Skip to main content

క్రిప్టో ఎలా నియంత్రించబడాలి (How Crypto should be Regulated)

By మార్చి 24, 2022ఏప్రిల్ 30th, 20223 minute read

గమనిక: ఈ బ్లాగ్ బాహ్య బ్లాగర్ ద్వారా వ్రాయబడింది. ఈ పోస్ట్‌లో వ్యక్తీకరించబడిన ఆలోచనలు ఇంకా అభిప్రాయాలు రచయితకు మాత్రమే చెందినవి.

భారతదేశంలోని క్రిప్టో పెట్టుబడిదారులు త్వరితగతిన ఈ కొత్త పంథాను దూకుడుగా అనుసరిస్తున్నారు, అయితే శాసనసభ ఇప్పటికీ క్యాచ్ అప్ దశలోనే ఉంది. క్రిప్టోపై పన్ను విధించే విధానం దేశంలో క్రిప్టో భవిష్యత్తుకు కఠినమైనది మరియు నిరుత్సాహపరిచేదిగా పరిగణించబడుతుంది. క్రిప్టోను తిరస్కరించడానికి భారతదేశం అంత తొందర అవసరమా? అదే విధంగా ముందుకు వెళ్ళడానికి వేరే మార్గమేమైనా ఉందా? ఈ కథనంలో, సాధారణంగా క్రిప్టోను ఎలా నియంత్రించవచ్చో మేము పరిశీలిస్తాము.

నియంత్రించాల్సిన అవసరం

మొదట దీనిని చట్టసభ సభ్యుల ధృక్కోణం నుండి చూద్దాం. వారు మనీలాండరింగ్ మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రిప్టోను అద్భుతమైన సానుకూల సాధనంగా చూస్తారు. క్రిప్టో మార్కెట్ ‘పంప్ అండ్ డంప్’ స్కీమ్‌లు, ఫేక్ ట్రేడింగ్ వాల్యూమ్‌లు, మోసాలు మొదలైన వాటికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కొంతమంది దురాశాపరులు అనామకమైన తమ గుర్తింపుతో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల నుండి పూర్తిగా దాచిపెట్టి తమ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇంకా, మన ఆర్థిక వ్యవస్థ క్రిప్టోపై ఎక్కువగా ఆధారపడినట్లయితే, అది అనేక ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది.

పైన పేర్కొన్న అన్ని సమస్యలు ఉన్నప్పటికీ, క్రిప్టోను సహేతుకమైన పద్ధతిలో నియంత్రించడం హాని కంటే ఎక్కువ మేలు చేస్తుంది. క్రిప్టో-సంబంధిత సాంకేతికతలు ఫిన్‌టెక్ స్పేస్‌లో మరిన్ని ఆవిష్కరణల అవకాశాన్ని పెంచుతాయి. క్రిప్టోను స్వాగతించే దేశాలలో ఈ ఆవిష్కరణలు జరుగుతాయి. క్రిప్టోకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు చట్టబద్ధమైన మార్గాన్ని అవలంభిచెందుకు ప్రజలను నిరుత్సాహపరుస్తాయి మరియు లావాదేవీలను నిర్వహించడానికి ఇతర మోసగింపు ప్రత్యామ్న్యాయ మార్గాలు మరియు ప్రమాదకర దారుల కోసం వెతకాలి. 

ఎలా నియంత్రించాలి?

విధాన రూపకల్పన ఇంకా నిబంధనలను ఆమోదించే లాంటి విషయంలో నేను వ్యక్తిగతంగా స్థూలంగా అర్హత లేనివాడిని అయినప్పటికీ, నేను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని ఇన్‌పుట్‌లను అందించగలను:

  • వ్యక్తులు క్రిప్టోలో లావాదేవీలు జరపగల మార్గాల సంఖ్యను పరిమితం చేయండి: మీరు క్రిప్టోను యాక్సెస్ చేయడానికి కావలసిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ అయినప్పటికీ, అధికారుల నుండి అనామకంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇది చాలా మంది ప్రజలు తమ అవసరాలను సులభతరం చేయడానికి ఎక్స్‌ఛేంజ్‌లను ఉపయోగించవలసి వస్తుంది. ఆమోదించబడిన క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌ల ద్వారా మాత్రమే క్రిప్టోను ఉపయోగించడం తప్పనిసరి. ఇది అనేకమంది క్రిప్టో కస్టమర్‌లను ఒకే గొడుగు క్రిందకి తీసుకువస్తుంది, ఇక్కడ సులభంగా నియంత్రించవచ్చు.
  • క్రిప్టోలో డీల్ చేయడానికి ప్రత్యేక లైసెన్స్: మనం బ్యాంకింగ్ లైసెన్స్ మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్నట్లే, మనం క్రిప్టోలో డీల్ చేయడానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ లేదా ప్రత్యేక లైసెన్స్ కలిగి ఉండవచ్చు. ఇది క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌ల నియంత్రణను అనుమతిస్తుంది.
  • నియంత్రణ సంస్థ ఏర్పాటు: బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ మార్కెట్‌ను చూసుకోవడానికి భారతదేశం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్ (SEBI)ని కలిగి ఉంది, మనం క్రిప్టో స్పేస్‌లో గవర్నెన్స్‌ను చూసుకోవడానికి మనకు ప్రత్యేక సంస్థ ఉండవచ్చు.
  • క్రిప్టో కస్టమర్‌ల కోసం KYC నిబంధనలను తప్పనిసరి చేయాలి: ఖాతాదారులందరూ తమ గుర్తింపును ధృవీకరించడానికి పత్రాలను సమర్పించాలని ఈ నియంత్రణ సంస్థ సూచించవచ్చు, ఇది బ్యాంకులు అనుసరించే KYC నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. క్రిప్టో లావాదేవీలలో అనామక సమస్య ఇలాంటి సంధార్భాలలో పరిష్కరించబడుతుంది.
  • అధిక విలువ గల ఆస్తుల కొనుగోలు కోసం ఉన్నత గుర్తింపు ధృవీకరణ ప్రమాణాలు తప్పనిసరి: మనీలాండరింగ్ అనేది మూడు ప్రాథమిక దశల్లో జరుగుతుంది: ప్లేస్‌మెంట్, లేయరింగ్ మరియు ఇంటిగ్రేషన్. పైన పేర్కొన్న అన్ని చర్యలు చేపట్టిన్నప్పటికీ, వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సాధనంగా క్రిప్టోను ఉపయోగించే మోసగాళ్ళు ఇప్పటికీ ఉంటారు. వారు చివరికి అధిక-విలువ ఆస్తులను వాస్తవికంగా కొనుగోలు చేయడానికి వారి లాభాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల, ధృవీకరణ మరియు కొనుగోలు ప్రక్రియలో అంతర్భాగంగా మారే బహుళ గుర్తింపు రుజువులను అందించడం తప్పనిసరి అని ఒక సీలింగ్ సూచించబడుతుంది. 
  • అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో సహకారం: పెద్ద ఎత్తున మనీలాండరింగ్ అనేది ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదు. ఇంకా, ఎక్స్‌ఛేంజ్‌లు అంతర్జాతీయ ఉనికిని కూడా కలిగి ఉండవచ్చు. అనుమానాస్పద లావాదేవీల యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి క్రిప్టో లావాదేవీలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని సమాచార-భాగస్వామ్య యంత్రాంగాన్ని సెటప్ చేయడం వివేకం. ఆదాయ లీకేజీల సమస్యను పరిష్కరించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.
  • క్రిప్టో-రిజర్వ్‌ల సమీకరణ: భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా విదేశీ మారకద్రవ్య నిల్వలను పెద్ద మొత్తంలో పోగుచేసుకుంది. ఇది బహుశా ఇదే పద్ధతిలో క్రిప్టో నిల్వలను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. 

ముగింపు

క్రిప్టో స్పేస్‌లో నిబంధనలను తీసుకురావడం ఏ విధంగానూ సులభమైన లేదా సరళమైన పని కాదు. అయితే, భారతదేశంలోని యువతలో క్రిప్టోకు ఆదరణ పెరుగుతుండడంతో, పెట్టుబడి మరియు ఆవిష్కరణలను సులభతరం చేసే నియంత్రణ మరియు సహేతుకమైన పన్నుల విధానాన్ని తీసుకురావడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి కొత్త పన్ను మార్గం రూపంలో కూడా ప్రయోజనం ఉంటుంది. 

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply