
Table of Contents
This article is available in the following languages:
నమస్తే ట్రైబ్! మార్చ్‌లో WazirXలో జరిగిన దాని గురింతి నెలవారి రిపోర్ట్ ఇక్కడ ఉంది.
గత నెలలో ఏం జరిగింది?
[పూర్తయినవి] 17 కొత్త మార్కెట్ జతలు: మేము గత నెలలో మా USDT మార్కెట్‌కు 8 టోకెన్‌లను ఇంకా మా INR మార్కెట్‌కు 9 టోకెన్‌లను జోడించాము! మీరు ఇప్పుడు WazirXలో DODO, DYDX, STPT, SPELL, IMX, PYR, BAKE, API3, NEO, APE, JASMY, ALPINE, ASTR, KNC, ICX, ANC మరియు FLUXలను కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీకు ఇష్టమైన జంటలతో ఇక్కడ ట్రేడ్ చేయడం ప్రారంభించండి!
[పూర్తయినవి] ₹56 లక్షల విలువైన DODO కానుకలు: WazirX మరియు DODO 1 మార్చి మరియు 18 మార్చి 2022 మధ్య అనేక కార్యకలాపాలు మరియు అద్భుతమైన బహుమతులు అందించేందుకు కలిసి ముందుకు వచ్చాయి. ₹56 లక్షల (~$71,000) విలువైన బహుమతులు పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి! మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి!
[పూర్తయినవి] ₹4 కోట్ల విలువైన WazirX యొక్క 4వ పుట్టినరోజు కానుక: WazirX 8 మార్చి 2022న 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! ఇప్పటివరకు జరిగిన మా పస్తానాన్ని వేడుక చేసుకొనేందుకు, మేము HTK పోటీని (WRX/INR) 3 మార్చి మరియు 9 మార్చి 2022 మధ్య నిర్వహించాము. ₹4 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.
[పూర్తయినవి] WazirX యొక్క 4వ జన్మదిన వేడుకలు: మా 4వ పుట్టినరోజును జరుపుకోవడానికి, మేము అనేక పోటీలు, ఆఫర్‌లు మరియు లాంచ్‌లను కలిగి ఉన్నాము. ఇందులో ఇవి ఉన్నాయి::
- మా సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో పోటీలు,
- WazirX Trivia (₹10,000 విలువైన బహుమతులతో),
- మా మెర్చ్ స్టోర్‌లో గరిష్టంగా 50% తగ్గింపు, ఇంకా
- WazirX క్రిప్టో విడ్జెట్‌ల ప్రారంభం. మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.
[పూర్తయినవి] 7వ WRX బర్న్: WazirX 9 మార్చి 2022న అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసికంలో 7వ WRX బర్న్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మేము ₹47 కోట్ల INR (~ $6 మిలియన్ USD)కి సమానమైన 9,633,333 WRXని బర్న్ చేసాము! మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.
[పూర్తయినవి] ₹2 కోట్ల విలువైన బహుమతితో BTC/INR ట్రేడింగ్ పోటీ: మేము 9 మార్చి మరియు 12 మార్చి 2022 మధ్య 3 రోజుల పాటు జరిగిన BTC/INR ట్రేడింగ్ కాంటెస్ట్‌లో ₹2 కోట్ల విలువైన బహుమతులను అందించాము. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
[పూర్తయినవి] ₹40 లక్షల విలువైన గ్రాండ్ CELO బహుమతి: WazirX 21 మార్చి మరియు 31 మార్చి 2022 మధ్య గ్రాండ్ CELO బహుమతిని నిర్వహించింది! ₹40,00,000 (~$51,000) కంటే ఎక్కువ బహుమతిని అందజేయడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.
మనం దేనిని నిర్మిస్తున్నాము?
[కొనసాగుతోంది] AMM ప్రోటోకాల్: మా DEX ఆధారపడిన కొన్ని ప్రోటోకాల్‌లలో ఊహించని జాప్యాలు ఉన్నాయి. ఇది లైవ్‌లో వచ్చేందుకు మమ్మల్ని ఆటంకపరిస్తోంది. ఈ సమయంలో, దీనికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై మాకు ETA లేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి మేము ప్రోటోకాల్ బృందంతో చాలా కష్టపడి పనిచేస్తున్నామని హామీ ఇస్తున్నాము.
[కొనసాగుతోంది] కొత్త టోకెన్‌లు: మేము రాబోయే వారాల్లో WazirXలో మరిన్ని టోకెన్‌లను జాబితా చేస్తాము. ఏవైనా సూచనలు ఉన్నాయా? ఉంటే దయచేసి మాకు @WazirXIndiaకు ట్వీట్ చేయండి.
కొన్ని ముఖ్యాంశాలు
- #WazirX మహిళా నాయకులతో #BreakTheBias అనేది మా సూపర్ ఉమెన్‌లకు మా అభినందనలు.
- మేము మా ‘ఉచిత క్రిప్టో విడ్జెట్‌లు’ విభాగాన్ని ప్రారంభించాము. ఇవి ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్ కోసం ప్లగ్-ఎన్-ప్లే సాధనాలుగా పని చేస్తాయి. ఈ కోడ్‌లను పొందుపరచడం ద్వారా, వినియోగదారులు నిజ-సమయ క్రిప్టో ధర పట్టికలు, టిక్కర్‌లు, ధర చార్ట్‌లు మరియు మరిన్నింటిని పొందవచ్చు.
ఇది మాకు పవర్-ప్యాకెడ్ కూడుకున్న నెల, ఇంకా మేము చాలా ఆశలు మరియు సానుకూలతతో ఏప్రిల్ 2022 కోసం ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పటిలాగే మాకు మద్దతు ఇస్తూ ఉండండి.
జై హింద్!🇮🇳
