Table of Contents
ప్రియమైన ట్రైబ్!
మీరు మీ క్రిప్టో ప్రస్థానానికి WazirXని ఎంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీకు ఏదైనా సహాయం కావాలంటే మేము మీ కోసం ఇక్కడ ఉన్నామని దయచేసి మరచిపోవద్దు. మా గైడ్‌లను చదివిన తర్వాత కూడా, మీకు ఏవైనా సందేహాలుంటే, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.
WazirX గైడ్స్
- WazirXలో ఖాతాను ఎలా తెరవాలి?
- WazirXలో KYC ప్రక్రియని ఎలా పూర్తి చేయాలి?
- WazirXలో బ్యాంక్ ఖాతాను జోడించడం ఇంకా INRని డిపాజిట్ ఎలా చేయాలి?
- Mobikwik ద్వారా మీ WazirX వాలెట్లో INRని ఎలా డిపాజిట్ చేయాలి?
- WazirX QuickBuy ఫీచర్‌తో క్రిప్టోని ఎలా కొనాలి?
- WazirXలో క్రిప్టోని కొనడం ఇంకా అమ్మడం ఎలా?
- WazirXలో క్రిప్టోను డిపాజిట్ ఇంకా విత్‌డ్రా చేయడం ఎలా?
- WazirXలో ట్రేడింగ్ ఫీజు ఎలా లెక్కించబడుతుంది?
- స్టాప్-లిమిట్ ఆర్డర్‌ను ఎలా ఉంచాలి?
- WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్లోడ్ చేయాలి?
- WazirX P2Pని ఎలా ఉపయోగించాలి?
- WazirX కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
- WazirX రిఫరల్ ఫీచర్ యొక్క ప్రయోజనాలేమిటి?
- అధికారిక WazirX ఛానెల్‌లు ఏవి ఇంకా WazirX మద్దతు కోసం ఎలా సంప్రదించాలి?
WazirX P2P అంటే ఏమిటి?
WazirX P2P (పీర్ టు పీర్) అనేది పెట్టుబడిదారులు తమ ఫియట్‌ను తక్షణమే క్రిప్టో (మరియు పరస్పర మార్పిడి)కి మార్చడంలో సహాయపడే వేదిక. సరళంగా చెప్పాలంటే, ప్లాట్‌ఫారమ్‌లోని మరొక కొనుగోలుదారు/విక్రేతతో మీరు సరిపోలారు, వారు తమ USDTని INRకి లేదా దానికి ప్రతిగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ, మార్పిడులు అందరికీ చౌకగా, వేగంగా & సరళంగా ఉంటాయి! కొనుగోలుదారులు మరియు విక్రేతల కోసం, లావాదేవీలను సురక్షితంగా ఉంచడానికి WazirX ఒక ఎస్క్రోగా పనిచేస్తుంది. ఇది ఉచిత ప్లాట్‌ఫారమ్ మరియు సురక్షితంగా ఇంకా ఖచ్చితంగా చట్టబద్ధత కలిగి 24×7 అందుబాటులో ఉంటుంది!
ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయాలు:
- భారతీయ KYC ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించగలరు.
- మీరు WazirX P2P ద్వారా మాత్రమే USDTని కొనగలరు. అంటే మీరు ముందుగా P2P ద్వారా USDTని కొనుగోలు చేయాలి ఇంకా WazirXలో ఇతర క్రిప్టోలను కొనడానికి USDTని ఉపయోగించాలి.
- మీరు ఫియట్‌ని మీ బ్యాంక్ ఖాతాకు తరలించాలనుకుంటే (క్రిప్టో పెట్టుబడులను నగదుగా మార్చుకోవడం), మీరు ముందుగా మీ క్రిప్టోలను USDTకి విక్రయించి, ఆపై ఆ USDTని P2P ద్వారా INRకి విక్రయించాలి.
WazirX P2Pని ఎలా ఉపయోగించాలి?
1వ దశ:
మొబైల్: WazirX యాప్‌లో, ‘ఎక్స్ఛేంజ్’ ట్యాబ్‌లో, ‘P2P’ని ఎంచుకోండి.
డెస్క్‌టాప్: హెడర్‌పై, ‘P2P’ని ఎంచుకోండి.
2వ దశ:
Mobile: Click on ‘Buy INR with P2P’
3వ దశ (మొబైల్ & డెస్క్‌టాప్):
కొనుగోలు ఆర్డర్‌ల కోసం: మీరు USDTని కొనుగోలు చేయాలనుకుంటున్న INR ధరను జోడించండి. కావలసిన సంఖ్యలో USDT టోకెన్‌లను జోడించి, ‘బయ్’ పై క్లిక్ చేయండి.
దయచేసి గమనించండి:
- The mini
- కనీస కొనుగోలు మొత్తం 14.5 USDT కంటే ఎక్కువగా ఉండాలి.
- ‘యాడ్ ప్రేఫెరెడ్ బయ్యర్ (ఐచ్ఛికం)’ లేదా ‘మీకు నచ్చిన కొనుగోలుదారుని జోడించు (ఐచ్ఛికం)’ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు మీ ప్రాధాన్య వ్యక్తి యొక్క XIDని జోడించవచ్చు ఇంకా మీరు ఇష్టపడే వ్యక్తికి INR లేదా క్రిప్టోను బదిలీ చేయవచ్చు. అయితే, XIDని జోడించడం పూర్తిగా ఐచ్ఛికం.
- మీరు ‘బయ్ ’ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, చెల్లింపు మోడ్‌ను ఎంచుకోవడానికి మీకు 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. బ్యాకెండ్‌లో, WazirX స్వయంచాలకంగా మిమ్మల్ని విక్రేతలకు సరిపోల్చుతుంది (ప్రాధాన్యత XID జోడించబడనప్పుడు).
4వ దశ (మొబైల్ & డెస్క్‌టాప్): ప్రాధాన్య చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి. మీరు UPI లేదా IMPSతో చెల్లించవచ్చు.
దయచేసి గమనించండి:
ఈ దశలో, విక్రేత ఎంచుకున్న దాని ప్రకారం చెల్లింపు ఎంపిక చూపబడుతుంది. WazirXలో, IMPS లింకింగ్ తప్పనిసరి. అయితే, UPIని లింక్ చేయడం ఐచ్ఛికం. అంటే, విక్రేత అతని/ఆమె UPI IDని అతని/ఆమె WazirX ఖాతాకు లింక్ చేసినట్లయితే మాత్రమే UPI ఎంపిక అందుబాటులో ఉంటుంది.
దయచేసి గమనించండి:
- కొనుగోలు ఆర్డర్‌ల విషయంలో, మీరు మీ ఆర్డర్‌కి చెల్లించాలని నిర్ధారిస్తే, చెల్లింపును పూర్తి చేయడానికి మీకు 60 నిమిషాలు అదనపు సమయం లభిస్తుంది.
- అయితే, “యెస్, ఐ విల్ పే” క్లిక్ చేసిన తర్వాత చెల్లించకపోతే అందుకు జరిమానా ఉంటుంది: కనీస పెనాల్టీ 10 USDT లేదా వాణిజ్య విలువలో 1.2% (ఏది ఎక్కువైతే అది) ఉంటుంది.
- తప్పుడు నిర్ధారణలు మీ ఖాతాను లాక్ అవడానికి దారితీయవచ్చు.
5వ దశ (మొబైల్ & డెస్క్‌టాప్): ‘యెస్, ఐ విల్ పే’ పై క్లిక్ చేయండి.
6వ దశ (మొబైల్ & డెస్క్‌టాప్): స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా చెల్లింపును పూర్తి చేయండి (విక్రేత బ్యాంక్/UPI వివరాలు). చెల్లింపు పూర్తయిన తర్వాత, మీరు చెల్లింపు రుజువును అప్‌లోడ్ చేసి, ఆపై చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, ‘ఐ హేవ్ పెయిడ్’ పై క్లిక్ చేయాలి.
దయచేసి గమనించండి:
- మీరు చెల్లింపును ఖాయపరిచిన తర్వాత, విక్రేత రసీదుని ధ్రువపరచాలి.
- విక్రేతలు చెల్లింపును వారు స్వీకరించినట్లు నిర్ధారించిన తర్వాత, మీ ఆర్డర్ పూర్తయినట్లు గుర్తించబడుతుంది మరియు కొనుగోలు చేసిన USDT మీ ‘ఫండ్స్’లో కనిపిస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
WazirX P2P USDTని మాత్రమే ఎందుకు కలిగి ఉంది?
USDT అనేది స్థిరత్వం కలిగిన కాయిన్. లావాదేవీలను సరళంగా ఉంచడానికి మరియు అధిక లిక్విడిటీని నిర్ధారించడానికి, USDT మాత్రమే మద్దతు ఇస్తుంది.
WazirX తీసుకున్న భద్రతా ప్రమాణాలు ఏమిటి?
అజ్ఞాత వ్యక్తులను విశ్వసించడం కష్టమని మాకు తెలుసు. మీ నిధులు సురక్షితంగా ఉన్నాయని నిశ్చయించుకోవడానికి, WazirX మొత్తం లావాదేవీని సురక్షితంగా ఉంచడానికి ఒక ఎస్క్రో సిస్టమ్‌ను కలిగి ఉంది, తద్వారా ఏ పక్షం వారు కూడా మరొకరిని మోసం చేయరు. మీరు విక్రేత అయితే – మీరు చెల్లింపు రసీదుని ధృవీకరించే వరకు WazirX మీ USDTని కొనుగోలుదారుకు విడుదల చేయదు మరియు మీరు కొనుగోలుదారు అయితే – మీరు విక్రేతకు చెల్లింపు చేస్తున్నప్పుడు WazirX విక్రేత USDTని కలిగి ఉంటారు. WazirXలో ట్రేడ్ చేయడానికి ప్రతి వినియోగదారుని అనుమతించే ముందు మేము వారి KYC వివరాలను కూడా ధృవీకరిస్తాము. మా ఎక్స్చెంజీలో జరిగే ప్రతి లావాదేవీకి సంబంధించిన రికార్డు సక్రమంగా నిర్వహించబడుతుంది.
మీరు ‘ఐ హేవ్ పెయిడ్’ పై క్లిక్ చేయడం మర్చిపోతే ఏమి చేయాలి?
‘రైజ్ డిస్‌ప్యూట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయడానికి మీకు 30 నిమిషాల సమయం ఉంటుంది. మీరు వివాదాన్ని లేవనెత్తిన తర్వాత, చెల్లింపు రుజువు కోసం మా డిస్‌ప్యూట్ టీమ్ నుండి మీకు వెంటనే అభ్యర్థన ఇమెయిల్ వస్తుంది. దయచేసి 15 నిమిషాలలోపు ఈ ఇమెయిల్‌కి జవాబు ఇవ్వండి. డిస్‌ప్యూట్ టీమ్ ఇతర వివరాలతో పాటు మీ చెల్లింపు రుజువును సమీక్షించి, మీ వివాదంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. డిస్‌ప్యూట్ టీమ్ యొక్క నిర్ణయమే అంతిమమైనది మరియు దానికే కట్టుబడి ఉండాలి ఇంకా దానిని మార్చలేము.
దయచేసి గమనించండి: వివాదాన్ని సమీక్షించేటప్పుడు పూర్తి ఖచ్చితత్వాన్ని నిర్ధారించే మల్టీ-చెక్ ఫూల్ ప్రూఫ్ ప్రక్రియ మా వద్ద ఉంది.
ఒకవేళ కొనుగోలుదారు వ్యాపారాన్ని ధృవీకరించడానికి బదులుగా వ్యాపారాన్ని రద్దు చేసినప్పుడు –WazirX P2Pలో లావాదేవీ విఫలమైతే రికవరీ (ఫండ్స్) ఎలా పని చేస్తుంది?
కొనుగోలుదారు చెల్లింపు చేసి, ఆపై లావాదేవీని రద్దు చేసినప్పుడు, మేము కొనుగోలుదారు చెల్లింపు వివరాలను విక్రేతతో షేర్ చేస్తాము ఇంకా కొనుగోలుదారుకు చెల్లింపును తిరిగి పంపమని వారిని అడుగుతాము. కొనుగోలుదారు వారి నిధులను తిరిగి పొందారని ధృవీకరించుకోవడానికి, మేము విక్రేత నిధులు మరియు/లేదా ఖాతాను లాక్ చేస్తాము మరియు చెల్లింపు రుజువుతో పాటు మొత్తం సమాచారంతో ఇమెయిల్‌ను పంపుతాము. ప్రతి 24 గంటలకు ఒకటి చొప్పున , మేము విక్రేతకు మొత్తం 3 రిమైండర్‌లను పంపుతాము. 3వది మరియు చివరి రిమైండర్ తర్వాత, మేము నిధుల రికవరీని కొనసాగిస్తాము, దీనికి గరిష్టంగా 13 పనిదినాలు పట్టవచ్చు (అయితే, నిధులు అందుబాటులో ఉన్నప్పుడే ఇది సాధ్యమౌతుంది).
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.