Skip to main content

క్రిప్టోపై TDS గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

By జూలై 7, 2022జూలై 28th, 20222 minute read
FAQs on TDS on Crypto

మీకు తెలిసినట్లుగా, భారత ప్రభుత్వం జారీ చేసిన ఇటీవలి మార్గదర్శకాల ప్రకారం, క్రిప్టో ట్రేడ్‌లు ఇకపై 1% TDSని అందిస్తాయి. ఈ నిబంధనలు 1 జూలై 2022 ప్రామాణిక భారత కాలమానప్రకారం 00:00 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. WazirX లో మేము ఈ యంత్రాంగానికి మద్దతు ఇచ్చేందుకు మా సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేసాము. ఈ నిబంధనలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి మీరు మరింత చదివి తెలుసుకోవచ్చు మరియు WazirX ఇందుకుగాను తీసుకున్న చర్యల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

మరింత తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి:

ఇది మీ చాలా ప్రశ్నలకు జావాబిచ్చినప్పటికీ, కొత్త TDS నియమాల గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:

ప్రశ్న 1: క్రిప్టోను WazirX ద్వారా కొనుగోలు చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు TDSగా పన్నును ఎవరు డిడెక్ట్ చేయాలి?

అవసరమైనదంతా WazirX చేస్తుంది!

ఎవరైనా ఎక్స్‌ఛేంజ్ ద్వారా క్రిప్టోను కొన్నప్పుడు (P2P లావాదేవీల విషయంలో కూడా), ఎక్స్‌ఛేంజ్ ద్వారా సెక్షన్ 194S కింద పన్ను డిడెక్ట్ చేయబడుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) స్పష్టం చేసింది. దీన్ని సులభతరంగా చెప్పాలంటే; సాంకేతికంగా, మీరు కొనుగోలుదారుగా లేదా విక్రేతగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అవసరమైనదంతా WazirX చేస్తుంది.

ప్రశ్న 2: క్రిప్టోపై పన్ను ఎంత రేటుతో తగ్గించబడుతుంది?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇక్కడ ఒక సాధారణ పట్టిక ఉంది:

​​

ప్రశ్న 3: ఎవరికి 5% TDS వర్తిస్తుంది మరియు ఎందుకు?

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 206AB ప్రకారం, మీరు గత 2 సంవత్సరాలలో మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే ఇంకా ఈ రెండు మునుపటి సంవత్సరాల్లో ప్రతి ఒక్కదానిలో TDS మొత్తం ₹50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అప్పుడు చెల్లించాల్సిన పన్ను క్రిప్టో-సంబంధిత లావాదేవీల కోసం 5% TDSగా డిడెక్ట్ చేయబడుతుంది. 

ప్రశ్న 4: WazirXలో, నా ట్రేడ్‌లపై డిడెక్ట్ అయినట్లు పన్నును నేను ఎక్కడ చూడాలి?

WazirXలో, మీరు ఆర్డర్ వివరాల పేజీలో TDSగా డిడెక్ట్ అయిన పన్నును చెక్ చేయవచ్చు. అంతేకాకుండా, మీ ట్రేడింగ్ రిపోర్ట్ 48 గంటల తర్వాత TDS వివరాలను కూడా చూపుతుంది. 

ప్రశ్న 5: నేను ఏదైనా ప్రభుత్వ పోర్టల్‌లో TDS వివరాలను తనిఖీ చేయవచ్చా?

డిపార్ట్‌మెంట్ అప్‌డేట్ చేసినప్పుడు మీరు మీ ఫారమ్ 26AS (పన్నుల శాఖ జారీ చేసిన ఏకీకృత వార్షిక పన్ను స్టేట్‌మెంట్, మూలంలో డిడెక్ట్ చేసిన పన్ను వివరాలను చూపుతుంది)లో డిడెక్ట్ చేసిన పన్ను వివరాలను కనుగొనవచ్చు. 

ప్రశ్న 6: నేను ఇతర TDS లాగా క్రిప్టో TDSని క్లెయిమ్ చేయవచ్చా?

చేయవచ్చు! మీరు సంబంధిత ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేసినప్పుడు క్రిప్టో ట్రేడ్‌లపై TDSగా తగ్గించబడిన పన్నును మీరు క్లెయిమ్ చేయవచ్చు.

ప్రశ్న 7: నేను నష్టపోతున్నప్పటికీ పన్ను తీసివేయబడుతుందా?

అవును! మీరు లాభపడినా లేదా నష్టపోయినా, వర్తించే చోట కొనుగోలు చేసిన లేదా విక్రయించిన ప్రతి క్రిప్టోకు TDSగా పన్ను డిడెక్ట్ చేయబడుతుంది.

ప్రశ్న 8: నేను ఫారిన్ ఎక్స్‌ఛేంజ్, P2P సైట్‌లు మరియు DEXలలో ట్రేడింగ్ చేస్తుంటే నేను TDS చెల్లించాల్సి ఉంటుందా?

అవును! TDS మినహాయించని అంతర్జాతీయ ఎక్స్‌ఛేంజ్‌లలో లావాదేవీలు జరిపే వినియోగదారులు వారే స్వంతంగా పన్ను చెల్లించవలసి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే మీరు ఆయా ప్రదేశాల యొక్క ప్రస్తుత పన్ను చట్టాలకు అనుగుణంగా ఉందజాలరు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply