Skip to main content

నెలవారీ సమీక్ష – జనవరి 2022 (Month in Review – January 2022)

By ఫిబ్రవరి 1, 2022ఫిబ్రవరి 16th, 20222 minute read

నమస్తే ట్రైబ్! జనవరిలో WazirXలో ఏమి జరిగిందో దాని యొక్క నెలవారీ నివేదిక ఇక్కడ ఉంది.

గత నెలలో ఏం జరిగింది?

 [పూర్తయింది] 20 కొత్త మార్కెట్ జంటలు: మేము గత నెలలో మా USDT మార్కెట్‌కి 8 టోకెన్‌లను ఇంకా మా INR మార్కెట్‌కి 12 టోకెన్‌లను జోడించాము! మీరు ఇప్పుడు WazirXలో COCOS, AMP, CTXC, VOXEL, ONE, Near, ENS, POWR, ROSE, ANT, ARDR, GRT, OOKI, CREAM, BTTC, GLMR, ANY, ఇంకా XNOలను కొనవచ్చు, విక్రయించవచ్చు ఇంకా వాటితో ట్రేడింగ్ చేయవచ్చు. మీకు ఇష్టమైన జంటలతో ఇక్కడ వ్యాపారం చేయడం ప్రారంభించండి! [పూర్తయింది] Grand EZ కానుక: WazirX ఇంకా EasyFi కలిసి 4 జనవరి నుండి 14 జనవరి 2022 వరకు అనేక కార్యకలాపాలు మరియు అద్భుతమైన కానుకలు అందజేస్తున్నాయి. $47,100 విలువైన కానుకలను పొందవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.

 [పూర్తయింది] అద్భుతమైన PUSH బహుమతులు: WazirX మరియు ఎథేరియమ్ పుష్ నోటిఫికేషన్ సర్వీస్ (EPNS) 27 జనవరి నుండి 03 ఫిబ్రవరి 2022 వరకు అనేక కార్యకలాపాలు ఇంకా అద్భుతమైన బహుమతులిచ్చెనందుకు కలిసి పనిచేస్తున్నాయి . $25,500 విలువైన బహుమతులను పొందవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

[పూర్తయింది] UFT వెల్‌కమ్ ఆఫర్: WazirX మరియు UniLend 27 జనవరి నుండి 31 జనవరి 2022 మధ్య రిపబ్లిక్ డే ప్రచారానికి కలిసి ముందుకు వచ్చాయి. క్రిప్టోవర్స్‌లోకి ప్రవేశించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్వాలంబనను పెంపొందిచుకునేలా చేయడమే దీని ఉద్దేశ్యం. $20,000 విలువైన బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.  

[పూర్తయింది] గురుకుల్ కంగ్రీ సమర్పణలో ఉచిత ద్విభాషా బ్లాక్‌చెయిన్ కోర్సు: ఇది విద్యార్థుల కోసం ఒక విద్యా కార్యక్రమం, గురుకుల కంగ్రీ (యూనివర్శిటీగా పరిగణించబడుతుంది) ద్వారా WazirX సహకారంతో – ఇది పూర్తిగా ఉచితం. విద్యార్థులు బ్లాక్‌చెయిన్ ఇంకా క్రిప్టో గురించి తెలుసుకోవాల్సినవన్నీ WazirX సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ మీనన్ నుండి ఉచితంగా తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

మనమేమి నిర్మిస్తున్నాము?

 [పురోగతిలో ఉంది] AMM ప్రోటోకాల్: మా DEX ఆధారపడిన కొన్ని ప్రోటోకాల్‌లలో అనూహ్యమైన జాప్యాలు ఉన్నాయి. ఇది మమ్మల్ని ప్రత్యక్ష ప్రసారానికి వెళ్లకుండా అడ్డుపడుతోంది. ఈ సమయంలో, దీనికి ఎంత సమయం పడుతుందనే దానిపై మాకు నిర్దిష్ట అంచనా సమయం అందుబాటులో లేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి మేము ప్రోటోకాల్ బృందంతో చాలా తీవ్రంగా నిర్విరామంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాము.  

[పురోగతిలో ఉంది] కొత్త టోకెన్‌లు: మేము రాబోయే వారాల్లో WazirXలో మరిన్ని టోకెన్‌లను జోడిస్తాము. ఇందుకు ఏవైనా సూచనలు ఉన్నాయా? దయచేసి మాకు @WazirXIndiaకు ట్వీట్ చేయండి.

కొన్ని ముఖ్యాంశాలు

  • మేము ఈ నెలలో #HumansOfCrypto సీజన్ 2 యొక్క రెండు ఎపిసోడ్‌లను ఆరంభించాము.
    • ఎపిసోడ్‌ 1 👇                      
    • ఎపిసోడ్‌ 2👇
  • క్రిప్టో ఔత్సాహికులు ఇప్పుడు కన్నడలో తమకు ఇష్టమైన క్రిప్టో బ్లాగును చదవగలరు!
  • 24 జనవరి 2022 నుండి అమలు కాబోతుంది, INR మార్కెట్‌లలో ఫీజులు చెల్లించేటప్పుడు WRX ఇకపై ఉపయోగించబడదు. దానికి బదులుగా, ఇది ఎక్స్ఛేంజ్‌లో మీ WRX బ్యాలెన్స్‌పై ఆధారపడి మీ ట్రేడింగ్ ఫీజులను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఇప్పటికీ USDT, BTC మరియు WRX మార్కెట్‌లలో WRXతో ట్రేడింగ్ ఫీజులను చెల్లించగలిగినప్పటికీ, INR మార్కెట్‌లో, మీరు INRతో మాత్రమే ట్రేడింగ్ ఫీజులను చెల్లించగలరు. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఇది మాకు ఈవెంట్లతో కూడిన నెల, ఇంకా మేము అనేక ఆశలు మరియు సానుకూలతతో ఫిబ్రవరి 2022 కోసం ఎదురు చూస్తున్నాము. ఎప్పటిలాగే మాకు మీ సహకారం అందిస్తూ ఉండండి.

జై హింద్! 🇮🇳

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply