
నమస్కారం మిత్రులారా!
మీ క్రిప్టో ప్రయాణం మరింత సునాయాసంగా, సున్నితంగా మరియు వేగంగా జరిగేలా మేము నిరంతరం మా ప్రయత్నాలను చేస్తున్నాము; ఒక సమయంలో ఒక ఫీచర్ తెచ్చేలా. విత్‌డ్రాల ప్రక్రియ వేగంగా, సురక్షితంగా ఇంకా ఆటంకాలు లేకుండా ఉండేలా చూసుకోవడానికి, మేము ఎక్కువగా అభ్యర్థించిన అడ్రస్ బుక్ ఫీచర్‌ని పరిచయం చేసాము.
చిరునామా మరియు మెమో వివరాలను నమోదు చేయడం గురించి చింతించకుండా అడ్రస్ బుక్ నుండి నేరుగా చిరునామాను ఎంచుకోవడం ద్వారా విత్‌డ్రాల ప్రక్రియ సమయంలో వినియోగదారులు ఇప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
అడ్రస్ బుక్‌ను ఎలా ఉపయోగించాలి?
వెబ్:
- మీ WazirX అకౌంట్లోకి లాగిన్ అవ్వండి
- ఇప్పుడు ఫండ్స్ కి వెళ్ళండి
- ఇప్పుడు “విత్‌డ్రా” పై క్లిక్ చేయండి
- ఇప్పుడు “సేవ్ చేసిన అడ్రెస్లు” పై క్లిక్ చేయండి
- యూజర్లు ఇప్పుడు గతంలో సేవ్ చేసిన చిరునామాలను వీక్షించగలరు ఇంకా కొత్త చిరునామాలను కూడా జోడించే అవకాశం ఉంటుంది.
- మొదటి సారి చిరునామాను సేవ్ చేస్తూంటే:
- “అడ్రెస్‌ను యాడ్ చేయండి” పై క్లిక్ చేయండి
- మీరు సేవ్ చేయాలనుకుంటున్న గమ్యస్థాన చిరునామాను నమోదు చేయండి
- అవసరమైతే మెమో ట్యాగ్‌ని నమోదు చేయండి
- “సేవ్ చేయి” పై క్లిక్ చేయండి
- గతంలో సేవ్ చేసిన అడ్రెస్‌లను ఎంచుకోవడానికి
- ఇప్పటికే సేవ్ చేయబడిన గమ్యస్థాన చిరునామాల నుండి ఎంచుకోండి
- మొదటి సారి చిరునామాను సేవ్ చేస్తూంటే:



మొబైల్:
- ఇప్పుడు ఫండ్స్ కి వెళ్ళండి
- ఇప్పుడు “విత్‌డ్రా” పై క్లిక్ చేయండి
- “కాంటాక్ట్ బుక్ ఐకాన్” పై క్లిక్ చేయండి
- యూజర్లు ఇప్పుడు గతంలో సేవ్ చేసిన చిరునామాలను వీక్షించగలరు ఇంకా కొత్త చిరునామాలను కూడా జోడించే అవకాశం ఉంటుంది.
- మొదటి సారి చిరునామాను సేవ్ చేస్తూంటే:
- “అడ్రెస్‌ను యాడ్ చేయండి” పై క్లిక్ చేయండి
- మీరు సేవ్ చేయాలనుకుంటున్న గమ్యస్థాన చిరునామాను నమోదు చేయండి
- అవసరమైతే మెమో ట్యాగ్‌ని నమోదు చేయండి
- “సేవ్ చేయండి” పై క్లిక్ చేయండి
- గతంలో సేవ్ చేసిన చిరునామాలను ఎంచుకోవడానికి
- ఇప్పటికే సేవ్ చేయబడిన గమ్యస్థాన చిరునామాల నుండి ఎంచుకోండి
- మొదటి సారి చిరునామాను సేవ్ చేస్తూంటే:



అడ్రస్ బుక్ మీ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ఇంకా మీ క్రిప్టో ప్రయాణంలో మీకు తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాము.
హ్యాపీ ట్రేడింగ్!!
