Skip to main content

MATIC: మేడ్ ఇన్ ఇండియా (MATIC: Made In India)

By జనవరి 7, 2022జనవరి 11th, 20223 minute read

బిట్‌కాయిన్, ఎథేరియమ్, టెథర్ మొదలైన అనేక క్రిప్టోకరెన్సీలు గత కొన్ని నెలలుగా నిరంతరంగా గరిష్టాలు మరియు కనిష్టాలను చవిచూస్తుండగా, చాలా కాలంగా రాడార్‌లో ఉన్న MATIC అనే భారతీయ నేపధ్యమున్న క్రిప్టోకరెన్సీకి భారీ ప్రాధాన్యత లభించింది. క్రిప్టో స్పేస్ మరియు చాలా మంది అవగాహన ఉన్న పెట్టుబడిదారులు దాని కోసం వెతుకుతున్నారు.

నిజానికి MATIC నెట్‌వర్క్ (ఇప్పుడు పాలిగాన్) పేరుతో 2017లో తిరిగి ప్రారంభించబడింది, ఇది ఇతర వికేంద్రీకృత యాప్‌లను సృష్టించి మరియు అభివృద్ధి చేయగల ఎథేరియమ్ బ్లాక్‌చెయిన్ చుట్టూ రూపొందించబడిన ప్లాట్‌ఫారమ్. 

ఇది లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్, ఇది ఆఫ్-చైన్ కంప్యూటేషన్ కోసం సైడ్ చెయిన్‌లను ఉపయోగించడం ద్వారా స్కేల్‌ను పొందుతుంది, అయితే ప్లాస్మా ఫ్రేమ్‌వర్క్ మరియు PoS (ప్రూఫ్ ఆఫ్ స్టేక్) వాలిడేటర్‌లను ఉపయోగించడం ద్వారా భద్రతను కూడా నిర్ధారిస్తుంది.

దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి, దాని యొక్క కొన్ని ప్రాథమిక అంశాలతో పాటు అది ఎలా పనిచేస్తుందో చూద్దాం.

MATIC అంటే ఏమిటి?

MATIC, దీనిని ఇప్పుడు పాలిగాన్ అని పిలుస్తారు, ఇది ఎథేరియమ్ టోకెన్, ఇది ఎథేరియమ్ ఆధారిత మల్టీచైన్ స్కేలింగ్ సొల్యూషన్ అయిన Polygon Network యొక్క పనితీరులో ఉపయోగించబడుతుంది. MATIC నెట్‌వర్క్ అనేది ఎథేరియమ్ బ్లాక్‌చెయిన్ మరియు ఇతర అనుకూల నెట్‌వర్క్‌ల మధ్య పరస్పర చర్యను మెరుగుపరచడానికి అంతిమ ఫ్రేమ్‌వర్క్ మరియు ఇటీవల దాని ట్రాఫిక్‌లో గణనీయమైన పెరుగుదలను చవిచూసింది.

కంపెనీ విలువ ఆధారిత అంచనాల ప్రకారం, MATIC టోకెన్లు 2028 నాటికి $9.41కి చేరుకోవచ్చు. ఫిబ్రవరి నుండి, నెట్‌వర్క్ NFT (నాన్-ఫంజిబుల్ టోకెన్‌లు), గేమింగ్ మరియు DeFi (వికేంద్రీకృత ఫైనాన్స్)లో పెరిగిన వినియోగం కారణంగా దాని మార్కెట్ క్యాప్‌లో పది రెట్లు ఎక్కువ పెరిగింది.

MATIC (పాలిగాన్) టోకెన్ అంటే ఏమిటి?

దాని ప్రతిరూపాలైన బిట్‌కాయిన్, ఎథేరియమ్ వలె కాకుండా, MATIC కాయిన్ లేదా పాలిగాన్ ట్రాఫిక్ కారణంగా అధిక లావాదేవీ ఖర్చుల వల్ల ప్రభావితం కాదు ఇది ఒక ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, ఇది డెవలపర్‌లకు స్మార్ట్ కాంట్రాక్టులు మరియు ఎథేరియమ్ నెట్‌వర్క్ అందించిన భద్రతను ఉపయోగించి స్వతంత్ర నెట్‌వర్క్ లేదా సురక్షిత సైడ్‌చెయిన్‌లను సృష్టించడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంది.

మే చివరి వారంలో, MATIC యొక్క మార్కెట్ రాబడి $10 బిలియన్లను అధిగమించింది మరియు ప్రస్తుతం Coinmarketcap ప్రకారం, $11 బిలియన్ల పూర్తిగా డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోని టాప్ 25 క్రిప్టో టోకెన్‌లలో ఒకటిగా ఉంది.

MATIC కరెన్సీ ఈ మార్చిలో Coinbaseలో వ్యాపారం చేయడం ప్రారంభించింది మరియు ఎథేరియమ్ డెవలపర్లు తమ స్వంత యాప్‌లను ఎథేరియమ్ బ్లాక్‌చెయిన్‌లో మరింత చౌకగా మరియు వేగంగా నిర్మించగలిగే ప్లాట్‌ఫారమ్‌ను అందించడం వలన అమూల్యమైన నెట్‌వర్క్‌గా మారింది.

MATIC: ఉద్భవం

మూలం: MATIC వ్యవస్థాపకులు / కాయిన్ బ్యూరో

పాలిగాన్ యొక్క ఈ స్థానిక కరెన్సీని ముగ్గురు భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు – అనురాగ్ అర్జున్, జయంతి కనాని మరియు సందీప్ నైల్‌వాల్ స్థాపించారు. ఈ స్టార్టప్ ముంబైలో ఉంది.

ఈరోజు ఎథేరియమ్ ఎదుర్కొంటున్న కొన్ని అతిపెద్ద సవాళ్లను – అంటే భారీ ఫీజులు, సెకనుకు తక్కువ లావాదేవీలు (TPS) మరియు పేలవమైన వినియోగదారు అనుభవం వంటివి పరిష్కరించడానికి మరియు సమాధానం కనుగొనేందుకు ఇది అభివృద్ధి చేయబడింది దాని రెండు-లేయర్డ్ స్కేలబిలిటీ ప్లాట్‌ఫారమ్ ఎథేరియమ్ బ్లాక్‌చెయిన్ అనుకూలమైన మల్టీ -చెయిన్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రారంభంలో, ప్రాజెక్ట్ MATIC నెట్‌వర్క్‌గా ప్రారంభమైంది, అయితే దాని ప్రభావం మరియు పరిధి విస్తరించినప్పుడు తరువాత పాలిగాన్‌గా రీబ్రాండ్ చేయబడింది. ఇది విలువ మరియు సమాచారాన్ని స్వేచ్ఛగా మార్పిడి చేసుకోగల విభిన్న బ్లాక్‌చెయిన్‌లను అందించడానికి రూపొందించబడింది.

ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టాప్ 15 క్రిప్టోకరెన్సీలలో తన స్థానాన్ని పదిలపరచుకొన్నప్పటికీ, MATIC వ్యవస్థాపకులు బిట్‌కాయిన్, ఎథేరియమ్ తర్వాత దీనిని 3వ అతిపెద్ద క్రిప్టో ప్రాజెక్ట్‌గా మార్చాలనే ఆశయంతో ఉన్నారు.

MATIC యొక్క గణనీయమైన పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి, దాని చుట్టూ పెరుగుతున్న ప్రచారం, మార్క్ క్యూబన్ పెట్టుబడి ఇంకా Google BigQuery ప్రకటనలు కూడా ఉన్నాయి.

భారతదేశంలో MATIC (పాలిగాన్) ను ఎలా కొనాలి?

Coinbase మరియు Binance MATIC నెట్‌వర్క్‌కు (ఇప్పుడు పాలిగాన్ అని పిలువబడుతోంది) మద్దతునిచ్చాయి. ఈ లేయర్ టూ స్కేలింగ్ సొల్యూషన్ అనేక బ్లాక్‌చెయిన్‌లలో స్కేలబిలిటీ సమస్యలను పరిష్కరించడం మరియు కమ్యూనికేట్ చేయడం ద్వారా క్రిప్టోకరెన్సీ ఆమోదాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

WazirX MATICకి మద్దతు ఇస్తోంది.

WazirXలో MATIC (పాలిగాన్) ట్రేడింగ్ అందుబాటులో ఉంది. WazirX అనేది భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన బిట్‌కాయిన్ మరియు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉత్తమమైన భద్రత, సూపర్‌ఫాస్ట్ KYC, చిటికెలో లావాదేవీలే కాక, అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో సమర్థవంతమైన మరియు సరళమైన డిజైన్ అందుబాటులో ఉంది.

MATIC ఎందుకు ట్రాక్షన్ పొందుతోంది?

DeFi (వికేంద్రీకృత ఫైనాన్స్, NFTలు, DAOలు (వికేంద్రీకృత స్వయంప్రతిపత్తి సంస్థలు) మరియు DApps (వికేంద్రీకృత అప్లికేషన్‌లు) వంటి క్రిప్టోకరెన్సీలలో కొన్ని హాటెస్ట్ ప్రాంతాలలో MATIC పాల్గొంటుంది.

మూలం: లూనార్ క్రష్

MATIC యొక్క పెరుగుతున్న ఆమోదం క్రిప్టో మార్కెట్‌లో పెట్టుబడిదారుల మొత్తం సెంటిమెంట్‌ను పెంచుతున్నట్లు కనిపిస్తోంది. మార్చి నుండి ఏప్రిల్ వరకు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో MATIC ఆధిపత్యం 636% పెరిగిందని LunarCrush పేర్కొంది, అంటే పెట్టుబడిదారులు గతంలో కంటే ఈ కరెన్సీపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.

విటాలిక్ బుటెరిన్ భారతదేశం యొక్క కోవిడ్ సహాయనిధి కోసం ఇచ్చిన విరాళం MATIC పై కొంత స్పష్టత ఏర్పడేందుకు సహాయపడింది, దాని టోకెన్ విలువ నిజంగా ఒకే సందర్భానికి జమ చేయబడదు. బదులుగా, Maker మరియు Uniswap వంటి ప్రపంచవ్యాప్తంగా DeFi యాప్‌లు పెద్ద ఎత్తున పెరగడం వల్ల వృద్ధి ఎక్కువయ్యింది. 

MATIC యొక్క వివరణలు వికేంద్రీకృత యాప్‌లకు సహాయం చేయడానికి మరియు వినియోగదారులను వేగంగా మరియు మరింత ప్రభావవంతంగా పొందేందుకు రూపొందించబడింది. ఇది గేమ్‌లు, మార్కెట్‌ప్లేస్‌లు ఇంకా అనేకమైనటువంటి వివిధ యాప్‌లలో ఉపయోగించబడుతోంది.

అదనంగా, వాస్తవ-ప్రపంచ ప్రయోజనం మరియు విస్తరించిన దృష్టితో కలిపి దాని పని మరియు ఆమోదంలో పెరుగుదల క్రిప్టోకరెన్సీకి స్నోబాల్ ప్రభావాన్ని అంటే నిరంతర వృద్ధిని సృష్టించింది.

MATIC: భవిష్యత్తులో సంభావ్యత

ఎథేరియమ్ నెట్‌వర్క్ యొక్క ఆకస్మిక జనాదరణ మరియు దాని స్వీఆమోదం కారణంగా MATIC యొక్క అపరిమితమైన వృద్ధి ఇప్పటికీ కొనసాగుతోంది. నెట్‌వర్క్‌లో వేగవంతమైన మరియు చౌకైన లావాదేవీ ఎంపిక అందుబాటులో ఉండటం MATICకి పెద్ద అమ్మకపు అంశం, ఇంకా దాని ధర గురించి ఎంతో ఊహించిన ప్రజల యొక్క అవగాహన మరియు విపరీతమైన ఆసక్తిని పుట్టించింది.

 2020-2021 కంటే MATIC 10,000% పెరిగింది మరియు సెప్టెంబర్ 2021 నాటికి దీని ధర $1.15. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

క్రిప్టో స్పేస్‌లో MATIC యొక్క అద్భుతమైన విజయం వినూత్న ఆలోచనలు మరియు వాస్తవ ప్రపంచ పరిష్కారాలతో క్రిప్టోకరెన్సీలో అద్భుతమైన పునాదులు ఎలా విలువైన వినియోగదారులని,, డెవలపర్‌లు, ఇంకా పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయో చూపిస్తుంది, తద్వారా తనను తాను మరియు సాంకేతికతతో కలిసి ఉత్పాదక పంధాలో అభివృద్ధి చేస్తూవుంది.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply