Skip to main content

క్రిప్టోకరెన్సీ పుట్టుకపై అవగాహన (A dive into the birth of a Cryptocurrency)

By నవంబర్ 23, 2021జనవరి 21st, 20223 minute read

గమనిక: ఈ బ్లాగ్ బాహ్య బ్లాగర్ ద్వారా వ్రాయబడింది. ఈ పోస్ట్‌లో వ్యక్తపరచిన ఆలోచనలు ఇంకా అభిప్రాయాలు రచయితకు మాత్రమే చెందినవి.

ఈ రోజుల్లో, అనేక మంది వ్యక్తులు క్రిప్టోకరెన్సీపై ఆసక్తి చూపుతున్నారు. జనాదరణ పొందిన టోకెన్‌లకు సాంకేతికతతో కూడిన ఉత్సుకత లేదా వాటి నుండి ప్రయోజనం పొందాలనే కోరిక వల్ల క్రిప్టోకరెన్సీలపై ప్రజల ఆసక్తి అత్యంత అధికంగా ఉంది.

మనలో చాలా మంది క్రిప్టోకరెన్సీలను లాభాపేక్షతో కొని అమ్ముతున్నప్పటికీ, సంప్రదాయ స్టాక్‌లలాగానే ఉన్నా, అవి కాస్త భిన్నంగా ఉంటాయి. మీరు స్టాక్‌లను కొన్నప్పుడు, మీరు కంపెనీ యాజమాన్యంలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు, అయితే క్రిప్టోకరెన్సీతో, మీరు మార్పిడి మాధ్యమాన్ని కలిగి ఉంటారు ఇంకా మీరు ICOలో పాల్గొంటే తప్ప ‘కంపెనీ’లో భాగాస్వామ్యాన్ని కొనలేరు. అంతేకాక, బ్లాక్‌చెయిన్ యొక్క వికేంద్రీకృత స్వభావం, దాని అంతర్లీన సాంకేతికత కారణంగా క్రిప్టోలు స్టాక్‌ల వలె నియంత్రించబడవు. అదే సమయంలో, ఇది దాని చుట్టూ అల్లుకున్న ఆసక్తిని రేకెత్తించేందుకు దోహదపడింది.

అయినప్పటికీ, బిట్‌కాయిన్ ఇంకా ఈథర్ వంటి ప్రసిద్ధ టోకెన్‌ల అంతర్గత పనితీరు గురించిన ఉత్సుకత ఈ ఆసక్తితో జతపడి ఉంటుంది. మనలో చాలా మందికి, ప్రధానంగా క్రిప్టోకరెన్సీల మూలాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ రంగంలో మాత్రమే ఉంది మరియు సెంట్రల్ బ్యాంక్ జారీ చేయనందున, బిట్‌కాయిన్ ఎక్కడ నుండి ఉద్భవించిందో ఇంకా అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం సాంకేతికత తెలియని వారికి కాస్త కష్టంగా ఉండవచ్చు.

బిట్‌కాయిన్ క్లిష్టతరంగా ఉన్నప్పటికీ, దాని అంతర్గత పనితీరు అందరూ అనుకున్నంత కలవరపడేలా లేదు.

క్రిప్టోకరెన్సీలు ఎలా సృష్టిస్తారు?

మీరు ఏదైనా క్రిప్టో లేదా బ్లాక్‌చెయిన్-సంబంధిత రచనలు చదివి ఉన్నట్లైతే, మీరు ఖచ్చితంగా “మైనింగ్” అనే పదాన్ని చూసి ఉండవచ్చు. మైనింగ్ అనేది క్రిప్టో పరిశ్రమలో తరచుగా ఉపయోగించే పదం ఎందుకంటే ఇది క్రిప్టోకరెన్సీలను పంపిణీ చేసే పద్ధతి.

గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, అన్ని క్రిప్టోకరెన్సీలు బ్లాక్‌చెయిన్‌లపై నిర్మించబడ్డాయి ఇంకా అన్ని క్రిప్టోకరెన్సీ లావాదేవీలు బ్లాక్‌చెయిన్‌ గుండా జరుగుతాయి. బ్లాక్‌చెయిన్‌లో లావాదేవీని పూర్తి చేసే ముందు, దానిని తప్పనిసరిగా అభ్యర్థించాలి లేదా ప్రారంభించాలి. ధృవీకరణ అనేది నిర్ధారించే ప్రక్రియ, అంటే బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్ (బిట్‌కాయిన్ నెట్‌వర్క్ వంటివి) ప్రభావవంతంగా పనిచేయడానికి ఇది క్రమం తప్పకుండా నిర్వహించబడుతూనే ఉండాలి.

ఈ ధ్రువీకరణలు కంప్యూటర్‌ల నెట్‌వర్క్ ద్వారా నిర్వహించబడతాయి ఇంకా

 లావాదేవీలను ధృవీకరించడానికి తమ కంప్యూటర్‌లను బహూకరించే వారికి నెట్‌వర్క్ స్థానిక టోకెన్‌లను రివార్డుగా ఇస్తుంది. మైనింగ్ అనేది ఈ రకమైన కార్యాచరణకు ఉపయోగించే పదం.

అయినప్పటికీ, మైనింగ్ యొక్క పద్ధతి మారుతూ ఉంటుంది ఇంకా అలా చేయడానికి రెండు బ్లాక్‌చెయిన్ సిస్టమ్‌లను ఉపయోగించవచ్చు: ప్రూఫ్-ఆఫ్-వర్క్ మరియు ప్రూఫ్-ఆఫ్-స్టేక్. ధృవీకరణ ఎలా సాధించబడుతుందనేది రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం. ప్రూఫ్-ఆఫ్-వర్క్ సిస్టమ్‌లోని వాలిడేటర్లు సంక్లిష్టమైన గణిత పజిల్‌ను పరిష్కరించడానికి వారి కంప్యూటర్‌లను తప్పనిసరిగా ఉపయోగించాల్సివుంది.

లావాదేవీల సముదాయము (బ్లాక్) ధృవీకరించబడిన తర్వాత మైనింగ్ ప్రక్రియలో పాల్గొన్న వారికి ముందుగా నిర్వచించబడిన పరిమాణంలో టోకెన్‌లు రివార్డ్ చేయబడతాయి ఇంకా ఈ విధంగా మార్కెట్‌లోకి మరిన్ని నాణేలు/టోకెన్‌లు ప్రవేశపెట్టబడతాయి. బిట్‌కాయిన్ నెట్‌వర్క్ అధిక శక్తిని ఉపయోగించే ప్రూఫ్-ఆఫ్-వర్క్ సిస్టమ్‌కు ఉదాహరణ.

ప్రూఫ్-ఆఫ్-స్టేక్ నెట్‌వర్క్‌లోని వాలిడేటర్లు సంక్లిష్టమైన గణిత పజిల్‌ను పరిష్కరించాలని నిర్ణయించుకునే వ్యక్తులు మాత్రమే కాదు. దీనికి భిన్నంగా వాలిడేటర్‌లు ఇప్పటికే వారు ఎంతమొత్తంలో టోకెన్‌లను కలిగి ఉన్నారు, అంటే నెట్‌వర్క్‌లో వారు ఎంత పెద్ద వాటాను కలిగి ఉన్నారనే దాని ఆధారంగా ఎంపిక చేయబడతారు. అలాగే, ప్రూఫ్-ఆఫ్-వర్క్ మెథడ్ కాకుండా, ప్రూఫ్-ఆఫ్-స్టేక్ సిస్టమ్ చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుంది; ఉదాహరణలలో పోల్కా డాట్, EOSIO మరియు కర్డానో ఉన్నాయి, ఎథేరియమ్ త్వరలో ఈ సిస్టమ్‌కి మారాలని యోచిస్తోంది, దానివల్ల ప్రస్తుత శక్తి వినియోగంలో 95% వరకు తగ్గుతుంది.

క్రిప్టో ధర ఎలా నిర్ణయించబడుతుంది?

ఈ రోజుల్లో వేలాది క్రిప్టోకరెన్సీలు చెలామణిలో ఉన్నాయి, అయితే కొన్ని పదివేల డాలర్లంత విలువైనవైతే మరికొన్ని డాలర్‌తో పోల్చితే కొన్ని పెన్నీలంత విలువచేస్తాయి. దీనికి కారణం ఏమిటి? మరి కొన్ని క్రిప్టోకరెన్సీలు వేరేవాటికన్నా ఎందుకు విలువైనవి? 

మైనర్లు తాము మైనింగ్ ద్వారా సృష్టించబడిన బిట్‌కాయిన్‌లన్నింటినీ (లేదా ఇంకేదైనా కాయిన్ ఐనా సరే ) తమదగ్గర ఉంచుకోరు. చాలా మంది ఇందుకు భిన్నంగా ప్లాట్‌ఫారమ్‌లు ఇంకా ఇతర సైట్‌లను కొనుగోలు చేసేందుకు వాటిని అమ్మేస్తారు, ఈ విధంగా అవి మార్కెట్‌లో విస్తరించాయి. సాధారణ ప్రజలకు టోకెన్ విక్రయించబడే ధర వివిధ ప్రమాణాల ద్వారా నిర్ణయించబడుతుంది..

అలాంటప్పుడు మైనింగ్ ఖర్చుల సమస్య ఉంటుంది. ప్రూఫ్-ఆఫ్-వర్క్ టోకెన్‌లను మైనింగ్ పరికరాలు ఇంకా విద్యుత్ ఖర్చును కవర్ చేయడానికి సరిపోయే మొత్తానికి తప్పనిసరిగా విక్రయించాలి. అయినప్పటికీ, క్రిప్టోకరెన్సీ ధరను నిర్ణయించడంలో డిమాండ్ మరియు సరఫరా అత్యంత ముఖ్యమైన అంశాలు. 

అయితే చివరికి, కొంతమందికి, క్రిప్టోకరెన్సీయే డబ్బు, ఇంకా ఆ డబ్బు యొక్క విలువ అలా ఉద్భవించింది. ఉదాహరణకు, డోజ్‌కాయిన్‌ను తీసుకోండి, ఇది దాని మనుగడలో చాలా వరకు తక్కువ అంచనా వేయబడని క్రిప్టోకరెన్సీగా ఉంది. అయితే, ఎలోన్ మస్క్ టోకెన్ గురించి ట్వీట్ చేయడం ప్రారంభించిన తర్వాత, దాని విలువ అమాంతంగా పెరిగింది.

అత్యంత విస్తృతంగా చలామణిలో ఉన్న క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర వివిధ కారణాల వల్ల హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నిరోధిత సరఫరా కారణంగా, ధర సగానికి తగ్గిన ప్రతిసారీ పెరుగుతుంది (ప్రతి బ్లాక్‌కు డెలివరీ చేయబడిన టోకెన్ల సంఖ్య తగ్గుతుంది). బిట్‌కాయిన్‌కు డిమాండ్‌ను పెంచే కొత్త అభివృద్ధి జరిగిన ప్రతిసారీ, డిమాండ్ మరియు సరఫరా యొక్క దీర్ఘ-స్థాపిత నియమాలకు అనుగుణంగా ధర పెరుగుతుంది.

సారాంశం

మనలో చాలా మందికి క్రిప్టోకరెన్సీ దాని అంతర్గత పనితీరు గురించి తెలియకపోయినా, వాటి ప్రాథమిక సూత్రాలు సులభంగా వివరించగలిగితే, ఈ వినూత్న కాన్సెప్ట్‌పై మనకొక మంచి అవగాహన కలుగుతుంది.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply