WazirX P2P (పీర్ టు పీర్) ఇన్వెస్టర్లకు వారి డబ్బును తక్షణమే క్రిప్టో (ఇంకా ఇతరాత్ర)గా మార్చడంలో సహాయపడుతుంది. ఇది పూర్తిగా ఉచితం ఇంకా సురక్షితంగా మరియు చట్టబద్ధంగా ఎల్లప్పుడూ 24×7 అందుబాటులో ఉంటుంది!! WazirX P2Pని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి, మా బ్లాగును ఇక్కడ చదవండి.
మా వినియోగదారులు తరచుగా అడిగే ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఈ పోస్ట్ వాటన్నీటినీ నివృత్తి చేస్తుందని నేను నిస్సందేహంగా నమ్ముతున్నాను.
ప్రశ్న 1: WazirX P2P కేవలం USDTని మాత్రమే ఎందుకు కలిగి ఉంది?
USDT అనేది ఒక స్టేబుల్ కాయిన్. లావాదేవీలను సరళంగా ఉంచడానికి ఇంకా అధిక లిక్విడిటీ నిర్ధారించడానికి, USDT మాత్రమే మద్దతు ఇస్తుంది.
ప్రశ్న 2: WazirXలో P2Pని ఎవరు ఉపయోగించవచ్చు?
భారతీయ KYC ఉన్న వినియోగదారులెవరైనా WazirXలో P2P ఫీచర్‌ని ఉపయోగించవచ్చు.
ప్రశ్న 3: నేను విక్రేత బ్యాంక్ వివరాలను చూడలేకపోయాను మరియు 10 నిమిషాల్లో ట్రేడ్ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి?
ఇక్కడ, మీరు ముందుగా చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలి. ఆపై, మీ ట్రేడ్ సరిపోలిన తర్వాత “అవును, నేను చెల్లిస్తాను” ఎంపికపై క్లిక్ చేయండి. మీరు “అవును, నేను చెల్లిస్తాను”పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే విక్రేత యొక్క బ్యాంక్ వివరాలు మీకు కనిపిస్తాయి. ఈ వివరాల ఆధారంగా మీరు చెల్లింపును కొనసాగించవచ్చు.
ప్రశ్న 4: వివరాలు తప్పుగా ఉండటం/విఫలం కావడం/బ్యాంకింగ్ సమస్య/నెట్వర్క్ సమస్య ఇలాంటి కారణాల వల్ల నేను విక్రేత బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయలేకపోతున్నాను.
ఆర్డర్‌ను రద్దు చేయడానికి మరియు పెనాల్టీని మాఫీ చేయించుకోవడానికి మీరు మా సపోర్ట్ టీమ్‌ని చాట్ ద్వారా సంప్రదించాలి. నిజమైన వైఫల్యాన్ని ధృవీకరించడానికి స్క్రీన్షాట్లు/నిరూపణలను షేర్ చేయమని సపోర్ట్ టీమ్ మిమ్మల్ని అడుగుతుంది. ప్రత్యామ్నాయంగా, ట్రేడ్ స్వయంచాలకంగా రద్దు చేయబడిన తర్వాత (సమయం ముగిసిన తర్వాత) మీరు పెనాల్టీ ఇమెయిల్‌ను అందుకుంటారు. మీరు తగిన రుజువుతో ఈ ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. అది ఆమోదిస్తే, మా జట్టు పెనాల్టీని వెనక్కుతీసుకుంటుంది..
ప్రశ్న 5: మీరు చెల్లింపు పూర్తి చేసినా ‘నేను చెల్లించాను’పై క్లిక్ చేయడం మర్చిపోతే ఏమి చేయాలి?
‘రైజ్ డిస్ప్యూట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయడానికి మీకు 10 నిమిషాల సమయం ఉంటుంది. మీరు వివాదాన్ని లేవనెత్తిన తర్వాత, చెల్లింపు రుజువును అభ్యర్థిస్తూ మా వివాద బృందం నుండి మీకు వెంటనే ఇమెయిల్ వస్తుంది. తర్వాత, తదుపరి 15 నిమిషాల్లో, ఇమెయిల్‌లో పేర్కొన్న సూచనలను అనుసరించి, దయచేసి చాట్ ద్వారా మా సపోర్ట్ టీమ్‌ని సంప్రదించండి. వివాద బృందం ఇతర వివరాలతో పాటు మీ చెల్లింపు రుజువును సమీక్షించి, మీ వివాదంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. వివాద బృందం యొక్క నిర్ణయమే అంతిమమైనది ఇంకా అందుకు కట్టుబడి ఉంటుంది మరియు దానిని మార్చలేము.
దయచేసి గమనించండి: వివాదాన్ని సమీక్షించేటప్పుడు పూర్తి ఖచ్చితత్వాన్ని నిర్ధారించే మల్టీ-చెక్ ఫూల్ ప్రూఫ్ ప్రక్రియ మా వద్ద ఉంది.
ప్రశ్న 6: WazirX P2Pలో లావాదేవీ విఫలమైతే రికవరీ (నిధుల విషయంలో) ఎలా పని చేస్తుంది – కొనుగోలుదారు ట్రేడ్నినిర్ధారించడానికి బదులుగా ట్రేడ్‌ని రద్దు చేసినప్పుడు?
కొనుగోలుదారు చెల్లింపు చేసి, ఆపై లావాదేవీని రద్దు చేసినప్పుడు, మేము కొనుగోలుదారు చెల్లింపు వివరాలను విక్రేతతో పంచుకుంటాము మరియు కొనుగోలుదారుకు చెల్లింపును తిరిగి చేయమని వారిని అడుగుతాము. కొనుగోలుదారు వారి నిధులను తిరిగి పొందారని నిర్ధారించుకోవడానికి, మేము విక్రేత నిధులు మరియు/లేదా ఖాతాను లాక్ చేస్తాము ఇంకా చెల్లింపు రుజువుతో పాటు మొత్తం సమాచారంతో ఇమెయిల్‌ను పంపుతాము. మేము ప్రతి 24 గంటలకు ఒకసారి విక్రేతకు మొత్తం 3 రిమైండర్లను పంపుతాము. అయితే 3వ ఇంకా చివరి రిమైండర్ తర్వాత, మేము నిధుల రికవరీని కొనసాగిస్తాము, దీనికి గరిష్టంగా 13 పనిదినాలు పట్టవచ్చు (అయితే, నిధులు అందుబాటులో ఉన్నప్పుడే ఇది పని చేస్తుంది).
ప్రశ్న 7: చెల్లింపు పూర్తి చేసిన తర్వాత కూడా, నా ట్రేడ్ వివాదానికి తరలించబడింది; ఇలాంటప్పుడు ఏం చేయాలి?
అనేక కారణాల వల్ల మీ ట్రేడ్ వివాదానికి తరలించబడవచ్చు. ఈ సందర్భంలో, మీరు చెల్లింపు రుజువుతో చాట్‌లో మా సపోర్ట్ టీమ్‌ని సంప్రదించవచ్చు. మీ నిధులు సురక్షితంగా ఉంటాయని నిశ్చింతగా ఉండండి.
ప్రశ్న 8: నేను విక్రేత/కొనుగోలుదారుని ఇంకా అజ్ఞాత కొనుగోలుదారులు/విక్రేతలతో ఆటో-మ్యాచ్ అయ్యేందుకు నేను ఇష్టపడను. ఏం చేయాలి?
మీరు మీ క్రిప్టోను ఎవరితోనైనా ట్రేడ్ చేయాలనుకుంటే, మీరు మొదటి దశలోనే వారి XIDని జోడించవచ్చు. XID వినియోగదారు పేరు వలె పనిచేస్తుంది! దీనితో, కొనుగోలుదారు/విక్రేతని మీరు ఎంచుకోవచ్చు ఇంకా ఆ నిర్దిష్ట లావాదేవీ సమయంలో మీరు మరెవరితోనూ మ్యాచ్ కాలేరు.
ప్రశ్న 9: నేను ఒక రోజులో చేయగల P2P లావాదేవీల సంఖ్య/విలువపై రోజువారీ పరిమితి ఏదైనా ఉందా?
లేదు! WazirXలో మీరు ఒక రోజులో ఎన్ని P2P లావాదేవీలనైనా చేయవచ్చు. అయితే, మీ బ్యాంక్ కొన్ని పరిమితులను కలిగి ఉండవచ్చు, వాటికి మీరు కట్టుబడి ఉండాల్సివస్తుంది.
ప్రశ్న 10: నేనొక కొనుగోలుదారుని. చెల్లింపు చేసిన తర్వాత, నా లావాదేవీ ‘ప్రాసెసింగ్‘లో నిలిచిపోయింది. నేనేం చేయాలి? నిధులు మినహాయించబడ్డాయో లేదో నాకు తెలియదు.
మీరు చెల్లింపు చేసిన సందర్భాలలో కానీ చెల్లింపు స్థితి ‘ప్రాసెసింగ్’ చూపుతున్నప్పుడు, మీరు WazirXలో ‘అవును, నేను చెల్లించాను’పై క్లిక్ చేసి, చెల్లింపు రుజువును (ప్రాసెసింగ్) జోడించి, విక్రేత చెల్లింపు రసీదుని నిర్ధారించే వరకు వేచి ఉండండి. . విక్రేత చెల్లింపును స్వీకరించినట్లయితే, లావాదేవీ ప్రాసెస్ చేయబడుతుంది. ఒకవేళ చెల్లింపు రద్దు చేయబడితే, మీరు మా సపోర్ట్ టీమ్‌ని చాట్ ద్వారా సంప్రదించవచ్చు మరియు మేము మీ కోసం ఆర్డర్‌ను రద్దు చేస్తాము ఇంకా ఇది నిజమైన పొరపాటు కనుక పెనాల్టీని కూడా మాఫీ చేస్తాము.
మెరుగైన పరిశీలన కొరకు WazirX ద్వారా P2Pలో ఈ వీడియోని ఒకసారి చూడండి.
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.