Skip to main content

క్రిప్టో విషయంలో విస్మరించవలసిన చెడు సలహాలు (The Worst Crypto Advice to Avoid)

By ఏప్రిల్ 13, 2022ఏప్రిల్ 19th, 20223 minute read

మీరు క్రిప్టో ప్రపంచంలో ఒక అనుభవం లేనివారైనా లేదా అనుభవజ్ఞుడైనప్పటికీ, మీరు ఒక్కోసారి కొన్ని నష్టాలను చవిచూశారు. ఇది అభ్యాస ప్రక్రియలో భాగం ఇంకా సర్వసాధారణం, కానీ మీరు గణనీయమైన నష్టాలను చవిచూడకుండా నేర్చుకోగలిగితే? క్రిప్టోకరెన్సీ మరియు ఇతర బ్లాక్‌చెయిన్ ఆస్తులను ట్రేడ్ చేసేటప్పుడు ఏమి చేయకూడదనే దానికి ఉదాహరణగా క్రిప్టోలోని కొన్ని చెడు సలహాలను పరిశీలిద్దాం.

టాప్‌లో ఉన్నవి కొనడం

టాప్‌లో ఉన్నవి కొనడం లేదా కాయిన్ ATH (ఆల్-టైమ్ హై) వద్ద ఉన్నప్పుడు కొనడం అనేది ఒక శుద్ధ పొరపాటు, ఇది ఖచ్చితంగా నష్టానికి దారి తీస్తుంది. మీరు ధరల పెరుగుదలను చూసి, FOMO(ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) (అవి కోల్పోతామనే భయం) లేదా మీరు ఇప్పటికే కాయిన్ కలిగి ఉన్నవారు – మీరు కూడా కొనడానికి ఒప్పించినట్లయితే ఇది జరుగుతుంది. ధర క్రాష్ అయినప్పుడు, మీ నష్టాలు 30% నుండి 40% వరకు సులభంగా చేరుకోవచ్చు. ఖచ్చితంగా, మీకు టాప్‌లో ఉన్నవి ఏమిటో తెలియకపోవచ్చు, కానీ ఏదైనా తెలివైన పెట్టుబడి సలహా మీరు డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండని చెప్పడం కంటే మీ డబ్బును కోల్పోకుండా చూడటానికి ప్రాధాన్యతనిస్తుంది.

ఈ పొరపాట్లనుండి తేరుకోవడానికి, మీరు చేయగల కొన్ని విషయాలు ఉన్నాయి:

  • WazirX వంటి ఎక్స్ఛేంజ్‌లో నాణెం యొక్క ఫైనాన్సియల్ చార్ట్‌లను తెరవండి, 
  • ప్రస్తుత పెరుగుదల నిలకడగా ఉందో లేదో నిర్ధారించండి. ధర వక్రత పారాబొలిక్ ఆకారంలో ఉంటే, పెరుగుదల సహజంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా నాణెం మళ్లీ ATHకి చేరుకునే అవకాశం లేనట్లే. 
  • లీనియర్ ధరల పెరుగుదల విషయంలో, మీ నష్టాలను తగ్గించుకోవచ్చుఇంకా బహుశా లాభార్జన పొందే ఆశ ఇప్పటికీ ఉండవచ్చు. మీరు విక్రయించడానికి ఆమోదయోగ్యమైన ధరను కనుగొనే వరకు మీరు చేయాల్సిందల్లా వేచి ఉండి, చార్ట్‌లను తనిఖీ చేయడమే.

వాస్తవానికి, ఇవన్నీ చాలా సులభతరం చేయబడ్డాయి. చార్ట్‌లను అచ్చంగా అర్థం చేసుకోవడానికి, మీరు WazirX బ్లాగ్‌కి వెళ్లాల్సిందే ఇంకా క్రిప్టోలో సాంకేతిక విశ్లేషణ గురించి దాని పోస్ట్‌లను చదవాలి.

via WazirX

మైక్రో-క్యాప్ కాయిన్‌లను కొనడం

కాయిన్ ధర చాలా చౌకగా ఉండటం లేదా ఒక వ్యక్తి లేదా గ్రూపు ఆమోదించినందున దానిని కొనడమనేది అనుభవశూన్యుడు చేసే తప్పులాంటిది. ఈ కేటగిరీకి చెందిన చాలా కాయిన్లను ఎటువంటి వినియోగ సందర్భం లేదా చాలా పరిమిత వినియోగ సందర్భం లేదా వాటి ఉత్తమ వినియోగ సందర్భం – వాటి సామర్థ్యాన్ని ఇంకా నిరూపించబడలేదు. ఈ పొరపాటు చేయకుండా ఉండటానికి కాయిన్ యొక్క టోకెన్ ధరకు బదులుగా దాని మార్కెట్ క్యాప్‌ని తనిఖీ చేయాలి. ఎందుకంటే, క్రిప్టో దాని ధరను ఎంత పంచుకోగలదో మార్కెట్ క్యాప్ నిర్ణయిస్తుంది.

క్రిప్టో వృద్ధికి సంబంధించి అది ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉందో మీకు తెలియకపోతే, అదే కాయిన్ కేటగిరీలో ఉన్న ఇతర కాయిన్లను తనిఖీ చేయండి మరియు అది ఎక్కడ ఉందో చూడటానికి వారి రోజువారీ ట్రేడెడ్ వాల్యూమ్‌లు, మార్కెట్ క్యాప్ ఇంకా ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌లను సరిపోల్చాలి.

ఎండోర్స్‌మెంట్ కారణంగా కాయిన్‌ కొనడం

క్రిప్టోకరెన్సీని కేవలం ప్రముఖ వ్యక్తులు దానిని ప్రచారం చేస్తున్న కారణంగ మీరు ఎప్పుడూ అందులో పెట్టుబడి పెట్టకూడదు. మార్కెట్ సప్లయ్‌లో వారు పెద్ద వాటాను కలిగి ఉండే అవకాశం ఉంది. తగినంత మంది వ్యక్తులు తమ విలువైన కాయిన్లను కొన్నప్పుడు, ప్రముఖ వ్యక్తులు వారి నాణేలను అమ్మి మంచి లాభం గడించాలని అనుకోవచ్చు, ఇది సాధారణ పెట్టుబడిదారులను తీవ్రంగా నష్టపోయేలా చేస్తుంది.

అధిక నాణ్యత గల కాయిన్లు చక్కగా పుంజుకోవడానికి ప్రకటనలు అవసరం లేదు కాబట్టి ప్రసిద్ధ వ్యక్తులు ప్రలోభపెట్టి ప్రోత్సహించే అన్ని కాయిన్లను విస్మరించండి. కాయిన్ కొనేముందు దాని శ్వేతపత్రాన్ని చదవడం మంచి ఆలోచన ఇంకా ఇది సంభవించే స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

సోషల్ మీడియా ప్రభావంతో కాయిన్‌ కొనడం

రెడ్డిట్, ట్విట్టర్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్‌లు మీరు బహుశా ఎప్పుడూ వినని కాయిన్ల గురించి ఉన్న పేజీలతో నిండి ఉన్నాయి లేదా దుర్లభమైన వినియోగ కేసులు ఉన్న కాయిన్లను కలిగి ఉంటాయి. మీరు చాలా కాలం వీటిని హోల్డ్ చేస్తే, వాటి ధర ‘చంద్రునికి తాకేంతగా’ పెరగడం గురించి వారు మాట్లాడతారు. ఒక నిర్దిష్ట కాయిన్ కోసం ప్రలోభపరిచే ప్రతి ఒక్కరూ డెవలపర్‌లచే చెల్లించబడతారని లేదా ప్రాజెక్ట్‌లో ఎక్కువ సమయాన్ని ఇంకా డబ్బును పెట్టుబడి పెట్టారని గుర్తుంచుకోండి, దాని ఫలితంగా వారు వాటికి అనుకూలంగా వాటిపై ఎక్కువగా పక్షపాత ధోరణిని చూపుతారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న హైప్‌తో కళ్ళుకమ్మెయకుండా ఉండటానికి, DYOR(డూ యువర్ ఓన్ రీసెర్చ్) లేదా మీ స్వంత పరిశోధన చేయడం అవశ్యం. మీ స్వంతంగా రీసెర్చ చేయడమనేది కాయిన్ భవిష్యత్ సామర్థ్యాన్ని కలిగి ఉందో లేదో లేదా అది ప్రారంభకులను ఆకర్షించడానికి ఉపయోగించే స్కామ్ అని తెలుసుకోవడానికి ఒక ఖచ్చితమైన మార్గం.

మార్కెట్ క్రాష్ అవుతుందని విక్రయించడం

అనుభవజ్ఞులైన వ్యాపారులు కూడా కొన్ని సందర్భాల్లో బలైపోయే పొరపాటు ఇది. మార్కెట్ క్రాష్ భయాలు ఈక్విటీ ఇంకా క్రిప్టో పర్యావరణ వ్యవస్థ రెండింటిలోనూ స్థిరంగా ఉంటాయి. మార్కెట్ క్రాష్ ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజలు తరచుగా మర్చిపోతున్నారు. ఒక క్రాష్ తర్వాత పుంజుకోవడం జరుగుతుంది; తొందర్లోనే. ఈ సందర్భంలో, ఉత్తమ పరిష్కారం కేవలం హోల్డ్ చేయడం. లేదా కనీసం, తక్కువకి విక్రయించవద్దు.

మనందరికీ తెలిసినట్లుగా, మార్కెట్ అనూహ్యమైనది. ఫిబ్రవరిలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా భారీ క్రాష్ భయాలు పట్టుకొన్నాయి. మరుసటి రోజు, ఈ భయాలు నిజం కాలేదు, ఎందుకంటే మార్కెట్లు వాస్తవానికి పతనమవకుండా పైపైకి దూసుకువెళ్ళాయి.

ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వడం

కొందరు వారి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచకపోవడం ఇంకావారి నిధులన్నింటినీ ఒకే ఒక కాయిన్‌పై పెట్టుబడి పెట్టడం అనేది ఒక వ్యక్తి చేసే అత్యంత ఘోరమైన తప్పు. ఇది చాలా అరుదుగా పనిచేస్తుంది, కానీ తరచుగా అలా జరగదు, ఇది ఒక విపరీత ఆలోచన. ఏదైనా ఒకే ఒక కాయిన్‌పై పెట్టే పెద్ద పెట్టుబడి పెద్ద ప్రమాదకారకం కావొచ్చు, ఎందుకంటే స్వల్ప పతనం కూడా మీ లాభాలలో ఎక్కువ శాతాన్ని తుడిచిపెట్టేయగలదు.

దీన్ని నివారించడానికి ఏకైక మార్గం మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం. మీ క్రిప్టో పోర్ట్‌ఫోలియో యొక్క విభిన్నత అనేది ఒక తెలివైన పని ఇంకా ఒక క్రిప్టో పతనమైనప్పుడు మీ నష్టాలను నివారించడంలో సహాయపడుతుంది.

Conclusion

“క్రిప్టోలో పెట్టుబడి పెట్టేటప్పుడు చేయకూడని పనుల” జాబితాను పరిశీలించిన తర్వాత, క్రిప్టో ట్రేడర్లు ఎంతోకాలంగా ట్రేడ్ చేస్తున్నా సరే, వారు చేసే కొన్ని సాధారణ పొరపాట్ల గురించి మీకు కాస్త ఎక్కువ అవగాహన కలిగిఉన్నారని అనుకుంటున్నాము. ఈ అప్రమత్తత పెంచే సమాచారంతో , మీరు తదుపరి ఏ కాయిన్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు?

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply