Skip to main content

క్రిప్టో సంవత్సరం: 2021 నుండి హైలెట్స్ ఇంకా పరిశీలనలు (Highlights and Observations From 2021: The Year Of Crypto)

By డిసెంబర్ 16, 2021జనవరి 24th, 20222 minute read

నమస్తే ట్రైబ్!

2021 ఒక అద్భుతమైన సంవత్సరం! ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌లను ఎలా కొనాలి అనే శోధనల కంటే Googleలో బిట్‌కాయిన్‌ను ఎలా కొనాలి అని తెలుసుకోవడం కొరకు ఎక్కువ శోధనలు జరిగిన సంవత్సరం ఇంకా NFTలు హైలెట్ అవడం ప్రారంభించిన సంవత్సరం. అనేక దేశాలు క్రిప్టో నిబంధనలు లేదా CBDCల కోసం పని చేస్తున్న సంవత్సరమిది.

ఈ వివరణలో, WazirX 2021లో $43 బిలియన్ USD కంటే ఎక్కువ రికార్డ్ ట్రేడింగ్ వాల్యూమ్‌ను సాధించింది – ఇది భారతదేశంలో చరిత్రలో అత్యధికం – 2020 నుండి ఇది 1735% వృద్ధిని నమోదు చేసిందని ఇంకా మేము వినియోగదారు సైన్‌అప్‌లలో 10 మిలియన్ల వినియోగదారుల సంఖ్యను అధిగమించి గణనీయమైన పెరుగుదలను కూడా సాధించామని తెలియజేయడానికి నేనెంతో ఆనందోత్సాహాలకి లోనవుతున్నాను.

మా వినియోగదారులలో పెరుగుతున్న ఆసక్తిని అంచనా వేయడానికి, మేము వినియోగదారు సర్వేని నిర్వహించాము ఇంకా మా ప్లాట్‌ఫారమ్‌లోని డేటా నమూనాలను విశ్లేషించాము. ఈ ఇన్సైట్స్ మాకు ఆసక్తిని రేకెత్తించాయి మరియు మేము వాటిని “2021 నుండి హైలెట్స్ & ఆబ్సర్వేషన్: ది ఇయర్ ఆఫ్ క్రిప్టో” అనే మా నివేదికలో షేర్ చేసాము:

సర్వేలో 51% మంది తాము క్రిప్టో రంగంలో అడుగుపెట్టేందుకు తమ తమ స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యులు సిఫార్సు చేసినట్లు అంగీకరించారు

• బిట్‌కాయిన్ (BTC), టేథర్ (USDT), షీబా ఇనూ (SHIB), డోజ్‌కాయిన్ (DOGE), WazirX టోకెన్ (WRX), మరియు మాటిక్ (MATIC) ఎక్స్ఛేంజ్లో అత్యధికంగా ట్రేడ్ చేయబడిన క్రిప్టోలు.

• తమ మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10% వరకు క్రిప్టో భాగమై ఉంటుందని 44% మంది ప్రతిస్పందించారు.

• బిట్‌కాయిన్‌లో మహిళలు ఎక్కువగా ట్రేడ్ చేయగా, పురుషులు మాత్రం షిబా ఇనులో ఎక్కువ ట్రేడ్ చేశారు

• 54% మంది ప్రతివాదులు క్రిప్టో రంగంలో వృత్తిని కొనసాగించడానికి ఆసక్తిని కలిగి ఉన్నారని పంచుకున్నారు

• ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ టాప్ కెరీర్ ఎంపికలు

• 82% WazirX వినియోగదారులు వారి క్రిప్టో పెట్టుబడులపై లాభాలను పొందారు (నవంబర్ 30, 2021 నాటికి)

WazirX క్రిప్టోలో ట్రేడింగ్ మరియు పెట్టుబడులలో, వినియోగదారులలో 66% మంది జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే అనే ఆసక్తికరమైన మార్పును చూశాయి. పురుషుల సైన్-అప్‌ల పెరుగుదలలో నమోదైన 829% వృద్ధితో పోలిస్తే కొత్తగా మహిళా వినియోగదారుల సంఖ్య పెరుగుదల 1009% వృద్ధి చెందింది. వయస్సు ఇంకా లింగ భేదాలు లేకుండా, క్రిప్టో మెట్రోలు ఇంకా టైర్-I నగరాలకన్నా అత్యధికంగా పాల్గొనే ధోరణిని కూడా చవిచూసింది. గౌహతి, కర్నాల్, బరేలీ వంటి చిన్న నగరాల నుండి పాల్గొనేవారి సంఖ్య కూడా 700% పెరిగింది, తద్వారా గ్రామీణ ఇంకా పల్లె ప్రాంతాల నుండి పెరుగుతున్న ఆసక్తిని ఇది సూచిస్తుంది.

వ్యాపార అవకాశాలను మించిన, WazirX NFT మార్కెట్‌ప్లేస్ 2021లో ఇప్పటివరకు 962 మంది క్రియేటర్‌లను 12,600 NFTలను తయారు చేయడానికి ఇంకా 262,896 WRX (~₹2.4 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ విలువైన వాటిని 5267కి పైగా విక్రయించెందుకు వీలు కల్పించింది. Mvmnt కలెక్షన్స్, క్రిప్టో కరాడి కలెక్షన్స్, క్రిప్టో మాంక్స్ & మెటావాస్సీ కలెక్షన్ – అభిషేప్స్, యష్ షైట్ – సైబర్ మిథిక్స్, మిలాన్‌జార్ట్ – సైబర్ స్కల్ ఫోర్స్ కలెక్షన్ వంటి కొన్ని టాప్ ట్రేడింగ్ NFTలు ఉన్నాయి.

క్రిప్టో స్వీకరణ ఆమోదపరంగా భారతదేశం అభివృద్ధి చెందుతోంది. ఎథేరియమ్, సొలాన, కర్డానో మరియు లేయర్ 2 సొల్యూషన్‌ల వంటి ప్రసిద్ధ ఆల్ట్‌కాయిన్‌ల అప్లికేషన్‌లలో ఎక్కువ సంఖ్యలో రిటైల్ మరియు సంస్థాగత పెట్టుబడిదారులు కొత్త ఆవిష్కరణల కోసం ఎదురు చూస్తున్నారు. అదనంగా, Metaverse యాప్‌లు మెయిన్ స్ట్రీమ్‌గా మారడంతో, WazirX DeFi, NFTలు, GameFiలలో అప్లికేషన్‌ల వెల్లువను ఆశించింది, ఇక్కడ వినియోగదారులు తమ డేటాను కలిగి ఉండటమే కాకుండా వర్చువల్ ఎకానమీలో సంపాదించవచ్చు. వృద్ధి సామర్థ్యం నాస్కామ్ నివేదిక ద్వారా కూడా ప్రతిఫలించింది, ఇది భారతదేశంలో క్రిప్టో మార్కెట్ 2 రెట్ల వేగంతో అభివృద్ధి చెందుతుందని ఇంకా 2030 నాటికి 800,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది.

మరింత సమాచారంతో కూడిన పూర్తి నివేదికను ఇక్కడ వీక్షించండి.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply