Table of Contents
ప్రియమైన మిత్రులారా!
మీ క్రిప్టో ప్రస్థానంలో మేము భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirX లో మేము మీ కోసం ఇక్కడ ఉన్నామని దయచేసి గుర్తుంచుకోండి. అలాగే, మా మార్గదర్శకాలను చదివిన తర్వాత మీకు ఏవైనా సందేహాలుంటే, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.
WazirX మార్గదర్శకాలు
- WazirXలో ఖాతాను ఎలా తెరవాలి?
- WazirXలో KYC ప్రక్రియని ఎలా పూర్తి చేయాలి?
- WazirXలో బ్యాంక్ ఖాతాను జోడించడం ఇంకా INRని డిపాజిట్ ఎలా చేయాలి?
- Mobikwik ద్వారా మీ WazirX వాలెట్‌లో INRని ఎలా డిపాజిట్ చేయాలి?
- WazirX లోని QuickBuy ఫీచర్‌తో క్రిప్టోను ఎలా కొనుగోలు చేయాలి?
- WazirXలో క్రిప్టోని కొనడం ఇంకా అమ్మడం ఎలా?
- WazirXలో క్రిప్టోను డిపాజిట్ ఇంకా విత్‌డ్రా చేయడం ఎలా?
- WazirXలో ట్రేడింగ్ ఫీజు ఎలా లెక్కించబడుతుంది?
- స్టాప్-లిమిట్ ఆర్డర్‌ను ఎలా ఉంచాలి?
- WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- WazirX లో P2Pని ఎలా ఉపయోగించాలి?
- WazirX కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
- WazirX రెఫరల్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు ఏంటి ఇంకా దానిని ఎలా ఉపయోగించాలి?
- అధికారిక WazirX ఛానెల్‌లు ఏవి ఇంకా WazirX సపోర్టును ఎలా చేరుకోవాలి?
క్రిప్టో డస్ట్ అంటే ఏమిటి?
డస్ట్ అనేది చాలా తక్కువ విలువలు కలిగిన క్రిప్టోకరెన్సీ బ్యాలెన్స్‌లను సూచిస్తుంది. డస్ట్ బ్యాలెన్స్‌లు సాధారణంగా తక్కువగా ఉంటాయి, మిగిలిపోయిన మొత్తాలు కనీస ఉపసంహరణ లేదా ట్రేడింగ్ మొత్తం కంటే తక్కువగా ఉంటాయి ఇంకా కొన్ని సందర్భాల్లో, ట్రేడింగ్ ఫీజు కంటే కూడా తక్కువగా ఉంటాయి.
WazirX ప్రస్తుతం 250 కి పైగా టోకెన్‌లను లిస్ట్ చేసింది. మీరు అనేక క్రిప్టో అసెట్లను ట్రేడ్ చేస్తే, మీరు మీ వాలెట్‌లో డస్ట్ బ్యాలెన్స్‌లతో ఉండటం గమనిస్తారు, మీరు వీటిని విత్‌డ్రా చేసుకోలేరు లేదా వీటితోట్రేడ్ చేయలేరు. ఇలాంటి అనేకమైన ఉపయోగించలేని, చిన్న బ్యాలెన్స్‌లను ఒకే ఉపయోగించగల టోకెన్‌గా మార్చడం ద్వారా, డస్ట్ కన్వర్షన్ ఫంక్షన్ అనేక నిరుపయోగ బ్యాలెన్స్‌ల సమస్యను పరిష్కరిస్తుంది.
మిగిలిపోయిన క్రిప్టో బ్యాలెన్స్‌లను మా యుటిలిటీ టోకెన్ WRXకి మార్చడానికి మీరు డస్ట్ కన్వర్షన్ ఫంక్షన్‌ని ఉపయోగించవచ్చు! అప్పుడు, WRXతో, మీరు ట్రేడ్ చేయవచ్చు, ట్రేడింగ్ ఫీజులు చెల్లించవచ్చు, ఎయిర్‌డ్రాప్‌లలో పాల్గొనవచ్చు ఇంకా WRX హోల్డర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు! WazirX వెబ్, ఆండ్రాయిడ్ ఇంకా iOS యాప్‌లు డస్ట్ మార్పిడికి మద్దతు ఇస్తాయి!
క్రిప్టో డస్ట్‌ని WRXకి ఎలా మార్చాలి?
Mobile:
- అకౌంట్ సెట్టింగ్‌లకు వెళ్లండి
- కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఎంచుకోండి
3. మీరు WRX లోకి మార్చాలనుకుంటున్న డస్ట్ ఫండ్‌లను ఎంచుకోండి
4. కన్వర్ట్ పై క్లిక్ చేయండి
5. కన్ఫర్మ్‌పై క్లిక్ చేయడం ద్వారా కన్వర్షన్ అభ్యర్థనను నిర్ధారించండి
వెబ్:
- హోమ్ పేజీ నుండి ఫండ్స్‌కి వెళ్లండి
- Convert to WRXపై క్లిక్ చేయండి
3.మీరు WRX లోకి మార్చాలనుకుంటున్న డస్ట్ ఫండ్‌లను ఎంచుకోండి
4.కన్వర్ట్ పై క్లిక్ చేయండి
5. కన్ఫర్మ్‌పై క్లిక్ చేయడం ద్వారా కన్వర్షన్ అభ్యర్థనను నిర్ధారించండి
దయచేసి గమనించండి: మీరు ప్రతి 24 గంటలకు ఒకసారి 10 USDT కంటే తక్కువ విలువ కలిగిన బ్యాలెన్స్‌లను WRXకి మార్చవచ్చు. ప్రస్తుతం, లిస్ట్ చేయబడిన కాయిన్లను మార్చడం సాధ్యం కాదు.
ఈ ఫీచర్‌కు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఈ క్రింద వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి.
హ్యాపీ ట్రేడింగ్!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.