీకృత వర్చువల్ కరెన్సీ ఇంకా ఇది కేంద్రీకృత అధీకృత వ్యక్తి లేదా సంస్థచే స్వంతం చేసుకోబడదు లేదా నియంత్రించబడదు.
భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి ఎలా పెట్టాలి?
బిట్‌కాయిన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సరికొత్త తరగతికి చెందిన సంపందపై ఆసక్తి చూపుతున్నపెట్టుబడిదారులకు జన్మనిచ్చింది. అయితే ప్రత్యేకంగా భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనడం ఇంకా అమ్మడం ఎందుకని మీరు అడుగుతున్నారా? సరే, మొదటగా ఇది అధిక రాబడిని ఇస్తుంది మరియు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న సంపదలలో ఒకటి.
తరచుగా హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్ ధరతో రిస్క్ తీసుకునేందుకు సిద్దపడే పెట్టుబడిదారులకు మరియు వారి పెట్టుబడి నుండి త్వరగా మరియు అధిక రాబడిని పొందాలనుకునే వ్యాపారులకు ఇది మంచి పెట్టుబడిగా పనికొస్తుంది.
గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా పెట్టుబడిదారులు ఈరాకమైన సంపదపై తమ విశ్వాసాన్ని చాటుకోవడంతో బిట్‌కాయిన్ ధర పెరిగింది. దీని ధర 2020 చివరి నాటికి దాదాపు $30,000 కి పెరిగింది.
ఏప్రిల్ 2021 నాటికి, బిట్‌కాయిన్ ధర $53,000 కంటే కొంచెం ఎక్కువగా ఉంది – భారతదేశంలో బిట్‌కాయిన్ ధర దాదాపు 40 లక్షల రూపాయలు ఇంకా 2021 కి సంబంధించిన బిట్‌కాయిన్ ధర అంచనాల ప్రకారం, 2021 చివరి నాటికి బిట్‌కాయిన్ ధర $400,000 కి చేరవచ్చు!అంటే కాకుండా, బిట్‌కాయిన్ ఒక ద్రవ్యోల్బణ సంపదగా అభివృద్ధి చేయబడినందున, దాని సరఫరా 21 మిలియన్లకు పరిమితం చేయబడింది. బిట్‌కాయిన్ యొక్క పరిమిత సరఫరా ఇంకా అది సగానికి తగ్గడం వీటి నడుమ బిట్‌కాయిన్ తన పెట్టుబడిదారులకు ద్రవ్యోల్బణానికి ప్రతిగా రక్షణను అందిస్తుంది.
భారతదేశంలో బిట్‌కాయిన్ ఎలా కొనాలి?
భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టేందుకు మీకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇది మొదలుపెట్టేందుకు, మీరు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ ద్వారాభారతదేశంలో బిట్‌కాయిన్‌ని కొనవచ్చు ఇంకా అమ్మవచ్చు. ఇంకా మొదలుపెట్టని వారి కోసం, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ అనేది క్రిప్టోకరెన్సీలతో వ్యాపారం చేయడానికి మిమ్మల్ని అనుమతించే వర్చువల్ ప్లాట్‌ఫారమ్. డిజిటల్, స్వీయ-నియంత్రణతో ఏడాది పొడవునా 24/7 పనిచేయడం అనేది తప్ప, క్రిప్టో ఎక్స్ఛేంజ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కన్నా భిన్నంగా ఉండదు.
క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి మీకు సులభమైన మార్గం, అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ట్రేడింగ్ ఫీజు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల ఛార్జీని చెల్లించకుండా ఉండాలనుకుంటే లేదా నేరుగా ఎదుటి పార్టీతో వ్యాపారం చేయాలనుకుంటే, మీరు P2P, లేదా వ్యక్తి నుండి నేరుగా ఇంకో వ్యక్తితో క్రిప్టో లావాదేవీలుజరపవచ్చు.
ఈ సందర్భంలో, ఇప్పటికీ ఒక క్రిప్టో ఎక్స్ఛేంజీ అవసరపడవచ్చు, అయితే, అది మధ్యవర్తిగానే వ్యవహరిస్తుంది. ప్లాట్‌ఫారమ్ అనేది సాధారణంగా మీతో వ్యాపారం చేసే విక్రేత/కొనుగోలుదారుని కనుగొనడానికి పని కొస్తుంది. అయితే, ఈ పద్ధతి ఖచ్చితంగా క్రిప్టో ఎక్స్ఛేంజ్ ద్వారా భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడం కంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఎందుకంటే మీ డీల్‌కు సరిపోయే విక్రేత లేదా కొనుగోలుదారుని కనుగొనడం సుదీర్ఘ ప్రక్రియ. చివరగా, మీరు రివార్డ్‌లుగా కొత్తగా ముద్రించిన నాణేలను సంపాదించడానికి బిట్కాయిన్లను నేరుగా మైన్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, అయితే, బిట్‌కాయిన్ మైనింగ్ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ, మరియు మీరు ప్రత్యేక హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్వేర్ సహా ఖరీదైన మైనింగ్ పరికరాలు కలిగి ఉండటం అవసరం.
భారతదేశంలో మంచి బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ని ఎలా ఎంచుకోవాలి?
మీరు బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే, భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎక్స్ఛేంజ్ని నిర్ణయించే ముందు ప్లాట్‌ఫారమ్ మరియు దాని వెనుక ఉన్న బృందంపై సమగ్ర పరిశోధన చేయాలని నిర్ధారించుకోండి. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు ప్లాట్‌ఫారమ్ కింది ఇచ్చిన వాటిని అందిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి:
- ముందుగా, ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో సాధారణ వినియోగదారు ఇంటర్ఫేస్ ఉందని మరియు దానిని ఉపయోగించడం సులభంఅని నిర్ధారించుకోండి.
- ఇప్పుడు మార్పిడి బిట్‌కాయిన్ ట్రేడింగ్ జతలకు మద్దతు ఇస్తుందో లేదో తనిఖీ చేయండి.
- భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకునే ముందు విశ్లేషించడానికి భద్రత ఒక ముఖ్యమైన అంశం. KYC ప్రోటోకాల్ లేని ఎక్స్ఛేంజీల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
- చివరగా, బిట్‌కాయిన్‌ను తగిన ట్రేడింగ్ రుసుముతోకొనుగోలు చేయడానికి ఏ ప్లాట్‌ఫారమ్ మిమ్మల్ని అనుమతిస్తుందో తెలుసుకునేందుకు కొన్ని ఎక్స్ఛేంజీలను సరిపోల్చిచూడండి.
క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టండి:
బిట్‌కాయిన్ లావాదేవీలను సులభతరం చేసే అనేక భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో 2021 లో బిట్‌కాయిన్‌ని కొనుగోలు చేయడానికి సులభమైన మార్గం కోసం, మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన ఎక్స్ఛేంజ్తో ట్రేడర్ ఖాతాను సృష్టించడం మరియు వారి KYC ప్రక్రియను అనుసరించడం. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీరు మీ వ్యక్తిగత లేదా ప్లాట్‌ఫారమ్-నిర్దిష్ట వాలెట్‌కి (మీరు ఎంచుకున్న మార్పిడిని బట్టి) డబ్బును డిపాజిట్ చేయవచ్చు మరియు భారతదేశంలోని బిట్‌కాయిన్ ధర ప్రకారం బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు
భారతదేశంలో బిట్‌కాయిన్‌లో WazirX ద్వారా పెట్టుబడి ఎలా పెట్టాలి?
WazirX ద్వారా, మీరు భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడానికి సులభమైన మార్గాన్ని కనుగొంటారు. మీరు చేయాల్సిందల్లా క్రింది దశలను అనుసరించడం:
1. WazirX ఖాతాను సృష్టించండి:
- WazirX వెబ్‌సైట్‌కి వెళ్లి, సైన్ అప్ బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఇమెయిల్ చిరునామాను ఇవ్వండి మరియు బలమైన పాస్‌వర్డ్‌ను సృష్టించండి.
- WazirX సేవా నిబంధనలనుపరిశీలించి, నిబంధనలు మీకు నప్పితే చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి.
- పూర్తి చేయడానికి సైన్ అప్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ధృవీకరణ ఇమెయిల్ కోసం మీ ఇమెయిల్ ఇన్‌బాక్స్‌ని తనిఖీ చేయండి మరియు ఆ ఇమెయిల్‌లో, సైన్అప్ ప్రక్రియను పూర్తి చేయడానికి వెరిఫై ఇమెయిల్ ఎంపికను నొక్కండి.
- KYC ధృవీకరణ ప్రక్రియ కోసం, ఇచ్చిన ఎంపికల జాబితా నుండి మీ దేశాన్ని ఎంచుకోండి.
- మీరు ఇప్పుడు KYC ధృవీకరణ కోసం అడగబడతారు.
ఇప్పుడు మీరు మీ ఖాతా తెరిచే ప్రక్రియను పూర్తి చేసారు!
2. డిపాజిట్ నిధులు:
మీరు రెండు ఎంపికలలో WazirXలో భారతీయ రూపాయలను డిపాజిట్ చేయవచ్చు:
- మీరు UPI/IMPS/NEFT/RTGS ద్వారా డిపాజిట్ చేయవచ్చు. ఈ సందర్భంలో, ధృవీకరణ ప్రయోజనాల కోసం మీరు మీ లావాదేవీ వివరాలను WazirXకి సమర్పించాలి.
- మీరు UPI/IMPS/NEFT/RTGS ద్వారా డిపాజిట్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ లావాదేవీ వివరాలను సమర్పించే భాగాన్ని దాటవేయవచ్చు.
3. బిట్‌కాయిన్ కొనండి:
- INR లో తాజా బిట్‌కాయిన్ ధరలను చూడటానికి WazirX ఎక్స్ఛేంజ్ని సందర్శించండి.
- మీరు మీ డ్యాష్‌బోర్డ్‌లో కొనుగోలు మరియు అమ్మకం ఎంపికలను చూడటానికి క్రిందికి స్క్రోల్ చేయవచ్చు.
- కొనుగోలుని ఎంచుకున్న తర్వాత, మీకు కావలసిన ధరను Iభారతీయ రూపాయలలో మరియు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బిట్‌కాయిన్ మొత్తాన్ని నమోదు చేయండి.
- ప్లేస్ బై ఆర్డర్‌ని నొక్కండి, ఇంకా ఆర్డర్ అమలు అయ్యే వరకు వేచి ఉండండి.
అంటే అది పూర్తయింది! లావాదేవీని అమలు చేసినప్పుడు, మీరు మీ WazirX వాలెట్‌కి జోడించిన బిట్కాయిన్లను చూస్తారు!
భారతదేశంలో బిట్‌కాయిన్‌ని కొనుగోలు చేయండి: తరచుగా అడిగే ప్రశ్నలు
1. భారతదేశంలో బిట్‌కాయిన్ కొనేందుకు అవసరమైన కనీస మొత్తం ఎంత?
మే 2021 నాటికి, భారతదేశంలో బిట్‌కాయిన్ ధర దాదాపు 40 లక్షల రూపాయలు. ఈ ధర దాదాపు ప్రతి సెకనుకు మారుతూ ఉంటుంది. మీరు బిట్‌కాయిన్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేయవచ్చు, అయితే, కనీసం 100 భారతీయ రూపాయిలకు కూడా కొనవచ్చు.
2. భారతదేశంలో బిట్కాయిన్లను కొనడం చట్టబద్ధమైనదేనా?
ఇప్పటివరకు, బిట్‌కాయిన్‌కు భారతదేశంలోని ఏ కేంద్రానికి చెందిన అధికారవర్గాల ద్వారా ధృవీకరణ గాని లేదా నియంత్రణ చేయబడలేదు. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌కు సంబంధించి నిర్ణయించినటువంటి నియమాలు, నిబంధనలు లేదా మార్గదర్శకాలు లేవు. అందువల్ల, భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని చెప్పలేము.
3. నా బిట్‌కాయిన్ సురక్షితంగా నిల్వ చేయబడిందని నేను ఎలా నిర్ధారించుకోవాలి?
మీరు భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు వాటిని వినియోగదారులు బిట్‌కాయిన్‌ని నిల్వ చేయడానికి మరియు వ్యాపారం చేయడానికి అనుమతించే సాఫ్ట్వేర్ ప్రోగ్రాములైన బిట్‌కాయిన్ వాలెట్లలో నిల్వ చేయవచ్చు. బిట్‌కాయిన్ వాలెట్ల గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి, ఈ బిట్‌కాయిన్ వాలెట్ గైడ్‌ని చదవండి.
4. భారతదేశంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడానికి చట్టపరమైన విధానాలు ఏమిటి?
ముందుగా, మీరు KYC ప్రక్రియ ద్వారా వెళ్లాలి. దాని కోసం, మీకు మీ పాన్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే చిరునామా యొక్క రుజువు అవసరం. మీరు మీ బ్యాంక్ ఖాతాను ఎక్స్ఛేంజీ ఖాతాకు లింక్ చేసిన తర్వాత మరియు ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు భారతదేశంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి అర్హులు!
5. బిట్‌కాయిన్ వాలెట్‌ను ఎలా సెటప్ చేయాలి?
మీరు ఉపయోగించే ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ సాధారణంగా బిట్కాయిన్లను నిల్వ చేయడంలో మరియు విక్రయించడంలో సహాయం చేయడానికి మీకు బిట్‌కాయిన్ వాలెట్‌ను అందిస్తుంది. మీరు సైన్ ఇన్ చేసి, మీ ఖాతాను తెరిచిచినప్పుడు, వాలెట్ స్వయంచాలకంగా సెటప్ చేయబడుతుంది.
6. బిట్‌కాయిన్ ఇతర ప్రత్యానామాలు ఏమిటి?
మీరు ఎథేరియమ్, లైట్‌కాయిన్ మరియు రిప్పల్వంటి వాటిలో పెట్టుబడి పెట్టగల బిట్‌కాయిన్ లాగానే అనేక ప్రత్యామ్నాయ క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి.
భారతదేశంలో 2021 లో బిట్‌కాయిన్‌ను ఎలా కొనాలనే దాని గురించి మీకు మా గైడ్ ద్వారా సరైన సమాచారం దొరికిందని మేము ఆశిస్తున్నాము! హ్యాపీ ట్రేడింగ్!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.