Skip to main content

WazirX P2P – మీ అన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడ్డాయి!

By మే 25, 2022జూలై 8th, 20225 minute read
WazirX P2P

WazirX P2P (పీర్ టు పీర్) ఇన్వెస్టర్లకు వారి డబ్బును తక్షణమే క్రిప్టో (ఇంకా ఇతరాత్ర)గా మార్చడంలో సహాయపడుతుంది. ఇది పూర్తిగా ఉచితం ఇంకా సురక్షితంగా మరియు చట్టబద్ధంగా ఎల్లప్పుడూ 24×7 అందుబాటులో ఉంటుంది!! WazirX P2Pని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి, మా బ్లాగును ఇక్కడ చదవండి.

మా వినియోగదారులు తరచుగా అడిగే ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఈ పోస్ట్ వాటన్నీటినీ నివృత్తి చేస్తుందని నేను నిస్సందేహంగా నమ్ముతున్నాను. 

ప్రశ్న 1: WazirX P2P కేవలం USDTని మాత్రమే ఎందుకు కలిగి ఉంది?

USDT అనేది ఒక స్టేబుల్ కాయిన్. లావాదేవీలను సరళంగా ఉంచడానికి ఇంకా అధిక లిక్విడిటీ నిర్ధారించడానికి, USDT మాత్రమే మద్దతు ఇస్తుంది.

ప్రశ్న 2: WazirXలో P2Pని ఎవరు ఉపయోగించవచ్చు?

భారతీయ KYC ఉన్న వినియోగదారులెవరైనా WazirXలో P2P ఫీచర్‌ని ఉపయోగించవచ్చు.

ప్రశ్న 3: నేను విక్రేత బ్యాంక్ వివరాలను చూడలేకపోయాను మరియు 10 నిమిషాల్లో ట్రేడ్ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి?

ఇక్కడ, మీరు ముందుగా చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలి. ఆపై, మీ ట్రేడ్ సరిపోలిన తర్వాత “అవును, నేను చెల్లిస్తాను” ఎంపికపై క్లిక్ చేయండి. మీరు “అవును, నేను చెల్లిస్తాను”పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే విక్రేత యొక్క బ్యాంక్ వివరాలు మీకు కనిపిస్తాయి. ఈ వివరాల ఆధారంగా మీరు చెల్లింపును కొనసాగించవచ్చు.

ప్రశ్న 4: వివరాలు తప్పుగా ఉండటం/విఫలం కావడం/బ్యాంకింగ్ సమస్య/నెట్‌వర్క్ సమస్య ఇలాంటి కారణాల వల్ల నేను విక్రేత బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయలేకపోతున్నాను.

ఆర్డర్‌ను రద్దు చేయడానికి మరియు పెనాల్టీని మాఫీ చేయించుకోవడానికి మీరు మా సపోర్ట్ టీమ్‌ని చాట్ ద్వారా సంప్రదించాలి. నిజమైన వైఫల్యాన్ని ధృవీకరించడానికి స్క్రీన్‌షాట్‌లు/నిరూపణలను షేర్ చేయమని సపోర్ట్ టీమ్‌ మిమ్మల్ని అడుగుతుంది. ప్రత్యామ్నాయంగా, ట్రేడ్ స్వయంచాలకంగా రద్దు చేయబడిన తర్వాత (సమయం ముగిసిన తర్వాత) మీరు పెనాల్టీ ఇమెయిల్‌ను అందుకుంటారు. మీరు తగిన రుజువుతో ఈ ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. అది ఆమోదిస్తే, మా జట్టు పెనాల్టీని వెనక్కుతీసుకుంటుంది..

ప్రశ్న 5: మీరు చెల్లింపు పూర్తి చేసినా నేను చెల్లించానుపై క్లిక్ చేయడం మర్చిపోతే ఏమి చేయాలి?

‘రైజ్ డిస్‌ప్యూట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయడానికి మీకు 10 నిమిషాల సమయం ఉంటుంది. మీరు వివాదాన్ని లేవనెత్తిన తర్వాత, చెల్లింపు రుజువును అభ్యర్థిస్తూ మా వివాద బృందం నుండి మీకు వెంటనే ఇమెయిల్ వస్తుంది. తర్వాత, తదుపరి 15 నిమిషాల్లో, ఇమెయిల్‌లో పేర్కొన్న సూచనలను అనుసరించి, దయచేసి చాట్ ద్వారా మా సపోర్ట్ టీమ్‌ని సంప్రదించండి. వివాద బృందం ఇతర వివరాలతో పాటు మీ చెల్లింపు రుజువును సమీక్షించి, మీ వివాదంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. వివాద బృందం యొక్క నిర్ణయమే అంతిమమైనది ఇంకా అందుకు కట్టుబడి ఉంటుంది మరియు దానిని మార్చలేము.

దయచేసి గమనించండి: వివాదాన్ని సమీక్షించేటప్పుడు పూర్తి ఖచ్చితత్వాన్ని నిర్ధారించే మల్టీ-చెక్ ఫూల్ ప్రూఫ్ ప్రక్రియ మా వద్ద ఉంది. 

ప్రశ్న 6: WazirX P2Pలో లావాదేవీ విఫలమైతే రికవరీ (నిధుల విషయంలో) ఎలా పని చేస్తుంది కొనుగోలుదారు ట్రేడ్‌నినిర్ధారించడానికి బదులుగా ట్రేడ్‌ని రద్దు చేసినప్పుడు?

కొనుగోలుదారు చెల్లింపు చేసి, ఆపై లావాదేవీని రద్దు చేసినప్పుడు, మేము కొనుగోలుదారు చెల్లింపు వివరాలను విక్రేతతో పంచుకుంటాము మరియు కొనుగోలుదారుకు చెల్లింపును తిరిగి చేయమని వారిని అడుగుతాము. కొనుగోలుదారు వారి నిధులను తిరిగి పొందారని నిర్ధారించుకోవడానికి, మేము విక్రేత నిధులు మరియు/లేదా ఖాతాను లాక్ చేస్తాము ఇంకా చెల్లింపు రుజువుతో పాటు మొత్తం సమాచారంతో ఇమెయిల్‌ను పంపుతాము. మేము ప్రతి 24 గంటలకు ఒకసారి విక్రేతకు మొత్తం 3 రిమైండర్‌లను పంపుతాము. అయితే 3వ ఇంకా చివరి రిమైండర్ తర్వాత, మేము నిధుల రికవరీని కొనసాగిస్తాము, దీనికి గరిష్టంగా 13 పనిదినాలు పట్టవచ్చు (అయితే, నిధులు అందుబాటులో ఉన్నప్పుడే ఇది పని చేస్తుంది).

ప్రశ్న 7: చెల్లింపు పూర్తి చేసిన తర్వాత కూడా, నా ట్రేడ్ వివాదానికి తరలించబడింది; ఇలాంటప్పుడు ఏం చేయాలి?

అనేక కారణాల వల్ల మీ ట్రేడ్ వివాదానికి తరలించబడవచ్చు. ఈ సందర్భంలో, మీరు చెల్లింపు రుజువుతో చాట్‌లో మా సపోర్ట్ టీమ్‌ని సంప్రదించవచ్చు. మీ నిధులు సురక్షితంగా ఉంటాయని నిశ్చింతగా ఉండండి.

ప్రశ్న 8: నేను విక్రేత/కొనుగోలుదారుని ఇంకా అజ్ఞాత కొనుగోలుదారులు/విక్రేతలతో ఆటో-మ్యాచ్ అయ్యేందుకు నేను ఇష్టపడను. ఏం చేయాలి?

మీరు మీ క్రిప్టోను ఎవరితోనైనా ట్రేడ్ చేయాలనుకుంటే, మీరు మొదటి దశలోనే వారి XIDని జోడించవచ్చు. XID వినియోగదారు పేరు వలె పనిచేస్తుంది! దీనితో, కొనుగోలుదారు/విక్రేతని మీరు ఎంచుకోవచ్చు ఇంకా ఆ నిర్దిష్ట లావాదేవీ సమయంలో మీరు మరెవరితోనూ మ్యాచ్ కాలేరు.

ప్రశ్న 9: నేను ఒక రోజులో చేయగల P2P లావాదేవీల సంఖ్య/విలువపై రోజువారీ పరిమితి ఏదైనా ఉందా?

లేదు! WazirXలో మీరు ఒక రోజులో ఎన్ని P2P లావాదేవీలనైనా చేయవచ్చు. అయితే, మీ బ్యాంక్ కొన్ని పరిమితులను కలిగి ఉండవచ్చు, వాటికి మీరు కట్టుబడి ఉండాల్సివస్తుంది.

ప్రశ్న 10: నేనొక కొనుగోలుదారుని. చెల్లింపు చేసిన తర్వాత, నా లావాదేవీ ప్రాసెసింగ్లో నిలిచిపోయింది. నేనేం చేయాలి? నిధులు మినహాయించబడ్డాయో లేదో నాకు తెలియదు

మీరు చెల్లింపు చేసిన సందర్భాలలో కానీ చెల్లింపు స్థితి ‘ప్రాసెసింగ్’ చూపుతున్నప్పుడు, మీరు WazirXలో ‘అవును, నేను చెల్లించాను’పై క్లిక్ చేసి, చెల్లింపు రుజువును (ప్రాసెసింగ్) జోడించి, విక్రేత చెల్లింపు రసీదుని నిర్ధారించే వరకు వేచి ఉండండి. . విక్రేత చెల్లింపును స్వీకరించినట్లయితే, లావాదేవీ ప్రాసెస్ చేయబడుతుంది. ఒకవేళ చెల్లింపు రద్దు చేయబడితే, మీరు మా సపోర్ట్ టీమ్‌ని చాట్ ద్వారా సంప్రదించవచ్చు మరియు మేము మీ కోసం ఆర్డర్‌ను రద్దు చేస్తాము ఇంకా ఇది నిజమైన పొరపాటు కనుక పెనాల్టీని కూడా మాఫీ చేస్తాము.

మెరుగైన పరిశీలన కొరకు WazirX ద్వారా P2Pలో ఈ వీడియోని ఒకసారి చూడండి.

ప్రశ్న 11: WazirX తీసుకున్న భద్రతా చర్యలు ఏమిటి?
అజ్ఞాత వ్యక్తులను విశ్వసించడం కష్టమని మేము అర్థం చేసుకున్నాము. మీ నిధులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, WazirX మొత్తం లావాదేవీని సురక్షితంగా ఉంచడానికి ఒక ఎస్క్రో సిస్టమ్‌ను కలిగి ఉంది, తద్వారా ఏ పార్టీ కూడా మరొకరిని మోసం చేయబోదు. మీరు విక్రేత అయితే – మీరు చెల్లింపు రసీదుని నిర్ధారించే వరకు WazirX మీ USDTని కొనుగోలుదారుకు వాటిని విడుదల చేయదు మరియు మీరు కొనుగోలుదారు అయితే – మీరు విక్రేతకు చెల్లింపు చేస్తున్నప్పుడు WazirX విక్రేత యొక్క USDTని కలిగి ఉంటుంది. WazirXలో ట్రేడ్ చేయడానికి ప్రతి వినియోగదారుని అనుమతించే ముందు మేము వారి KYC వివరాలను కూడా ధృవీకరిస్తాము. మా ఎక్స్‌ఛేంజ్‌లో జరిగే ప్రతి లావాదేవీకి సంబంధించిన రికార్డు నిర్వహించబడుతుంది.
ప్రశ్న 12: అందుకున్న USDT ఆర్డర్ చేసిన దాని కంటే తక్కువగా ఉంది. ఇలా ఎందుకు జరిగింది?
ఆర్డర్ విజయవంతంగా ప్రాసెస్ చేయబడినప్పుడు, మీరు మీ ఖాతాలోకి స్వయంచాలకంగా హామీ ఇవ్వబడిన USDTని స్వీకరిస్తారు. తగ్గింపులు, ఏదైనా ఉంటే, పెనాల్టీలు లేదా బాకీ ఉన్న ట్రేడింగ్ ఫీజులు కావచ్చు. ఈ మినహాయింపుల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ట్రేడింగ్ రిపోర్ట్‌లోని లెడ్జర్‌ని తనిఖీ చేయవచ్చు. 
గుర్తుంచుకోవలసిన అంశాలు
మీ లావాదేవీలు రద్దు చేయబడలేదని లేదా తిరస్కరించబడలేదని నిర్ధారించుకోవడానికి, దయచేసి ఈ అంశాలను గుర్తుంచుకోండి:
ఒక కొనుగోలుదారుగా:
సరిపోలిన విక్రేతకు మాత్రమే చెల్లించాలని నిర్ధారించుకోండి. మీ ట్రేడ్ సరిపోలిన తర్వాత ఏ ఇతర విక్రేతకు చెల్లింపులు చేయవద్దు.
చెల్లించాల్సిన మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేయవద్దు. దీని అర్థం మీరు 1198.20 చెల్లించవలసి వస్తే, దయచేసి 1198.20 (మరియు 1199 లేదా 1200 కాదు) ఖచ్చితమైన సంఖ్యనే చెల్లించండి.
మీరు మీ స్వంత ఖాతా నుండి మాత్రమే చెల్లింపులు చేయాలి మరియు ఇతర (ఉదా: కుటుంబం/స్నేహితులు) ఖాతాల నుండి కాదు, ఇది చెల్లనిదిగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో చెల్లింపు నిలిచిపోయిన తర్వాత, రికవరీ 3వ పార్టీ చెల్లింపుగా ఉంటుందే కానీ P2Pగా కాదు. అంతేకాకుండా, 3వ పక్షం ఖాతా నుండి చెల్లింపు జరిగితే, ట్రేడ్ ఎల్లప్పుడూ విక్రేతకు అనుకూలంగా పరిష్కరించబడుతుంది. WazirX P2Pలో 3వ పక్షం చెల్లింపులు చేయడం అనుమతించబడదు మరియు మీ ఖాతా ప్లాట్‌ఫారమ్‌లో ఫ్లాగ్ చేయబడవచ్చు.
మీరొకసారి చెల్లింపు పూర్తిచేసిన తర్వాత, యాప్‌లో అదే విషయాన్ని నిర్ధారించారని నిర్ధారించుకోండి. ఇక్కడ, చెల్లింపు రుజువును అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, UTR (యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్) నంబర్ కనిపించేలా చూసుకోండి.
స్క్రీన్‌పై ఉన్న సూచనలను సరిగ్గా చదివినట్లు నిర్ధారించుకోండి. ఉదాహరణకు, ‘పాక్షిక ఆర్డర్ మ్యాచింగ్’ విషయంలో, పేర్కొన్న మొత్తాలు మాత్రమే సరైన పక్షానికి చెల్లించబడ్డాయని నిర్ధారించుకోండి.
మీ P2P చెల్లింపు విఫలమైన సందర్భాల్లో, మీరు వెంటనే మళ్లీ చెల్లించడానికి ప్రయత్నించవద్దని మేము సూచిస్తున్నాము. అందుకు బదులుగా, మీరు చెల్లింపు వైఫల్యాన్ని చూపించే స్క్రీన్‌షాట్‌తో మా సపోర్ట్ టీమ్‌ని సంప్రదించవచ్చు. ట్రేడ్ రద్దు చేయడంలో మా బృందం మీకు సహాయం చేస్తుంది ఇంకా ఇది నిజమైన పొరపాటు కాబట్టి పెనాల్టీని కూడా రివర్స్ చేస్తుంది. ఇది రద్దు చేయబడిన తర్వాత, మీరు తాజా ఆర్డర్‌ను చేయవచ్చు.
ఒక విక్రేతగా:
చెల్లింపు స్వీకరించబడినప్పుడు, చెల్లింపు రసీదు యొక్క నిర్ధారణ తప్పనిసరి. ఇది చేయని పక్షంలో, వివాద పరిష్కార బృందం తగిన చర్యలు తీసుకుంటుంది. 
మీరు మూడవ పక్షం (కొనుగోలుదారు కాకుండా ఎవరైనా) నుండి చెల్లింపును స్వీకరించినట్లయితే, వ్యాపారాన్ని నిర్ధారించవద్దు ఇంకా చాట్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
వేచి ఉండాల్సిన సమయాలు క్రింది విధంగా ఉన్నాయి:
ట్రేడ్ సరిపోలిన తర్వాత, కొనుగోలుదారుగా, మీరు లావాదేవీని కొనసాగించాలనుకుంటున్నారా లేదా దాని కోసం చెల్లించాలనుకుంటున్నారో లేదో నిర్ధారించడానికి మీకు 10 నిమిషాల సమయం ఉంటుంది. 
చెల్లింపును పూర్తి చేసి, దానిని నిర్ధారించడానికి, మీరు (కొనుగోలుదారు) 60 నిమిషాల సమయాన్ని పొందుతారు.
విక్రేత అసలు రసీదు నుండి 2 గంటలలోపు చెల్లింపు రసీదుని నిర్ధారించాలి. అతను/ఆమె అలా చేయడంలో విఫలమైతే, వివాద పరిష్కారం కోసం లావాదేవీ స్వయంచాలకంగా మార్చబడుతుంది.
చాలా సందర్భాలలో 24-48 గంటలలోపు వివాద పరిష్కారాన్ని ఆశించవచ్చు. అయితే, నిర్దిష్ట బ్యాంకింగ్ కారణాల వల్ల ఏదైనా కేసు చిక్కుకుపోయినట్లయితే, పరిష్కారానికి 3-5 బ్యాంకింగ్ రోజుల వరకు పట్టవచ్చు.
ఈ సమయం ముగిసిన తర్వాత మీరు మా సపోర్ట్ టీమ్‌లను సంప్రదించవచ్చు. 
అనుబంధిత జరిమానాలు:
మీరు చెల్లింపును నిర్ధారించి, అలా చేయడంలో విఫలమైతే ఇంకా లావాదేవీని కూడా రద్దు చేయకుంటే, మీరు 10 USDT లేదా లావాదేవీ విలువలో 1.2%, ఏది ఎక్కువైతే అది జరిమానాగా చెల్లించవలసి ఉంటుంది.
మీరు చెల్లింపు చేయనప్పటికీ, మీరు అలా చేసినట్లు ధృవీకరించినట్లయితే, మీరు 20 USDT లేదా లావాదేవీ విలువలో 2.4%, ఏది ఎక్కువైతే అది పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. 
నిజమైన పరిస్థితుల్లో, పెనాల్టీని వెనక్కి తీసుకోవచ్చు. మా సపోర్ట్ టీమ్‌ ఇక్కడ నిర్ణయాధికారం కలిగి ఉంటుంది. 
మీరు మద్దతు టిక్కెట్‌లను సేకరించినప్పుడు లేదా చాట్ ద్వారా మమ్మల్ని సంప్రదించినప్పుడు, దయచేసి మీ సమస్యను సవివరంగా వివరించడానికి ప్రయత్నించండి. వేగవంతమైన రిజల్యూషన్ కోసం తగిన స్క్రీన్‌షాట్‌లను అందించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ సమాధానాలు మరియు పాయింటర్‌లు మీ P2P ప్రస్థానంలో మీకు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే, దయచేసి దిగువ వ్యాఖ్యలలో వాటిని జోడించడానికి సంకోచించకండి. 
హ్యాపీ ట్రేడింగ్!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply