Skip to main content

భారతదేశంలో క్రిప్టో ఉద్యోగం ఎలా పొందాలి (How to Get a Crypto Job in India)

By డిసెంబర్ 1, 2021జనవరి 20th, 20224 minute read

గత సంవత్సరం మహమ్మారి వల్ల, భారతదేశంలో పట్టణ నిరుద్యోగం దాదాపు 20%కి పెరిగింది. మూతపడిన దుకాణాలు, కార్యాలయాలు, లేబర్‌ వర్క్‌ లేకపోవడం మొదలైనవి ఇలాంటి నిరుద్యోగానికి కారణమయ్యాయి. అయితే, క్రిప్టో మార్కెట్ కంట్రిబ్యూటర్‌లు ఈ జాబితాలోకి చేరలేదు.

దాదాపు ప్రతి మూడు నెలలకొకసారి మార్కెట్ పెరుగుదలను చూపిస్తూ, క్షేమంగా ఉన్న అతి కొద్ది రంగాలలో క్రిప్టో మార్కెట్ ఒకటిగా మనగలిగింది. వీటికి భిన్నంగా, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా విజృంభించింది. ఇప్పుడు, పరిశ్రమ ఛ్ఛ దశలో ఉన్నప్పుడు, డిమాండ్‌లో పెరుగుదల మరింత ఉపాధిని, అంటే ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ముందుకుపోతోంది. క్రిప్టోలో కెరీర్‌లు భారతదేశంలో చాలా విజయాలు మరియు వృద్ధిని సాధించాయి. మీరు భారతదేశంలో క్రిప్టో కెరీర్ కోసం వెతుకుతున్నట్లయితే, ఈ పోస్ట్‌ను మీరు ఉద్యోగం పొందేందుకు మీ చివరి మజిలీ. ఇన్ని రకాల ఉద్యోగాల నుండి మీరు ఒకదాన్ని ఎలా పొందవచ్చు అనే దానికి, మేము భారతదేశంలో క్రిప్టో ఉద్యోగాన్ని కనుగొనడం మరియు దానికి మిమ్మల్ని అనుసంధిచడం గురించి అన్నింటినీ కవర్ చేస్తాము.

క్రిప్టో ప్రపంచంలో ఉద్యోగాల రకాలు

క్రిప్టో స్పేస్‌లో కెరీర్‌ల గురించి USP వారు చాలా భిన్నంగా ఉంటారు. క్రిప్టో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా సాంకేతిక నైపుణ్యం కలిగిన వ్యక్తి కావలసిన అవసరం లేదు.

డేటా సైంటిస్ట్

ప్రస్తుతం క్రిప్టో పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలలో డేటా సైంటిస్ట్ ఒకటి.

డేటా సైంటిస్టులు ఫిల్టర్ చేయని విస్తారమైన డేటా నుండి యక్షనబుల్ ఇన్సైట్స్‌లను సృష్టిస్తారు ఇంకా వాటికి సరైన, పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు. మెషిన్ లెర్నింగ్ వంటి అనేక సాధనాలు మరియు నైపుణ్యాలు అటువంటి ఇన్సైట్స్‌లను సాధించడంలో సహాయపడతాయి.

మీరు చివరి లైన్ చదివే వరకు కూడా ఓపికగా ఉండండి

ఇవి ఉత్పన్నమైన తర్వాత, ఈ ఇన్సైట్స్‌లు వాటాదారులకు ఫార్వార్డ్ చేయబడతాయి, ఇవి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి సంస్థలకు సహాయపడతాయి.

బ్లాక్‌చెయిన్ డెవలపర్

బ్లాక్‌చెయిన్ అభివృద్ధిలో రెండు ప్రముఖ పాత్రలు ఉన్నాయి.

బ్లాక్‌చెయిన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మరియు కోర్ బ్లాక్‌చెయిన్ డెవలపర్ ఉన్నాయి, రెండు వర్గాలు వేర్వేరు పాత్రలను కలిగి ఉంటాయి.

కోర్ బ్లాక్‌చెయిన్ డెవలపర్ నిర్మాణం మరియు బ్లాక్‌చెయిన్ సిస్టమ్ యొక్క భద్రతను అభివృద్ధి చేయడంలో బాధ్యత వహిస్తాడు.. 

మరోవైపు, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ వికేంద్రీకృత అప్లికేషన్‌లు/స్మార్ట్ కాంట్రాక్టులను సృష్టిస్తుంది, పర్యవేక్షిస్తుంది మరియు అవి అనుకున్న విధంగా పనిచేస్తాయని నిర్ధారిస్తుంది. మీరు బ్లాక్‌చెయిన్ డెవలపర్‌గా మీ కెరీర్‌ని ప్రారంభించాలనుకుంటే, భారతదేశంలోని క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఒకటైన WazirX, ఈ రోల్ కోసం ఉద్యోగాలను కలిగి ఉంది.

ఈ ఉద్యోగం కోసం మీకు కావలసిన కొన్ని నైపుణ్యాలు ఇక్కడ ఉన్నాయి:

  • క్రిప్టోగ్రఫీ
  • స్మార్ట్ కాంట్రాక్ట్‌లు మరియు డేటా స్ట్రక్చర్‌ల పరిజ్ఞానం
  • బ్లాక్‌చెయిన్ ఆర్కిటెక్చర్ పై అవగాహన
  • వెబ్ డెవెలప్మెంట్ 

క్రిప్టో మార్కెట్ అనలిస్ట్

క్రిప్టో నైపుణ్యాలను కలిగి ఉన్న నిపుణులను నియమించుకోవడానికి సంస్థలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడానికి క్రిప్టో రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు మంచి డిమాండ్ ఉంది.

క్రిప్టో విశ్లేషకులు ఇవన్నీ చేస్తారు. వారు విశ్లేషించడం, ఇన్సైట్స్‌లను అందించడం, పరిశోధన చేయడం, అంచనాలు రూపొందించడం, మార్కెట్ ట్రెండ్‌లు, డిమాండ్, ధరలు మరియు మరిన్నింటిని పర్యవేక్షించడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు. ఇది దాదాపు క్రిప్టో డేటా సైంటిస్ట్‌తో సమానంగా ఉంటుంది కానీ మొత్తంగా అదే కాదు.

సాంకేతికతలు మరియు సరైన విచక్షణను ఉపయోగించి కస్టమర్‌లు మరియు పెట్టుబడిదారులకు పెట్టుబడి ఆదేశాలు మరియు పెట్టుబడి అవకాశాల సిఫార్సులను అందించడం వంటి సామర్థ్యాలు ఈ ఉద్యోగానికి అవసరం.

కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్

మంచి కస్టమర్ సపోర్ట్ లేకుండా ఏ వ్యాపారం కూడా బాగా సాగదు. ప్రతిరోజూ ఎక్కువ మంది వినియోగదారులతో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా, కస్టమర్ మద్దతులో ఇది ప్రదాన భూమిక కావడం సహజం.

మనకు తెలిసినట్లుగా, క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఆన్‌లైన్‌లో ఒకేసారి వేలాది మంది వినియోగదారులతో పనిచేస్తాయి. లక్షల వినియోగదారులను ఇంకా వారి సందేహాలకు స్పందించడం ఈ ఉద్యోగం యొక్క ప్రాథమిక అంశాలు.

అదేవిధంగా, ఈ ఉద్యోగం సంబంధాలను సరిగ్గా నిర్వహించడానికి మరియు నిర్మించడానికి, కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడానికి మరియు వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఈవెంట్‌లను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలు అవసరం.

మొత్తంమీద, పనికి తీసుకున్న ఉద్యోగి వినియోగదారులకు ఏవైనా సందేహాలను పరిష్కరించేటప్పుడు వారికి మంచి అనుభవం కలిగేలా ప్రవర్తిస్తారు. WazirX వంటి క్రిప్టో ఎక్స్ఛేంజీలు తమ యూజర్ బేస్ యొక్క ఆనందాన్ని పరిగణనలోకి తీసుకున్నాయి ఇంకా కస్టమర్ మద్దతు కోసం ప్రస్తుత ఉద్యోగ అవకాశాలను కలిగి ఉన్నాయి. 

క్రిప్టో మార్కెటింగ్

ఏదైనా వ్యాపారం ప్రారంభించిన క్షణం నుండి ఇంకా దాని మొత్తం జీవితచక్రంలో మార్కెటింగ్ అనేది ఒక ముఖ్యమైన భాగం. వినియోగదారుల సమూహం విస్తరించడంలో మరియు ఉత్పత్తి గురించి అవగాహన కల్పించడంలో మార్కెటింగ్ సహాయపడటమే కాకుండా, పోటీని ఎదుర్కొని పరిష్కరించేందుకు ఇంకా ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరచడానికి ఇది ఒక సాధనంగా కూడా పనిచేస్తుంది.. 

క్రిప్టో ప్రపంచంలో, ఈ పరిశ్రమ దాని మొగ్గదశలో ఉన్నందున ఇంకా ఉద్ధేశిత వినియోగదారుల అన్ని ప్రచారాలు ఇంకా శ్రద్ధ అవసరం కాబట్టి దాని అన్ని రూపాలు మరియు భూమికలలో మార్కెటింగ్ మరింత కీలకమైనది.

ఉదాహరణకు, అమ్మకందారులు ప్రచారాలను రూపొందించగలరు మరియు వారి మార్కెట్‌లను ముందుకు తీసుకెళ్లడానికి NFTలు, ETFలు వంటి నిర్దిష్ట క్రిప్టో ఉత్పత్తులను ప్రారంభించడంలో సహాయపడగలరు. సంభావ్య వినియోగదారులను గుర్తించడం మరియు ట్రెండ్‌లను పర్యవేక్షించడం ద్వారా, అమ్మకందారులు లాభాలు ఇంకా మార్కెట్ వాటాను పెంచుకోవడానికి వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు.

ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్

పెద్దగా సాంకేతికత అవసరంలేని కొన్ని ఉద్యోగాలలో ఒకటిగా, ఫైనాన్స్ ఫీల్డ్‌లో మీరు ఎంచుకోగల వివిధ స్థానాలు ఉన్నాయి.

వాటిలో కొన్ని:

● ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్

● రిస్క్ అనలిస్ట్

● వెంచర్ క్యాపిటల్ అనలిస్ట్

● ఫైనాన్స్ రీసెర్చ్ ఇంజనీర్

● బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్

క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ ఉంటుంది మరియు ఆర్థిక నిపుణుల కంటే కంపెనీలకు దీని గురించే ఎవరూ చక్కగా వివరించలేరు. క్రిప్టోలో తాము పెట్టుబడి పెట్టడం లేదా పెట్టుబడిదారులకు సలహాలు ఇవ్వడం వంటివి చేసినా, ఈ క్రిప్టో జాబ్ ఫీల్డ్‌కు విస్తృత పరిధి ఉంటుంది.

పైన చెప్పిన జాబితా సమగ్రమైనది కాదు ఇంకా మమ్మల్ని నమ్మండి, క్రిప్టోలో ఫైనాన్స్ ఉద్యోగాల గురించి అన్వేషించడానికి ఇంకా చాలానే ఉన్నాయి.

భారతదేశంలో క్రిప్టో ఉద్యోగాన్ని ఎలా పొందాలి?

భారతదేశంలో క్రిప్టో ఉద్యోగాన్ని కనుగొనడం సునాయాసం. ఇంటర్నెట్‌కు కృతజ్ఞతలు, Google, LinkedIn లేదా naukri.com వంటి ఇతర కెరీర్ ప్లాట్‌ఫారమ్‌లలో సాధారణ శోధన చేస్తే ఇది భారతీయులకు ఉపయోగపడుతుంది. మీరు ఏంజెల్ వంటి మరిన్ని అలాంటి ప్లాట్‌ఫారమ్‌లను కూడా తనిఖీ చేయాలనుకోవచ్చు, ఇక్కడ స్టార్టప్‌లు తరచుగా లాభదాయకమైన పోస్టింగ్‌లను ప్రచురిస్తాయి.

క్రిప్టో పరిశ్రమ కోసం పనిచేయడానికి మరొక ప్రయోజనం ఏమిటంటే, సాధారణంగా స్థాపించబడిన పరిశ్రమలతో పోలిస్తే నైపుణ్యాలు లేదా అర్హతలకు సంబంధించి సరళత. క్రిప్టో పరిశ్రమ కేవలం 12 సంవత్సరాలుగా మాత్రమే ఉనికిలో ఉంది మరియు ఇది ఇంకనూ అభివృద్ధి చెందుతోంది.

మీ రిక్రూటర్‌లు తమ ఉద్యోగ వివరణలకు సరిగ్గా సరిపోయే ఉద్యోగులను కనుగొనలేకపోవచ్చు. నిజం చెప్పాలంటే, వారికి బహుశా ఈ రంగంలో కూడా అనుభవం కూడా ఉండకపోవచ్చు, కానీ వారు చివరికి దానిని నేర్చుకున్నారు ఇంకా విజయం సాధించారు. మీరు మంచి వైఖరిని కలిగి ఇంకా ప్రతిరోజూ నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నంత వరకు, క్రిప్టోకరెన్సీలో ఉద్యోగం మీ చేతులకు దాటి పోదు. మీరు ఈ పరిశ్రమకి దరఖాస్తు చేయాలనుకుంటే ఈ రెండు లక్షణాలు తప్పనిసరి. బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటో మీకు తెలియకపోతే మీరు ఫైనాన్స్‌లో ఉద్యోగం పొందాలని ఆశించడం వృదా. 

సారాంశం

దీన్ని ఇంతటితో ముగించే ముందు, ప్రస్తుతం, భారతదేశంలో క్రిప్టో ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, అనేక స్థానాలకు ప్రోగ్రామింగ్ లేదా కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేదు. ఈ కొత్త పరిశ్రమ ఆవిర్భవించినప్పటి నుండి, ఇది ఎన్నో అవకాశాలతో దూసుకుపోతోంది. క్రిప్టో నిపుణుడిగా ఉండటం అవసరం లేదు. అయితే, మీరు మీ ఫీల్డ్ యొక్క ప్రాథమికాంశాలను నేర్చుకుంటే మంచిది.

మొత్తంమీద, మీరు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి కలిగి ఉంటే ఇంకా సహకరించగలిగితే, ఏదైనా తగిన ఉద్యోగం కోసం సంస్థలు మిమ్మల్ని త్వరగా నియమించుకోవచ్చు.క్రిప్టో ఉద్యోగాల గురించిన మంచి విషయం ఏమిటంటే, విద్యా నేపథ్యంతో ఎక్కువ ఉన్నత హద్దులు ఏవీ పెద్దగా ఉండవు, అదీకాక మీరు ఎంత బాగా పని చేయగలరు. మీరు ఏ క్రిప్టో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు? దిగువ వ్యాఖ్యలలో మాకు చెప్పండి!

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply