
Table of Contents
This article is available in the following languages:
మీకు తెలుసా?
అన్ని భారతీయ రాష్ట్రాలలో తలసరి GDP అత్యధికంగా, దేశం మొత్తం తలసరి GDP కంటే రెండున్నర రెట్లు ఎక్కువ గోవాకి ఉంది! అదనంగా, భారతదేశ జనాభాపై జాతీయ కమిషన్ గోవా భారతదేశంలో అత్యుత్తమ జీవన నాణ్యతను కలిగి ఉందని రేట్ చేసింది.
గోవా రిమోట్‌గా పని చేసే నిపుణులు మరియు వ్యాపారవేత్తల వెల్లువను చూసింది. అనేక అంశాలు గోవాను తదుపరి తరం విజయవంతమైన వెబ్3 స్టార్టప్‌లను పెంచడానికి ఆకర్షణీయమైన కేంద్రంగా మార్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, WazirX, బిల్డర్స్ ట్రైబ్, ఇంకా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ భాగస్వామ్యంతో గోవాలో ప్రత్యేకంగా Web3 స్టార్టప్‌ల కోసం బ్లాక్‌చెయిన్ పార్క్‌ను ఏర్పాటు చేసింది.
ప్రోగ్రాం వివరాలు
టూకీగా: ఈ ప్రోగ్రామ్ తమ Web3 ఉత్పత్తుల కోసం అగ్రశ్రేణి గో-టు-మార్కెట్ పరిష్కారాలను రూపొందించడానికి ఆచితూచి ఎంపిక చేసుకున్న 40 స్టార్టప్‌లకు సహాయం చేస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పాలసీ సపోర్ట్, అక్రిడిటేషన్ మరియు ట్రైనింగ్ వంటివి ఇందులోకి వస్తాయి. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ వ్యవస్థాపకులకు పనిలో సహకారానికి సీట్లు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు: ఇటీవలి గ్రాడ్యుయేట్లు, స్టార్టప్‌లు ఇంకా బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేదిక మరియు తేదీ: ఈ ప్రోగ్రాం 15 ఏప్రిల్ 2022 నుండి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC), గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (GIM)లో నిర్వహించబడుతుంది.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి: పైన చెప్పినట్లుగా, ఈ ప్రోగ్రామ్ గరిష్టంగా 40 మంది డెవలపర్‌లకు మాత్రమే వసతి కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు.
బ్లాక్‌చెయిన్ పార్క్ కలిగి ఉండటం ఎందుకు అవసరం?
భారతదేశం ఇప్పటికే అతిపెద్ద బ్లాక్‌చెయిన్ డెవలపర్ ఎకోసిస్టంను కలిగి ఉంది. అయితే, ఇప్పుడు మనకు కావలసింది బలమైన పర్యావరణం. అందుకే గోవాలోని ఈ బ్లాక్‌చెయిన్ పార్క్ ఇప్పటికే అందుబాటులో ఉన్న అవకాశాలు ఇంకా ప్రతిభను సద్వినియోగం చేసుకోవడం మరియు ప్రభుత్వం నుండి సాంకేతిక పరిజ్ఞానం, గుర్తింపు మరియు విధాన మద్దతుతో డీప్-టెక్ బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లను సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం మరియు ఉద్యోగాలను సృష్టించడం అనేది దీర్ఘకాలిక దృష్టి, అయితే లక్ష్యం ఏదైనా బ్లాక్‌చెయిన్ విషయానికి వస్తే గోవాను మోడల్ స్టేట్‌గా మార్చడం! ఇది వెబ్3 విప్లవానికి ప్రారంభం మాత్రమే.
ఈ ప్రోగ్రామ్ ఎలా పని చేస్తుంది?
WazirX మరియు బిల్డర్స్ ట్రైబ్ ప్రోగ్రాం అంతటా అంకితమైన మూలధన పూల్‌తో చొరవకు మద్దతు ఇచ్చేపెట్టుబడిదారులను గుర్తించాయి. విజయవంతమైన ప్రోగ్రామ్ ఫలితాల కోసం, AIC GIM అవసరమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఇంకా విధాన మద్దతుతో సహాయం చేస్తుంది; బిడ్లర్స్ ట్రైబ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను నడుపుతుంది మరియు ప్రభావవంతమైన పరిష్కారాల కోసం పర్యావరణ వ్యవస్థ మద్దతు, శిక్షణ, మార్గదర్శకత్వం మరియు గో-టు-మార్కెట్ మద్దతును అందిస్తుంది. WazirX ఈ వినూత్న సాంకేతికతల యొక్క విలువ డ్రైవర్‌లను గుర్తించడానికి మరియు పరిష్కారాలను రూపొందించడానికి వారికి ఆచరణాత్మక అవగాహనను అందించడానికి వ్యవస్థాపకులకు సహాయం చేస్తుంది. ఇది విధాన చర్యల పరిణామాన్ని మరియు స్టార్ట్-అప్‌లు ఇంకా బ్లాక్‌చెయిన్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడానికి విధాన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడాన్ని కూడా నిర్ధారిస్తుంది.
