Table of Contents
మన జీవితంలో ఏదో ఒక సమయంలో, మనకు తెలియని పోటీలో పాల్గొన్నందుకు మిలియన్ల కొద్దీ డాలర్లు గెలుచుకున్నట్లు క్లెయిమ్ చేసే ఇమెయిల్‌లు ఇంకా టెక్స్ట్ సందేశాలు అందుకున్నామని మనదారికి తెలుసు. సాధారణంగా, ఈ అనుమానాస్పద ఇమెయిల్ లేదా సందేశం బూటకమని మనం తక్షణమే గుర్తించగలము కాబట్టి వాటిని చూసి నవ్వుకొని ముందుకు సాగాము.
కానీ క్రిప్టోకరెన్సీ విషయానికి వస్తే, మీరు కూడా అలాగే స్పందించగలరని అనుకుంటున్నారా? మీరొక వాస్తవ ప్రాజెక్ట్‌కి క్రిప్టో స్కామ్‌కి తేడాను ఎంత సులభంగా గుర్తించగలరు? మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.
క్రిప్టో మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి
రోజులు గడిచే కొద్దీ, క్రిప్టోకరెన్సీ మరింత ఎత్తుకు చేరుకుంటోంది. క్రిప్టోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు మరియు సంస్థాగత పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న కారణంగ, త్వరగా ధనవంతులుగా మారడానికి ఎంతకైనా తెగించి త్వరగా డబ్బులు సంపాదించాలని చూస్తున్న స్కామర్‌లకు కూడా వారు లక్ష్యంగా మారారు.
స్కామర్‌లు తరచుగా నమ్మించే మోసపూరిత మాటలు చెప్పి ఇంకా ఇంటర్నెట్ యొక్క గోప్యనీయతను వారి స్వప్రయోజనం కోసం ఉపయోగించుకొని క్రిప్టో స్పేస్‌లో కలిసిపోతారు. తరచుగా, వారి మాటలు ఎంతో వాస్తవంలా అనిపించి, వ్యక్తులు త్వరగా వారి ఉచ్చులో పడిపోతారు. క్రిప్టోకరెన్సీ గురించి చాలా మందికి ఇంకా తెలియని కారణంగా ఇలాంటివి జరుగుతాయి – వారిలో చాలామందికి ఏది అసలైనదో మరియు ఏది మోసపూరితమైనదో చెప్పడం కష్టసాధ్యమే. దీనికి తోడుగా, క్రిప్టోకరెన్సీలు అందరూ సులభంగా అర్థం చేసుకోలేని సాంకేతిక అంశాలు అని చాలా మంది నమ్ముతారు.
అందుకే, మీరు క్రిప్టోకరెన్సీని ఉపయోగించడం ప్రారంభించే లేదా దానిలో పెట్టుబడి పెట్టే ముందు, క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుందో మరియు నగదు ఇంకా ఇతర చెల్లింపు పద్ధతులకు భిన్నంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కీలకం. మీరు ఉచ్చులో పడి మీ మొత్తం ఆర్జించిన నిల్వలను కోల్పోకూడదనుకుంటే, మీరు క్రిప్టోకరెన్సీ స్కామ్‌లను గుర్తించడం ఇంకా ప్రమాదకరమైన క్రిప్టో ఖాతాలను గుర్తించడం కూడా నేర్చుకోవాలి
ఇక్కడ కొన్ని ప్రముఖ క్రిప్టో స్కామ్‌లు ఉన్నాయి ఇంకా మీరు వాటిని ఎలా గుర్తించవచ్చు.
వంచకుల మోసాలు
మోసగాళ్ల స్కామ్‌లు తరచుగా ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్లు లేదా ప్రసిద్ధ వ్యక్తులను అనుకరిస్తూంటాయి. ప్రస్తుతం, సమాచారం ప్రకారం నష్టాలలో దాదాపు 14% క్రిప్టోకరెన్సీలు బాధ్యత వహిస్తాయి. ఈ మోసాలలో ఎక్కువ భాగం (దాదాపు 86%) ఫియట్ నగదును ఉపయోగించి చేస్తున్నారు. అయినప్పటికీ, క్రిప్టో పరిశ్రమ విపరీతమైన వేగంతో వృద్ధి చెందడం కొనసాగిస్తున్నందున, ఈ నిష్పత్తి మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న ధోరణి కొనసాగితే, రాబోయే కొన్ని సంవత్సరాల్లో డిజిటల్ కరెన్సీ నష్టాల శాతం నిస్సందేహంగా పెరుగుతుంది.
వాస్తవానికి, FTC డేటా ప్రకారం, 2020 నుండి క్రిప్టో మోసాల ఆరోపణలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, 7000 మంది వినియోగదారులు మొత్తం $80 మిలియన్ల కంటే ఎక్కువ నష్టాలను ప్రకటించారు.
కాబట్టి
వంచకులు చేసే స్కామ్‌లు తరచుగా ఏదో ఒక కానుకలతో స్కామ్‌లు జతచేయబడతాయి, ఇందులో మోసగాళ్లు వారికి చెల్లించిన క్రిప్టోకు రెట్టింపు లేదా సరితూగగల మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. చాలా మంది వినియోగదారులు దానిని ప్రముఖ వ్యక్తులు లేదా ప్రభావశీలి వ్యక్తులుగా పొరపాటుపడి స్కామర్ యొక్క వాలెట్‌కు క్రిప్టోలను పంపినట్లు కూడా తెలిపారు. ఉదాహరణకు, వినియోగదారులు గత ఆరు నెలల్లో ఎలోన్ మస్క్ ముసుగులో ఉన్న నకలీగాళ్లకు $2 మిలియన్ కంటే ఎక్కువ క్రిప్టోకరెన్సీలను బదిలీ చేసినట్లు తెలిపారు.
స్కామర్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు టెలిగ్రామ్ సమూహాలలో WazirX మద్దతు, నిర్వహణ లేదా ఉద్యోగులమని మోసపూరిత లింక్‌లను పోస్ట్ చేయవచ్చు. ఇలాంటి నకిలీ ఖాతాలు ఇంటర్నెట్ అంతటా కనిపిస్తాయి. దయచేసి Twitter లేదా Facebook నుండి వచ్చే ఆఫర్‌లను నమ్మవద్దు, ప్రత్యేకించి అంతటి రాబడి సాధించడం అసాధ్యం అని మీకనిపిస్తే.
మోసగాళ్ళా ఖాతాను గుర్తించడానికి ఉత్తమ మార్గమేమంటే మీరు పొందబోయే రాబడిని అంచనా వేయడమే. క్రిప్టో ఆఫర్ నమ్మలేనంత మంచిగా అనిపిస్తే, దానిని మీరు ప్రమాద సంకేతంగా భావించాలి. ఇది నిజం కానందున నమ్మలేనంతగా బాగుంటుంది.
క్లోన్ చేయబడ్డ (సమరూప) వెబ్‌సైట్‌లు
బోగస్ వెబ్‌సైట్‌లు స్కామర్‌లు అనుసరించే మరో సాధారణ ట్రిక్. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి లేదా మైనింగ్ చేయడానికి అవకాశాలను అందించే వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా అనేక మంది వ్యక్తులు మోసగించబడ్డారు, కానీ వాస్తవానికి అవి నకిలీవి. ఈ వెబ్‌సైట్‌లు తరచుగా బాగా రూపొందించబడి నైతికమైనవిగా కనిపించి, వ్యక్తులు తమ క్రిప్టోలను వేగంగా నిస్సకోచంగా బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.
సాధారణంగా, ఇటువంటి వెబ్‌సైట్‌లు అధిక పెట్టుబడి, అధిక రాబడి, వంటి వివిధ పెట్టుబడి శ్రేణులను కలిగి ఉంటాయి. వెబ్‌సైట్‌లను విశ్వసనీయంగా కనిపించేలా చేయడానికి నకిలీ టెస్టిమోనియల్‌లు మరియు క్రిప్టోకరెన్సీ పరిభాషలు ఉపయోగించబడతాయి, అయితే నమ్మశక్యం కాని గ్యారెంటీ రిటర్న్‌ల దావాలు మోసపూరితమని వినియోగదారులు అర్థం చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లు మీ డబ్బు పెరుగుతోందనే భ్రాంతిని కూడా మీకు కలగజేయవచ్చు. కానీ మీరు పొందిన లాభాలను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మిమ్మల్ని మరింత క్రిప్టోను బదిలీ చేయమని వారు అడుగుత్తరు – అయితే చివరికి ప్రతిఫలంగా మీరేమీ పొందలేరు.
మీరు లావాదేవీలు నడుపుతున్న వెబ్‌సైట్ నైతికమైనదా కాదా అని మీకు తెలియజేసే అనేక సంకేతాలు ఉన్నాయి. ఉదాహరణకు, URL బార్‌లో లాక్ చిహ్నం లేనట్లైతే ఆ సైట్ సురక్షితం కాదని సూచిక. చెల్లింపులు చేస్తున్నప్పుడు మీరు ఒక సైట్ నుండి మరొక సైట్‌కి మళ్లించబడుతుంటే ఇది గమనించవలసిన మరో విషయం. సైట్ మళ్లింపు లింక్ నైతికమైన సైట్‌గా కనిపించవచ్చు; అయితే, URLని నిశితంగా పరిశీలిస్తే, నకలీ URLలో “o” అక్షరం కాకుండా సున్నా సంఖ్య ఉందని తెలుస్తుంది. ఫలితంగా, మీరు మీ బ్రౌజర్‌లో ఖచ్చితమైన URLని ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి ఇంకా దాన్ని ఒకటికి రెండుసార్లు పరీక్షించండి.
రొమాన్స్ స్కామ్‌లు
రొమాన్స్ స్కామ్‌లు అనేది క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లలోకి ప్రజలను ఆకర్షించడానికి ఆన్‌లైన్ డేటింగ్‌ను ఉపయోగించుకునే ఒక రకమైన స్కామ్. స్కామర్‌లు సాధారణంగా డేటింగ్ యాప్‌లు మరియు సోషల్ మీడియా ద్వారా బాధితులతో సంప్రదింపులు జరుపుతారు. వారి నమ్మకాన్ని సంపాదించడానికి ఇంకా వారి బంధం నిజమైనదని వారిని బుజ్జగించడానికి వారు బాధితుల పట్ల ఆపేక్ష ప్రేమ ఆసక్తిని ప్రదర్శిస్తారు. బాధితుల పూర్తి నమ్మకాన్ని గెలిచిన తర్వాత, స్కామర్‌లు క్రిప్టో నిపుణుల వలె నటిస్తారు మరియు క్రిప్టోకరెన్సీని వారికి పంపడం ద్వారా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టొచ్చని బాధితులని ఒప్పిస్తారు స్కామర్ బాధితులు నగదు పంపిన తర్వాత ఉద్దేశించిన ఖాతా నుండి మితంగా లాభాన్ని ఉపసంహరించుకునేలా కూడా చేయగలడు.
విజయవంతమైన ఉపసంహరణ చేసిన తర్వాత, స్కామర్ బాధితులకి ఎక్కువ మొత్తంలో డబ్బు పేటమని చెబుతాడు మరియు బాధితులని “త్వరగా పని ముగించమని” కోరతాడు. బాధితుడు మరోసారి నిధులను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అసలు సమస్యలు తలెత్తుతాయి. స్కామర్ డబ్బును ఎందువల్ల ఉపసంహరించుకోలేము అనే వివిధ కారణాలను వివరిస్తాడు మరియు బాధితుడు నిధులను బదిలీ చేయడం ఆపివేసినప్పుడు వర్చువల్ సంబంధం చివరకు ముగుస్తుంది.
FTC ప్రకారం, చాలా మంది వ్యక్తులు తమ ప్రేమ ఆసక్తి ఒక హాట్ క్రిప్టో అవకాశం గురించి చర్చించడం ప్రారంభించేంత వరకు వారు సుదూర సన్నిహిత సంబంధంలో ఉన్నారని పొరబాటుగా భావించారని పేర్కొన్నారు. అక్టోబర్ 2020 నుండి, రొమాన్స్ స్కామ్‌లలో పోగొట్టుకున్న డబ్బులో దాదాపు 20% క్రిప్టోకరెన్సీలో బదిలీ చేయబడింది, వీటిలో చాలా ఫిర్యాదులు తాము పెట్టుబడి పెడుతున్నామని భావించిన వ్యక్తుల నుండి వస్తున్నాయి.
రొమాన్స్ స్కామ్‌కు గురికాకుండా ఉండటానికి మీరు ఏమి చేయాలి. మీరు ఇంటర్నెట్‌లో మాత్రమే కలుసుకున్న వారి సలహా ఆధారంగా డబ్బు పంపకండి, వ్యాపారం చేయకండి లేదా పెట్టుబడి పెట్టకండి మరియు అపరిచితులతో మీ ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడూ చర్చించకండి. మీరు ప్రత్యేకమైన పెట్టుబడి వనరులను కలిగి ఉన్నారని మరియు వీలైనంత త్వరగా పని చేయడానికి మిమ్మల్ని పురికొల్పే వ్యక్తుల ఉచ్చులో పడకుండా చూసుకోండి. క్రిప్టోకరెన్సీలను వారి వాలెట్లలోకి పంపమని ఒక కాలర్ గాని, ప్రేమ ఆసక్తి, ఏదైన ఒక సంస్థ లేదా ఎవరైనా మిమ్మల్ని డిమాండ్ చేస్తే అది స్కామ్ అని మీరు ఖచ్చితంగా భావించవచ్చు. అలాగే, ఇంటర్నెట్‌లో అపరిచితులకు సున్నితమైన లేదా వ్యక్తిగత సమాచారాన్ని అందించకుండా ఉండండి.
చివరిగా మరొక్క విషయము.
ఫిషింగ్ స్కామ్‌లు, బహుమతి స్కామ్‌లు, రొమాన్స్ స్కామ్‌లు, రాగ్ పుల్, పంప్ మరియు డంప్‌లు – మీకు దానిని ఎలాగైనా పిలవండి; క్రిప్టో స్కామ్‌లు అన్నిచోట్ల ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు దేనికోసం పనిచేసిరో అందులో ప్రతిదాన్ని కోల్పోవచ్చు.
క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను ప్రారంభించడానికి ముందు, మీరు మరింత జాగ్రత్తగా ఉన్నారని నిర్ధారించుకోండి మరియు ఏదైనా సరిగ్గా అనిపించకపోతే లేదా అనైతికమనిపిస్తే, మీ విజ్ఞతను విశ్వసించండి. WazirX క్రిప్టో వాలెట్లలోకి డబ్బు పంపమని వినియోగదారులను ఎప్పుడూ అడగదు.WazirX ఎక్చేంజీని వీక్షించడానికి, ఇక్కడక్లిక్ చేయండి.
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.