
Table of Contents
This article is available in the following languages:
నమస్కారం ట్రైబ్! ఫిబ్రవరిలో WazirXలో ఏమి జరిగిందో తెలిపే నెలవారీ నివేదిక ఇక్కడుంది.
గత నెలలో ఏం జరిగింది?
[పూర్తయినవి] 19 కొత్త మార్కెట్ జతలు: మేము గత నెలలో మా USDT మార్కెట్‌కి 13 టోకెన్‌లను ఇంకా మా INR మార్కెట్‌కి 6 టోకెన్‌లను చేర్చినాము! మీరు ఇప్పుడు WazirXలో LAZIO, PORTO, SANTOS, BICO, QNT, DUSK, ACH, SPELL, TFUEL, KNC, SLP, FIDA, IDEX, T, DAR, NMR మరియు JASMYలను కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీకు ఇష్టమైన జతలతో ఇక్కడ వ్యాపారం చేయడం ప్రారంభించండి!!
[పూర్తయినవి] ఫ్యాన్ టోకెన్ వీక్: WazirX 09 ఫిబ్రవరి మరియు 12 ఫిబ్రవరి 2022 మధ్య ఫ్యాన్ టోకెన్ వీక్ బహుమతి కోసం SS లాజియో, FC పోర్టో ఇంకా శాంటాస్ FCలతో కలిసి పనిచేసింది. ఇది డై-హార్డ్ ఫుట్‌బాల్ ఇంకా క్రిప్టో అభిమానులకు అంకితం చేయబడింది – ‘ఫ్యాన్ టోకెన్ వీక్ ‘ దేశవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించింది మరియు పాల్గొనేవారికి $960 విలువైన బైనన్స్ ఫ్యాన్ టోకెన్‌లను గెలుచుకునే అవకాశాన్ని అందించింది. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
[పూర్తయినవి] 25 లక్షల విలువైన గ్రాండ్ BICO బహుమతులు: WazirX మరియు బైకానమీ (BICO) కలిసి 11 ఫిబ్రవరి మరియు 16 ఫిబ్రవరి 2022 మధ్య అనేక కార్యకలాపాలు ఇంకా అద్భుతమైన బహుమతులను అందించడంలో పాలుపంచుకున్నాయి. ₹25 లక్షల (~$33,700) విలువైన బహుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
[పూర్తయినవి] BUIDL with WazirX ప్రారంభించబడింది: రాబోవు తరం వ్యవస్థాపకులు WazirX ద్వారా తమ సొంత ఎక్స్ఛేంజీలను నిర్మించుకునేందుకు వీలుగా, మేము ‘BUIDL with WazirX’ అనే కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించాము. సాధనాలు, మద్దతు, మార్గదర్శకత్వం, ప్రముఖ ఏంజెల్/VC పెట్టుబడిదారులకు యాక్సెస్ మరియు మరిన్ని ఇప్పుడు మీ వేలికొనలకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వెదకండి.
మనం ఏమి నిర్మిస్తున్నాము?
[కొనసాగుతున్నవి] AMM ప్రోటోకాల్: మా DEX ఆధారపడిన కొన్ని ప్రోటోకాల్‌లలో ఆనూహ్య జాప్యాలు ఉన్నాయి. ఇది మమ్మల్ని లైవ్‌కి వెల్లనీయకుండా ఆపుతోంది. ఈ సమయంలో, దీనికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై మావద్ద ETA లేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రోటోకాల్ బృందంతో మేము చాలా కృషిచేస్తున్నామని హామీ ఇస్తున్నాము.
[కొనసాగుతున్నవి] కొత్త టోకెన్‌లు: మేము రాబోయే వారాల్లో WazirXలో మరిన్ని టోకెన్‌లను చేర్చబోతున్నాము. ఏవైనా సూచనలు ఉన్నాయా? దయచేసి మాకు @WazirXIndiaకు ట్వీట్ చేయండి..
కొన్ని ముఖ్యాంశాలు
- టెలిగ్రామ్‌లో, మేము ‘వజీర్‌ఎక్స్ హీరో ఆఫ్ ది మంత్’ని ప్రారంభించాము. మరిన్ని వివరాలను ఇక్కడ పొందండి.
- మీ కొనుగోలు ప్రాధాన్యతలను అనుకూలీకరించడంలో మీకు సహాయపడటానికి మేము మా యాప్‌ని అప్‌డేట్ చేశాము.
- మీరు మీ QuickBuy స్క్రీన్‌ని అనుకూలీకరించవచ్చు ఇంకా మీ ప్రాధాన్యత ప్రకారం నాణేలు/టోకెన్‌లను క్రమబద్ధీకరించవచ్చు. మీరు ఎక్కువగా ట్రేడ్ చేయబడినవి, అత్యధిక లాభాలు పొందినవి, అత్యల్ప ధర ఇంకా మరిన్ని ఇటువంటి అంశాల ఆధారంగా మీ ప్రాధాన్యతను సెట్ చేయవచ్చు.
- మీరు యాప్‌లో అనుకూలీకరించిన ధర అలర్టులను కూడా పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా – మీకు ఇష్టమైన నాణేలు/టోకెన్‌లను ఎంచుకోండి మరియు అలర్టులను సర్దుబాటు చేయండి. ఇది దేనికైనా చేయవచ్చు – ఉదాహరణకు, ధర మార్పు, తక్కువ, మధ్యస్థం లేదా ఎక్కువ ఏదైనా కావొచ్చు.
- మా అప్‌డేట్ చేసిన యాప్ (Android ఇంకా IOS) ద్వారా మీరు ఇప్పుడు FAQలు, క్రిప్టోలో ఎలా ట్రేడ్ చేయాలనే దానిపై గైడ్‌లు, INR డిపాజిట్లు, P2P ట్రేడింగ్ ఇంకా ఇలాంటివి ఎన్నో యాప్‌లోనే చదవవచ్చు (“మమ్మల్ని సపోర్ట్ చేయండి & సంప్రదించండి” విభాగం). అలాగే, వినియోగదారులు యాప్ నుండి నేరుగా చాట్ మద్దతును త్వరగా ప్రారంభించవచ్చు..
ఇది మాకు నిర్మాణాత్మకమైన నెల, మరియు మేము చాలా ఆశలు ఇంకా సానుకూల దృక్పధంతో మార్చి 2022 కోసం ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పటిలాగే మాకు మద్దతు ఇస్తూ ఉండండి.
జై హింద్!
