Skip to main content

కొత్త క్రిప్టో ఇన్వెస్టర్లుగా మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 5 చిట్కాలు (& చేయకూడని 5 పొరపాట్లు) (5 Must-Know Tips As A Newbie Crypto Investors & 5 Mistakes To Avoid)

By ఏప్రిల్ 7, 2022జూన్ 3rd, 20224 minute read
5 Must-Know Tips As A Newbie Crypto Investors

కొత్త క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్‌గా, మీరు నిస్సందేహంగా మిమ్మల్ని మీరు ఇలాంటి సందేహాలను ప్రషించుకుంటున్నారు:

  • బిట్‌కాయిన్ బబుల్ పేలిపోయిందా?
  • ఇది ప్రారంభించడానికి చాలా ఆలస్యమైందా? ఇంకా
  • ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ పెట్టుబడి రంగంలో విజయవంతం కావడానికి మంచి వ్యూహాలు ఏమిటి?

మీరు ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీరు క్రిప్టోకరెన్సీ మార్కెట్ అస్థిరతను కూడా గమనించే ఉంటారు. అయితే, ప్రతి వార్త క్రిప్టోకరెన్సీలకు సంబంధించినదై ఉన్నప్పటికీ, అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉన్నా సరే, అది దాని అంతానికి అతిదూరంగా ఉందని మాకు తెలుసు ఇంకా క్రిప్టోకరెన్సీ పెట్టుబడి నిర్వాణ మార్గం గతంలో కంటే మరింత ఆశాజనకంగా ఉంది.

కాబట్టి, మీరు క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్‌కి మీ ప్రయాణం ప్రారంభించే ముందు, పెట్టుబడి పెట్టేముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. చదవండి!

మీరు క్రిప్టో నిబంధనలు ఇంకా పదబంధాల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ చిన్న గైడ్ ఉంది.

క్రిప్టో ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 5 చిట్కాలు

1. మీరు పోగొట్టుకున్నా తమాయించుకునేత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి

మీ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కావాలనుకుంటే ఫిక్సెడ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, SIPలు, డెట్ ఫండ్‌లు, ఇన్సూరెన్సులు ఇంకా అత్యవసర నిధులలో పెట్టుబడి పెట్టండి. ఈ ఆర్థిక భద్రత తర్వాత కూడా మీ వద్ద డబ్బు ఉంటే, మీరు ఖచ్చితంగా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు ఎందుకంటే ఇది మీరు కోల్పోయినా మిమ్మల్ని ఆర్థికంగా ప్రభావితం కాకుండా ఉంచే డబ్బు.

2. మీ పరిశోధనను కొనసాగించండి

స్నేహితులు లేదా బంధువుల సిఫార్సుల ఆధారంగా గుడ్డిగా పెట్టుబడి పెట్టడం సులభం. అయితే, ఇది మీ డబ్బు అని గుర్తుంచుకోండి మరియు పెట్టుబడి విఫలమైతే ఎవరూ మీకు సహాయమంచించేందుకు ముందుకు రారు. ఫలితంగా, క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో ఏదైనా డబ్బు పెట్టే ముందు దానిపై పూర్తిగా అవగాహన ఉండటం మంచిది. ముందుగా, బిట్‌కాయిన్, ఎథీరియమ్, టెథర్, పాలిగాన్ ఇంకా ఇతర ప్రముఖ క్రిప్టోకరెన్సీల గురించి తెలుసుకోండి. అప్పుడు, ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు, వాటి వినియోగ సందర్భాలు ఇంకా అవకాశాల గురించి తెలుసుకోండి.

3. నమ్మదగిన & వశ్వసనీయమైన ఎక్స్ఛేంజీని ఎంచుకోండి.

క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ తరచుగా హ్యాక్ చేయబడతాయి లేదా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడానికి వాడబడతాయి. అందువల్ల, మీరు ట్రాక్ రికార్డ్‌ పరిశీలించబడ్డ పెద్ద ఎక్స్‌ఛేంజ్‌లు ఖాతాను తెరిచారని ఇంకా హ్యాక్ అయినప్పుడు మీకు బీమా కవరేజీ ఉంటుదని నిర్ధారించుకోండి.

4. సాంకేతిక అంశాలలో అవగాహన పెంచుకోండి.

మీరు క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్‌పై సీరియస్‌గా ఉన్నట్లయితే, మీ డిజిటల్ వాలెట్‌లను ఎలా డిజైన్ చేయాలో తెలుసుకోవడం లేదా మీ ఫండ్‌లను రక్షించుకోవడానికి పేరున్న హార్డ్ వాలెట్‌ని కొనుగోలు చేయడం మంచిది. ఆపై, మీ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి, లిక్విడిటీ మైనింగ్, స్టాకింగ్, వికేంద్రీకృత డబ్బు ఇంకా మరిన్నింటి గురించి తెలుసుకోండి.

5. స్కామర్ల పట్ల జాగ్రత్త వహించండి.

స్కామర్లు పెట్టుబడిదారులను వారి డబ్బుని మోసం చేసి సంపాదించే పద్ధతుల కోసం నిరంతరం వెతుకుతూ ఉంటారు. నకిలీ ఎయిర్‌డ్రాప్‌లు, పంప్ అండ్ డంప్ స్కామ్‌లు మరియు సోషల్ మీడియా ఖాతాల నుండి సందేశాలు అన్నింటినీ పట్టించుకోకూడదు. స్కామర్లు పెట్టుబడిదారులను స్కామ్ చేయడానికి మోసపూరిత వెబ్‌సైట్‌లను కూడా ఉపయోగిస్తారు.

మీ సమాచారాన్ని సమర్పించే ముందు, ఎక్స్‌ఛేంజ్ URLని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి ప్రసిద్ధ సైట్‌ల నుండి ఎల్లప్పుడూ ట్రేడింగ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఇతర క్రిప్టో ఫ్యాన్స్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కనెక్ట్ అవ్వడం లాభదాయకం, కానీ వారి సిఫార్సుల ఆధారంగా ఎప్పుడూ పెట్టుబడులు పెట్టకండి.

పెట్టుబడి పెట్టే ముందు, ఈ చిట్కాలను గుర్తుంచుకోండి మరియు ఎల్లప్పుడూ అలర్ట్ మోడ్‌లో ఉండండి.

కొత్త క్రిప్టో ఇన్వెస్టర్లుగా మీరు చేయకూడని 5 పొరపాట్లు

మీరు క్రిప్టో ట్రేడింగ్‌లో మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, తప్పులు చేయడం కొన్నిసార్లు అనివార్యం అవుతుంది. కానీ, ఇక్కడ, కొత్త పెట్టుబడిదారుగా మీరు నివారించగల ఐదు పొరపాట్లను మేము ఈ జాబితాలో చూపాము. వాటిని ఈ క్రింద చూడండి:

1. కేవలం తక్కువ ధరపైనే పెట్టుబడి పెట్టడం

తక్కువ ధర తప్పనిసరిగా మంచి ఒప్పందాన్ని అనిపించకపోవచ్చు. అయితే, ఏదో ఒక కారణం వల్ల ధరలు కొన్నిసార్లు తక్కువగా ఉంటాయి! వినియోగదారు సంఖ్యలు తగ్గిపోయే కాయిన్లపై ఒక కన్ను వేసి ఉంచండి.

తరచుగా, డెవలపర్లు ప్రాజెక్ట్‌ను వదులుకుంటారు ఇంకా అది దానిని అప్‌గ్రేడ్ చేయడంలో విఫలమవుతుంది, క్రిప్టోను అసురక్షితంగా ఉంచుతుంది.

2. ప్రతీదీ సక్రమంగా ఉంచడం

కొంతమంది సలహాదారులు మీ లాభాలను పెంచుకోవడానికి వీలైనంత ఎక్కువ పందెం కాయమని మీకు సలహా ఇవ్వవచ్చు. కానీ, జాగ్రత్త, ఇందువల్ల మీరు దివాలా తీసే అవకాశాలు ఉన్నాయి.

మెరుగైన క్రిప్టో పెట్టుబడి సలహా మీ పెట్టుబడి డబ్బును నిర్దిష్ట శాతానికి పరిమితం చేయడం – అంటే 5% లేదా 10% – మరియు మీ పొదుపు ఖాతాలో మీరు కలిగి ఉన్న మిగిలిన డబ్బు మీ అత్యవసర నగదు నిల్వగా పనికివస్తుంది.

3. క్రిప్టోకరెన్సీ “సులభంగ వచ్చే డబ్బు” అని నమ్మడం.

స్టాక్‌లు, షేర్లు లేదా వెండి మరియు బంగారం ఏదైనా ఆర్థిక సాధనాన్ని ట్రేడ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడం సులభం కాదు. కానీ దురదృష్టవశాత్తు, క్రిప్టోకరెన్సీ అదే పంధాలో ఉంది.

అలా కాకుండా నిజమని చెప్పేవారు ఎవరైనా మిమ్మల్ని క్రిప్టోలో పొరపాట్లు చేసేలా మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు.

4. మీ క్రిప్టో కీ ట్రాక్‌ను కోల్పోవడం

మీరు మీ క్రిప్టోకరెన్సీని హార్డ్‌వేర్ వాలెట్‌లో ఉంచుకుంటే, మీ కీని మర్చిపోవడం అనేది సేఫ్టీ డిపాజిట్ బాక్స్‌లో కీలను పడేసినట్లే.

మీరు మీ కీని సరైన చోట ఉంచకపోతే, మీ క్రిప్టోకరెన్సీలన్నీ శాశ్వతంగా పోతాయి. గుర్తుంచుకోండి!

5. మోసగాళ్ళ చేతిలో మోసపోవడం

ప్రారంభంలోనే ఆకర్షణీయంగా కనిపించే క్రిప్టో డీల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు తెలుసుకోవలసిన నాలుగు సాధారణ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లను మేము వివరించాము:

  • క్లౌడ్ మల్టిప్లయర్‌లతో స్కామ్‌లు

మోసగాళ్లు అప్పుడప్పుడు బాధితులను ఇమెయిల్ లేదా టెక్స్ట్ ద్వారా “పెట్టుబడి అవకాశం” ఉందని సంప్రదిస్తారు. తమ డబ్బును నిర్దిష్ట డిజిటల్ వాలెట్‌లో డిపాజిట్ చేసే పెట్టుబడిదారులకు బిట్‌కాయిన్‌లో చేసిన పెట్టుబడికి రెట్టింపు లేదా మూడు రెట్లు తిరిగి ఇస్తామని వారు చెబుతారు.

గుర్తుంచుకోండి: ఉచిత డబ్బు ఆఫర్ల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

  • పంప్ & డంప్

నేరగాళ్ళు అనూహ్యంగా చిన్న లేదా తెలియని కాయిన్ల ధరలను త్వరితంగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, కొన్ని సందర్భాల్లో వాటి విలువ పెరుగుతుంది.

నేరగాళ్ళు ఏ క్షణంలోనైనా పెద్ద మొత్తంలో క్రిప్టోకరెన్సీని కలిగి ఉండవచ్చు (అందరికి అందుబాటులోకి రాకముందే దానిలో ఎక్కువ భాగాన్ని ముందుగా మైనింగ్ చేయడం ద్వారా).

వ్యాపారులు లాభాలను తగ్గించుకోవడానికి సందేహించకుండా ప్రయత్నించినప్పుడు, నేరగాళ్ళు తమ నాణేలన్నింటినీ విక్రయించే ముందు ధర పెరిగే వరకు వేచి ఉంటారు, దీనివల్ల ధర తగ్గుతుంది.

వారు ఎక్కువ ధరకు విక్రయించే ముందు సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయడం ద్వారా ధరను పెంచవచ్చు.

  • ప్రమాదభరితమైన వాలెట్ సాఫ్ట్‌వేర్

ప్రసిద్ధ క్రిప్టో వాలెట్‌లనే విశ్వసించండి.

గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్‌లో కనిపించే అనిశ్చిత లేదా తెలియని వాలెట్‌లు మీ క్రిప్టో ఆస్తులను దొంగిలించడానికి డాడ్జీ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించవచ్చు.

  • నకిలీ కాయిన్లు

మార్కెట్‌లోని చాలా క్రిప్టోకరెన్సీలతో ఏది నిజమైనది ఇంకా ఏది నకిలీ అని వేరు చేయడం అసాధ్యం.

మీరు బోగస్ నాణేలను కొనుగోలు చేస్తే నేరస్థులు మీ గుర్తింపును పొందవచ్చు ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కొల్లగొట్టవచ్చు.

ఎవరి మాటలను పట్టించుకోవద్దు; కాయిన్లను కొనే ముందు వీలైనన్ని ఎక్కువ వనరులను ఉపయోగించి వాటిపై మీ రీసెర్చ్ చేయండి.

అతి ముఖ్యమైన అంశం

క్రిప్టోకరెన్సీ అనేది ఆర్థిక స్వాతంత్రతను సాధించడానికి ఒక సాధనం ఇంకా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కమ్యూనిటీ రోజురోజుకు పురోగమిస్తోంది. 2021లో, ప్రపంచమంతా క్రిప్టోకరెన్సీలో $30 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. మరోవైపు, క్రిప్టో అనేది స్థిరమైన అస్థిరతతో అధిక-రిస్క్, అధిక-రివార్డ్ ఉన్న గేమ్.

మీ పెట్టుబడిని విస్తరించడానికి బేసిక్స్‌పై మీకు అవగాహన కల్పించడం మరియు అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లను మీరు అనుసరించడం చాలా ముఖ్యం. క్రిప్టో దాని పెట్టుబడిదారులకు వారి డబ్బుపై స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని కోరుకుంటుంది, అయితే వారు హైప్‌ల ఆధారంగా పెట్టుబడి పెట్టకుండా ఉండాలి.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply