Skip to main content

డే ట్రేడింగ్ కోసం ఇండియాలోని 5 ఉత్తమ క్రిప్టోకరెన్సీలు (2022) (5 Best Cryptocurrencies For Day Trading In India 2022)

By ఏప్రిల్ 21, 2022మే 30th, 20225 minute read
Best cryptocurrencies for day trading in India (2021)-WazirX

గమనిక: ఈ బ్లాగ్ బాహ్య బ్లాగర్ ద్వారా వ్రాయబడింది. ఈ పోస్ట్‌లో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు ఇంకా ఆలోచనలు రచయితకు మాత్రమే చెందినవి.

గత కొన్నేళ్లుగా, క్రిప్టోకరెన్సీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచూర్యం సంపాదించింది. ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఫీడ్ నుండి మీ హైస్కూల్ బెస్ట్ ఫ్రెండ్ ఫేస్‌బుక్ వాల్ వరకు, క్రిప్టో ప్రతిచోటా కనిపిస్తుంది. ఎందుకు కనపడకూడదు?  ఎల్ సాల్వడార్‌లో బిట్‌కాయిన్‌ను చట్టపరమైన టెండర్‌గా చేర్చడం వల్లr ఫియట్ కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా క్రిప్టోకరెన్సీలను అంచనా వేసింది.

క్రిప్టోకరెన్సీలు జనాదరణ పెరగడానికి మరొక కారణం వాటి అత్యంత అస్థిర స్వభావమే. అస్థిరత క్రిప్టోస్‌ను ఉత్తేజకరమైన స్వల్పకాలిక పెట్టుబడి ప్రత్యామ్నాయంగా మారుస్తుంది. వాస్తవానికి, భారతదేశంలో విస్తరిస్తున్న క్రిప్టో మార్కెట్‌లో, చాలా మంది వ్యాపారులు డే-ట్రేడింగ్ కోసం క్రిప్టోకరెన్సీల బాట పడుతున్నారు. కాబట్టి సూటిగా మాట్లాడుకుందాం, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రిప్టోకరెన్సీలుగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న క్రిప్టోకరెన్సీలను చూద్దాం. అయితే అంతకు ముందు, మీ క్రిప్టో మరియు ట్రేడింగ్ చతురతను పదును పెట్టడానికి కీలకమైన పరిభాషను తెలుసుకొందాము.

డే ట్రేడింగ్ అంటే ఏమిటి? 

డే ట్రేడింగ్ అనేది ఒక వ్యాపార విధానం, ఇక్కడ ఒక వ్యాపారి ఆర్థిక ఉపకరణాన్ని కొన్న రోజునే విక్రయిస్తాడు. స్టాక్ మార్కెట్‌లో కూడా ఇలాంటి వ్యూహం కొనసాగుతోంది. ఇంట్రాడే స్ట్రాటజీస్ అని పిలువబడే డే ట్రేడింగ్‌లో లాభాలను సంపాదించడానికి అనేక పద్ధతులు ఉపయోగించబడతాయి. అవి అస్థిర మార్కెట్ నుండి లాభం పొందడంలో సహాయపడతాయి. డే ట్రేడింగ్‌లో పాల్గొనే ట్రేడర్లను స్పెక్యులేటర్లు అంటారు. 

ఇది చాలా లాభదాయకమైన వృత్తిగా పరిగణించబడుతున్నప్పటికీ, డే ట్రేడింగ్ ఆరంభంలోకష్టతరంగా ఉంటుంది. దాని ప్రమాద సంభావ్యత కారణంగా ఇది తరచుగా జూదానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది. అయితే, అంతగా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. మీరు కలిగి ఉండవలసిందల్లా ఆస్తులపై మంచి జ్ఞానం, కొంత నిష్పాక్షికత, స్వీయ-క్రమశిక్షణ మరియు ఉత్తమమైన డీల్‌లను కాలానుగుణంగా చేయడానికి కొద్దిపాటి అదృష్టం. ఇది మీకు ప్రయోజనం చేకూర్చేందుకు అస్థిరతను ప్రభావితం చేస్తుంది

డే ట్రేడింగ్ కోసం క్రిప్టోకరెన్సీలను ఎలా ఎంచుకోవాలి? 

క్రిప్టోకరెన్సీలలో ధరల చలనాన్ని మూడు అంశాలు నిర్ణయిస్తాయి. అవి – అస్థిరత, వాల్యూమ్ ఇంకా నాణెం యొక్క ప్రస్తుత కార్యాచరణ. డే ట్రేడింగ్ కోసం మంచి క్రిప్టోస్‌ని నిర్ణయించడానికి ఇంకా డే ట్రేడింగ్ కోసం క్రిప్టోస్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడానికి, మీరు ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకోవాలి. 

1. ఆస్తిరత్వం

ఇది  క్రిప్టోకరెన్సీ ధరలో రోజువారీ హెచ్చుతగ్గులను సూచిస్తుంది. గుర్తుంచుకోవలసిన ఒక విషయమేమిటంటే క్రిప్టో అనేది సర్వసాధారణంగా చాలా అస్థిరమైన మార్కెట్. అందువల్ల, మీరు 10% నుండి 50% వరకు ఎక్కడైనా ఒక రేటును ఆశించవచ్చు-అధిక అస్థిరత, ఎక్కువ లాభం. అందువల్ల, దీని అర్థం ఏంటంటే పెట్టుబడిలో ఎక్కువ రిస్క్ ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. 

 క్రిప్టోకరెన్సీ మార్కెట్ ‌లోకి ప్రవేశించాలనుకునే ట్రేడర్ ధరల అస్థిరతతో కూడిన అసెట్లపై తన డబ్బును పందెం కాయాలనుకుంటాడు. ఇలా చేయడం వల్ల అసెట్ల విలువ పెరిగినప్పుడు, మీరు మంచి లాభాన్ని ఆర్జించవచ్చు.

2. వాల్యూమ్

క్రిప్టోకరెన్సీ వాల్యూమ్‌ని దాని చుట్టూ జరిగే కార్యకలాపాలు ప్రభావితం చేస్తాయి. తగినంత మంది ఆ  క్రిప్టోకరెన్సీని కొంటున్నారా లేదా అమ్ముతున్నారా అనేది వాల్యూమ్ నిర్ణయిస్తుంది. అధిక ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువ మంది వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారని సూచిస్తుంది మరియు ఇందుకు విరుద్ధంగా. అధిక వాల్యూమ్ కూడా సాంకేతిక సూచికలను మరింత నమ్మదగినదిగా చేస్తుంది మరియు ధరలలో ఊహించని స్పైక్‌లు లేదా డిప్‌ల అవకాశాలను తగ్గిస్తుంది.

3. తాజా వార్తలు

క్రిప్టో దాని చుట్టూ జరిగే చర్చల వల్ల ఎంతో ప్రభావితమవుతుంది. ఇంకా కొన్నిసార్లు, దానితో సంబంధం లేని చర్చల ద్వారా కూడా ప్రబావితమౌతుంది. ఉదాహరణకు, షిబు పప్‌ని సొంతం చేసుకోవాలనే కోరిక గురించి ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినప్పుడు SHIB కాయిన్ల ధర పెంపుదలనే తీసుకోండి. క్రిప్టో పెట్టుబడులతో విజయవంతం కావాలంటే, మీరు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. క్రిప్టో వ్యవస్థాపకుల గురించి చదవడం, సోషల్ మీడియాలో వారు చేసే సంభాషణలను ట్రాక్ చేయడం ఇంకా క్రిప్టోకరెన్సీ గురించి ఏవైనా కొత్త చర్చలను వెదకడం కొంచెం ప్రయోజనకరంగా ఉండవచ్చు. భారతదేశంలో దూసుకుపోయే తదుపరి క్రిప్టోకరెన్సీని గుర్తించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. 

డే ట్రేడింగ్ కోసం ఇండియాలోని ఉత్తమ క్రిప్టోకరెన్సీలు

ఇది చర్చలోని ముఖ్యమైన భాగానికి మనల్ని తెచ్చింది. సంభావ్య క్రిప్టో ఆస్తులను పరిశీలిద్దాం.

#1 ఎథీరియమ్ 

ఎథీరియమ్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్ట్‌కాయిన్.  ఎథీరియమ్ డిమాండ్ ఎప్పుడూ తగ్గిపోదు, ఇది 2021 లో దాని అద్భుతమైన ధర పెరుగుదల ఇది ప్రతిబింబిస్తుంది. క్రిప్టోస్పియర్ స్మార్ట్ కాంట్రాక్ట్‌లు మరియు dApps మార్కెట్‌కి ఇది రూలర్ , ఇది మునుపటి సంవత్సరంలో  ధరలో ఆశ్చర్యకరంగా 425%  పెరిగింది. 

ఇది మాత్రమే కాదు, ఎథీరియమ్ ఉత్తమ అస్థిరతను అందిస్తుంది మరియు గణనీయమైన లాభాలను త్వరగా పొందేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఆసక్తికరంగా, ఎథీరియమ్ ఈ సంవత్సరం ETH-2 ప్రోటోకాల్‌ను స్వీకరించడానికి బ్లాక్‌చెయిన్ సెట్ చేయడంతో 2022 లోఅనూహ్యమైన మార్పు అంచున ఉంది. ఈ స్వీకరణకు వచ్చిన ప్రతిస్పందనకు సంబంధించి పరిశ్రమలో ఏదో తెలియనితనం కారణంగా ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఎథీరియమ్ యొక్క అస్థిరతకు ఆజ్యం పోస్తోంది. డే ట్రేడింగ్ కోసం క్రిప్టోకరెన్సీల కోసం వెతుకుతున్నప్పుడు ఎథీరియమ్ ని లెక్కచేయకపోవడానికి మరిన్ని కారణాలు!

#2 మాటిక్

మాటిక్ ఈ సంవత్సరం అత్యంత ఆశాజనకమైన క్రిప్టోకరెన్సీలలో ఒకటి. దీని  ధర 1 జనవరి 2021 న  $0.01 నుండి 2021 చివరలో $2.9 గరిష్ట స్థాయికి పెరిగింది! ఇప్పుడు, మాటిక్ రోజు ట్రేడింగ్ కోసం ఎందుకు లాభదాయకమైన ఎంపిక అవుతుంది? అనేక అంచనా సర్వీసులు మాటిక్  లో 2022 మరియు అంతకు మించి బుల్లిష్ వీక్షణను అంచనా వేసింది. జనవరి 2022 చివరిలో, ఈ కాయిన్ నెమ్మదిగా పతనమయ్యింది.

ఇంకా ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రిప్టోకరెన్సీగా మారింది! ఎథీరియమ్ యొక్క రాబోయే అప్‌గ్రేడ్ నేపథ్యంలో మాటిక్ యొక్క బ్లాక్‌చెయిన్ అయిన పాలిగాన్ చుట్టూ సంచలనం పెరుగుతోంది. బేరిష్ రన్ పరిణామానికి దూరంగా ఉన్నప్పుడు ఈ కాయిన్ తదనంతరం పెరుగుతుంది. మీ డే ట్రేడింగ్ స్థితిని మెరుగుపరచడానికి  మాటిక్ ని కొనుగోలు చేయడానికి  WazirX ని సందర్శించండి.

#3 సొలానా (SOL)

సొలానా 2021 లో ప్రధాన స్రవంతి క్రిప్టోకరెన్సీగా మారింది. క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా 5వ అతిపెద్ద క్రిప్టో ఆస్తికి పెరిగింది, సోలానా సంవత్సరంలో తన ధరలో 11,000% వృద్ధి చెందింది! ఈ క్రిప్టో దాని వేగవంతమైన లావాదేవీలు మరియు తక్కువ ధర కారణంగా తరచుగా ‘ఎథీరియమ్-కిల్లర్’గా పిలువబడుతుంది.

ఈ అత్యంత డైనమిక్ చరిత్ర అందుబాటులో ఉన్న ఇది డే ట్రేడింగ్ కోసం ఉత్తమ క్రిప్టోకరెన్సీలలో విలువైన భాగంగా చేస్తుంది. ఇంకా ఎందుకో ఇక్కడుంది. బ్లాక్‌చెయిన్‌లో కొత్త ప్రాజెక్ట్‌లు చేరడంతో సొలానా పర్యావరణ వ్యవస్థ ప్రతిరోజూ పెరుగుతోంది. NFT లావాదేవీల కోసం చెల్లించడానికి ఎక్కువగా కోరుకున్న క్రిప్టోకరెన్సీలలో సొలానా ఒకటి. ఇవన్నీ సోలానా యొక్క అస్థిరతను మరింత పెంచుతున్నాయి, ఇది భారతదేశంలో డే ట్రేడింగ్ కోసం అద్భుతమైన క్రిప్టోకరెన్సీగా మారుతుంది.

#4 రిపల్ (XRP)

ప్రస్తుత ధర ₹61.89, రిపుల్ దాని ఇతర ప్రత్యర్థులతో పోల్చినప్పుడు చౌకైన పెట్టుబడి. 2021లో నాణెం ధర తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈ క్రిప్టో ఆస్తికి ఒకప్పుడు మరీ తీసిపారేయాల్సినది కాదు. రిపల్ కోసం మార్కెట్ బేరిష్‌గా కనిపిస్తోంది, కానీ ఇది దానికి క్షణికమైన వెనకడుగు కావచ్చు

రాబోయే నెలల్లో రిపల్ తగ్గుదల కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిపల్ ఇంకా దాని వ్యవస్థాపకులకు వ్యతిరేకంగా SEC దావా కారణంగా ఇది జరిగింది. న్యాయంగా అయితే, మార్కెట్‌లో, పెట్టుబడిదారుడి సెంటిమెంటే అసెట్ ధరను నిర్ణయిస్తుంది. క్రిప్టోకరెన్సీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా ఇది ఇంకా రిపుల్ మద్దతులో లేదు.

అయితే,  2022 మధ్య నాటికి పరిస్థితులు మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు. SECకి వ్యతిరేకంగా వారి వైఖరితో రిపల్ బృందం ఆసక్తితో గమనిస్తోంది ఇంకా ఇది ఇప్పటికే మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ప్రముఖ బ్యాంకులతో కొత్త ఒప్పందాలు రిపల్ ధరకు ప్రధాన సారధులు అని మర్చిపోవద్దు. ఉదాహరణకు, ఆగస్టు 2021 లో, భారతదేశపు అతిపెద్ద బ్యాంక HDFC బ్యాంక్ లిమిటెడ్ RippleNetలో చేరింది. ఇంకా బ్యాంకింగ్ రంగం అసెట్ల వెనుక పరుగులు తీస్తోంది. భారతదేశంలో దూసుకుపోయే తదుపరి సంభావ్య క్రిప్టోకరెన్సీలలో రిపల్ ఒకటి కావచ్చు.

#5 బైనన్స్ కాయిన్ (BNB) 

బైనన్స్ కాయిన్ మార్కెట్లో మూడవ-అతిపెద్ద కాయిన్‌గా అవతరించింది ఇంకా అందుబాటులో ఉన్న అతిపెద్ద క్రిప్టో ఎక్సేఛేంజ్ – బైనన్స్ ద్వారా మద్దతు ఇస్తుంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్‌లో బైనన్స్ ఆధిపత్య ఉనికితో, బైనన్స్ కాయిన్ డే ట్రేడింగ్ కోసం సురక్షితమైన పెట్టుబడి. ఇంకా ఎందుకో ఇక్కడుంది.

గేమింగ్ ఇంకా ఫార్మింగ్ పరంగా పెరుగుతున్న NFT పరిశ్రమలో బైనాన్స్ వెస్టింగ్ చేస్తోంది . పాన్-క్రిప్టో పరిశ్రమలోని ఏదైనా ఉత్పత్తి పరంగా ట్రేడింగ్‌లో మీరు పాల్గొనగలిగే ప్లాట్‌ఫారమ్‌లను ఎక్సేఛేంజ్ అందిస్తుంది. BNBకి డిమాండ్ పెరుగుతుందనడానికి ఇది సూచిక.

ఈ క్రిప్టోకరెన్సీతో విజయవంతమైన పెట్టుబడి పెట్టడానికి, మీరు దాని అనుబంధిత క్రిప్టో ఎక్సేఛేంజ్ వార్తలకు సంబంధించిన వార్తలను మననం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్సేఛేంజ్ ద్వారా ఏదైనా చర్యలు కాయిన్ ధరను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఆసక్తికరంగా, ఈ కాయిన్ ఎథీరియమ్ కంటే ఎక్కువ అస్థిరతను చూపుతుంది.

భారతదేశంలో డే ట్రేడింగ్ కోసం ఉత్తమ క్రిప్టోకరెన్సీలలో ఎలా పెట్టుబడి పెట్టాలి? 

ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మీకు తెలుసు, ఎలా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం కావాలి. 

భారతదేశం ఇప్పటికీ క్రిప్టోకరెన్సీ  ట్రేడింగ్కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ ఉనికిని కలిగి లేదు. ఇక్కడే క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు మీ రక్షణకు ముందుకు వస్తాయి. మీరు ప్రారంభించడానికి అనేక ఎక్సేఛేంజ్‌లు వినియోగదారు-అనుకూల ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నాయి. వీటిలో ఒకటి WazirX. మీరు చేయాల్సిందల్లా ఖాతాను సృష్టించడం, మీ KYCని పూర్తి చేయడం, నిధులను డిపాజిట్ చేయడం, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఇంకా క్రిప్టోను ఎంచుకోవడం. అంతే! మీరు ప్లాట్‌ఫారమ్‌లో ఇచ్చిన అన్ని విధి విధానాలను జాగ్రత్తగా చదివితే మంచిది. మీరు అవసరమయ్యే అన్ని డాక్యుమెంటేషన్‌లను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.  

ఆపై, మీరు చేయాల్సిందల్లా మీ పెట్టుబడులు పెట్టడమే. మునుపెన్నడూ ఇది ఇంత సులభంగా లేనేలేదు!

సారాంశం 

భారతదేశంలో డే ట్రేడింగ్ కోసం అత్యుత్తమ క్రిప్టోకరెన్సీల పరిజ్ఞానంతో, మీరు మీ బడ్జెట్ మరియు రిస్క్ ఆధారంగా మీరు వ్యాపారం చేయాలనుకుంటున్న వాటిని ఎంచుకోవచ్చు. మీరు డే ట్రేడింగ్ క్రిప్టోలో సంపాదించగలిగే డబ్బుపై ఎటువంటి పరిమితి లేదు. అయితే, మీరు మరింత మెరుగైన లాభాలను పొందేందుకు గణనీయమైన మూలధనాన్ని ఈ స్టాకులలో పెట్టాలి. ఇక్కడే మీరు మీ విషయనిష్టతను ఉపయోగించాలి ఇంకా మీకు నచ్చిన క్రిప్టో విలువైనదేనా కాదా అని నిర్ణయించుకోవాలి. క్రిప్టో పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది ఇంకా ఆశావాహంగా వర్ధిల్లుతోంది. మీరు చేయాల్సిందల్లా ట్రెండ్‌లను అధ్యయనం చేయడం ఇంకా విశ్వాసం ఆధారంగా పెట్టుబడి పెట్టడం.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.
Shashank

Shashank is an ETH maximalist who bought his first crypto in 2013. He's also a digital marketing entrepreneur, a cosmology enthusiast, and DJ.

Leave a Reply