Skip to main content

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో-అనుకూల దేశాలు క్రిప్టో నిబంధనలను ఎలా అనువర్తిస్తున్నాయి? (How are crypto-friendly nations around the globe approaching Crypto regulations?)

By ఫిబ్రవరి 20, 2022ఫిబ్రవరి 23rd, 20225 minute read

గమనిక: ఈ బ్లాగ్ బాహ్య బ్లాగర్ ద్వారా వ్రాయబడింది. ఈ పోస్ట్‌లో వ్యక్తీకరించబడిన ఆలోచనలు ఇంకా అభిప్రాయాలు రచయితకు మాత్రమే చెందినవి.

క్రిప్టోకరెన్సీని స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ నుండి పోర్ట్‌ఫోలియోలో డైవర్సిఫైడ్ హోల్డింగ్‌కి మార్చడం వల్ల క్రిప్టోకరెన్సీని ఎలా నియంత్రించాలనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు ఏకీభవించలేదు.

 నేడు ఈ రంగం అద్భుతమైన కారణాల వల్ల ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ఆచరణాత్మకంగా అభివృద్ధి చెందుతోంది. ఇది లావాదేవీలు చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటే కాకుండా గొప్ప సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. అంతకన్నా విశేషమైనది ఏమిటంటే, ఇది మనోహరమైన ఇంకా చైతన్యవంతమైన వ్యక్తిగత సాధికారత యొక్క కొత్త రూపాన్ని ఇస్తుంది. ఇంకా అనేకానేక కారణాల వల్ల డిజిటల్ ఆస్తులు కూడా పుంజుకుంటున్నాయి. ఇది ద్రవ్యోల్బణం నుండి రక్షన్ కల్పిస్తుంది, చౌకైనది ఇంకా చెల్లింపులకు సురక్షితమైన మార్గం కూడా. దీని గురించి మరింత చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది వ్యక్తిగత స్వీయ-పరిపాలన ఇంకా నిర్వహణలో సాగే విధానం.

ఒక దేశం క్రిప్టోకరెన్సీకి ఎంత అనుకూలంగా ఉంటుందో అని నేను ఆలోచించినప్పుడు, ఆ దేశం వాటితో ఎంత అనుకూలంగా ఉందో చూడటానికి అది క్రిప్టోకరెన్సీని ఎంతవరకు నియంత్రిస్తుంది ఇంకా దానిపై పన్నులు విధిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, “క్రిప్టో అనుకూల” దేశాలు అని పిలవబడే కొన్ని దేశాలు క్రిప్టో విధానాలను ఎలా పరిష్కరిస్తున్నాయో పరిశీలిద్దాం.

మాల్టా

ఈ చిన్న మధ్యధరా ద్వీప దేశం ఎల్లప్పుడూ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులను స్వాగతించే వైనం కనబరుస్తుంది. వారి నిష్పక్షపాత వైఖరి కారణంగా, అనేక క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఇంకా బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్‌లు ఈ దేశంలో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి.

క్రిప్టో-ఫోకస్డ్ ఎంటర్‌ప్రైజెస్‌లను కూడా మాల్టా వ్యూహాత్మకంగా అర్థం చేసుకోవడానికి ఇంకెన్నో కారణాలు ఉన్నాయి. మాల్టా యూరోపియన్ యూనియన్ సభ్య దేశం. మాల్టాలో ఉన్న కార్యకలాపాలతో కూడిన క్రిప్టో ప్రాజెక్ట్‌లు మిగిలిన యూరోపియన్ యూనియన్‌లో స్వేచ్ఛగా పనిచేయగలవని ఇది సూచిస్తుంది.

క్రిప్టోను నియంత్రించే విషయంలో దేశం యొక్క సున్నితమైన వైఖరి విమర్శలకు తావివ్వలేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF), 39 సభ్య దేశాలతో కూడిన అంతర్జాతీయ విధాన రూపకల్పన సంఘం, మాల్టాపై దాని ఆందోళన స్వరాన్ని తీవ్రంగా వినిపిస్తోంది. FATF ఒక రహస్య కార్యనిర్వాహక సమావేశం ఏర్పాటు చేసింది, దీనిలో మాల్టా సరిహద్దుల గుండా వెల్లువెత్తిన క్రిప్టోకరెన్సీలో 60 బిలియన్ EUR ($71.2 బిలియన్)పై హెచ్చరికలు చేసింది. నేరపూరిత ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించినట్లు ఎటువంటి నివేదికలు లేవు లేదా దాని సూచనలు కూడా లేవు. వీటికి మార్గనిర్దేశం చేసేందుకు రెగ్యులేటరీ అథారిటీ లేకపోవడంతో ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ చిన్న మధ్యధరా ద్వీపానికి విస్తరింపజేసిన నియంత్రణ రావచ్చు లేదా రాకపోవచ్చు. ఈలోగా, EU యేతర దేశాల నుండి సంపన్న క్రిప్టో పెట్టుబడిదారులు దాని 1.5 మిలియన్ EUR ($1.78 మిలియన్) పౌరసత్వ ఆఫర్ మరియు క్రిప్టో పట్ల ఉదార ​​వైఖరి వల్ల దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ అనేక విషయాలలో పేరుప్రఖ్యాతులను కలిగి ఉంది. అధిక గోప్యత ఇంకా కనిష్ట రిస్క్ స్విస్ బ్యాంకింగ్ నిబంధనలకు పర్యాయపదాలు, ఇవి ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. పర్యవసానంగా, దేశంలో క్రిప్టో పెట్టుబడిదారులకు కూడా సడలింపు చట్టాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు.

ఏదేమైనప్పటికీ, ప్రాంతాలను భాగాలుగా విభజించడం వలన ఇది కొన్నింటి సాధ్యాసాధ్యాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. క్రిప్టోకరెన్సీలను నియంత్రించడానికి చట్టపరమైన ప్రమాణాలు 26 రాష్ట్రాలు మరియు సమాఖ్య భూభాగాలను కలిగి ఉన్న స్విట్జర్లాండ్‌లోని ఒక రాస్త్రం నుండి ఇంకొక రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.క్రిప్టోకరెన్సీపై ఒక స్విస్ రాష్ట్రంలో పన్ను విధించబడవచ్చు కానీ మరొక రాష్ట్రంలో అలా ఉండకపోవచ్చు. పన్నులు ఎప్పుడు విధించబడతాయో నిర్ణయించడానికి ప్రతి రాష్ట్రం దాని స్వంత ప్రమాణాలను కలిగి ఉండవచ్చు. జ్యూరిచ్‌లో తరలించదగిన ప్రైవేట్ సంపదకు పన్ను మినహాయింపు కారణంగా, బిట్‌కాయిన్ ఇంకా ఇతర క్రిప్టోకరెన్సీలు దేశ ఆదాయపు పన్ను నుండి మినహాయించబడవచ్చు. మరోవైపు, మైనింగ్ లాభాలు ప్రామాణిక ఆదాయ పన్నుకు లోబడి ఉంటాయి. బెర్న్‌లో నియమాలు మరింత కఠినంగా ఉంటాయి మరియు మైనింగ్ ఇంకా ట్రేడింగ్ సాధారణ ఉపాధి పారితోషికంగానే పరిగణించబడతాయి. జ్యూరిచ్ యొక్క మూలధన లాభాలు లూసర్న్‌లో పన్ను-మినహాయింపు పొందాయి, ఇది ఈ రాష్ట్రం యొక్క విధానాలకు అనుగుణంగా ఉంటుంది.

యూరోపియన్ యూనియన్

యూరోపియన్ యూనియన్ (EU)లో మెజారిటీలో క్రిప్టోకరెన్సీ చట్టబద్ధమైనప్పటికీ, సభ్య దేశాన్ని బట్టి మార్పిడి నిర్వహణ మారుతూ ఉంటుంది. అంతేకాక, EUలో పన్నులు గణనీయంగా 0% నుండి 50% మధ్య మారుతూ ఉంటాయి. ఇటీవలి సంవత్సరాలలో KYC/CFT ప్రమాణాలు మరియు ప్రామాణిక రిపోర్టింగ్ అవసరాలను బలోపేతం చేసే EU యొక్క ఐదవ ఇంకా ఆరవ మనీ లాండరింగ్ నిరోధక ఆదేశాలు (5AMLD మరియు 6AMLD) అమలు చేయబడ్డాయి. యూరోపియన్ కమీషన్ సెప్టెంబరు 2020లో మార్కెట్స్ ఇన్ క్రిప్టో-అస్సెట్స్ రెగ్యులేషన్ (MiCA)ని ప్రతిపాదించింది- ఇది వినియోగదారు రక్షణను బలోపేతం చేసే ఫ్రేమ్‌వర్క్ అవడమే కాక క్రిప్టో పరిశ్రమ ప్రవర్తనను స్పష్టపరుస్తుంది ఇంకా కొత్త లైసెన్సింగ్ అవసరాలను సమకూర్చుతుంది.

పోర్చుగల్

ఈ రోజుల్లో, మీరు ప్రపంచంలోని అత్యంత క్రిప్టో-అనుకూల దేశాలలో కొన్నింటిని శోదిస్తూన్నట్లయితే, వాటిలో పోర్చుగల్ అగ్రస్థానంలో ఉండటం పరిపాటి. పోర్చుగల్‌లో, క్రిప్టోకరెన్సీకి పన్నులు లేవు ఇంకా చాలా మంది క్రిప్టో ట్రేడర్లు ఇప్పటికే ఈ దేశంలో తమ రెండవ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగల్‌లో, క్రిప్టోకరెన్సీపై చాలా ఆసక్తిగా ఉంది. ఏప్రిల్ 2020లో, డిజిటలైజేషన్‌ను పెంచడానికి పోర్చుగల్ “డిజిటల్ ట్రాన్సిషనల్ యాక్షన్ ప్లాన్”ని ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ వ్యూహం కార్పొరేట్ ఆవిష్కరణ ఇంకా డిజిటల్ పరివర్తనకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. అదనంగా, బ్లాక్‌చెయిన్ మరియు ఇతర ఫీల్డ్ ప్రయోగాలను సులభతరం చేయడానికి “టెక్నలాజికల్ ఫ్రీ జోన్‌ల” ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక కోసం పిలుపునిస్తుంది.

కెనడా

సాధారణంగా, కెనడియన్ రెగ్యులేటర్లు క్రిప్టోకరెన్సీ పట్ల చురుకైన వైఖరినే అవలంబించారు. ఫిబ్రవరి 2021లో, ఇది బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF)ని ఆమోదించిన మొదటి అధికారబద్ధ దేశంగా మారింది. అంతేకాక, కెనడియన్ సెక్యూరిటీస్ అడ్మినిస్ట్రేటర్స్ (CSA) మరియు కెనడా యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (IIROC) క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు డీలర్‌లు తప్పనిసరిగా కెనడాలోని ప్రాంతీయ అధికారులతో నమోదు చేయించుకోవాలని పేర్కొన్నాయి. ఇంకా, కెనడా క్రిప్టోకరెన్సీ పెట్టుబడి సంస్థలను మనీ సర్వీస్ వ్యాపారాలు (MSBలు)గా గుర్తిస్తుంది మరియు వాటిని కెనడియన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిపోర్ట్స్ అనాలిసిస్ సెంటర్ (FINTRAC)లో కూడా నమోదు చేసుకోవాలి. కెనడా ఇతర వస్తువులపై మాదిరిగానే క్రిప్టోకరెన్సీలకు పన్ను విధిస్తుంది.

ఎ స్టోనియా

క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో తనకంటూ ఒక అద్భుతమైన సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడంలో ఎస్టోనియా ధృడవైఖరితో ఉంది. ఇది క్రిప్టోకరెన్సీ స్టార్టప్‌లకు యూరప్‌లో ఉండే హాట్‌బెడ్‌లలో ఇది కూడా ఒకటి, ఇంకా క్రిప్టోకరెన్సీల ప్రజాదరణ, పేరుగాంచిన ఎస్టోనియా డిజిటల్ విజయగాథతో సరిపోల్చింది. ఈ మార్కెట్ విస్తరిస్తోంది మరియు పెట్టుబడిదారులు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో సహా ఎటువంటి పరిష్కారంలోనైనా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్టోనియాలో, బిట్‌కాయిన్ మరియు ఇతర క్రిప్టోకరెన్సీల లావాదేవీలు ఇతర కంపెనీ కార్యకలాపాలకు సమానంగా పన్ను విధించబడతాయి -ఆదాయ పంపిణీ లాభాలపై కార్పొరేట్ ఆదాయ పన్ను లేదు.

ఎస్టోనియా బ్యాంకింగ్ రంగం కూడా క్రిప్టో-కేంద్రీకృతమై ఉంది. ఉదాహరణకు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఆర్థిక సంస్థలలో ఎస్టోనియాలోని LHV బ్యాంక్ ఒకటి. అంతేకాక, ఈ సంస్థ సైబర్ వాలెట్ అప్లికేషన్‌ను పరిచయం చేసింది, ఇది బ్లాక్‌చెయిన్ ఆధారిత వాలెట్, ఇది వినియోగదారులను వాస్తవ యూరోల డిజిటల్ ప్రాతినిధ్యాలను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది.

సింగపూర్

సింగపూర్ ఆగ్నేయాసియాలో ఫిన్‌టెక్ సెంటర్‌గా ప్రసిద్ధి చెందింది. సింగపూర్ యొక్క సెంట్రల్ బ్యాంక్ అయిన మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, మనీలాండరింగ్ ఇంకా ఇతర అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికి క్రిప్టోకరెన్సీ ఎకోసిస్టమ్‌ను ఖచ్చితంగా నియంత్రించాల్సి ఉండగా ఆవిష్కరణలను అరికట్టకూడదని వాదించింది.

సింగపూర్‌లో మూలధన లాభాలపై పన్ను లేదు. వ్యక్తులు మరియు కార్పొరేషన్ల వద్ద ఉన్న క్రిప్టోకరెన్సీ డబ్బుపై పన్ను విధించబడదు. ఏదేమైనప్పటికీ, సింగపూర్‌లో వ్యాపారాన్ని విలీనం చేసి, క్రిప్టో ట్రేడింగ్‌లో నిమగ్నమై ఉంటే లేదా క్రిప్టో చెల్లింపులను అంగీకరించినట్లయితే, కార్పొరేషన్ ఆదాయపు పన్నుకు బాధ్యత వహిస్తుంది.

జర్మనీ

క్రిప్టోకరెన్సీ సంబంధిత పన్నుపై జర్మనీ అసాధారణ వైఖరిని కలిగి ఉంది. బిట్‌కాయిన్‌ను కరెన్సీ, ఆస్తి లేదా స్టాక్‌గా కాకుండా ప్రైవేట్ డబ్బుగా చూసే ఈ దేశంలో వ్యక్తిగత పెట్టుబడికి ప్రాధాన్యత ఉంది. బిట్‌కాయిన్ ఇంకా ఇతర క్రిప్టోకరెన్సీలను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే జర్మనీలో పన్ను మినహాయింపు ఉంటుంది. అవి అమ్మకం లేదా కొనుగోలుపై VATకి లోబడి ఉండవు.

మీరు ఒక సంవత్సరంలోపు డబ్బును నగదుగా లేదా మరొక క్రిప్టోకరెన్సీగా మార్చినట్లయితే, లాభం €600 కంటే తక్కువగా ఉంటే పన్ను రహితంగా ఉంటుంది.

లక్సెంబర్గ్

లక్సెంబర్గ్ క్రిప్టోకరెన్సీని చెల్లుబాటు చేసుకొనే మార్పిడి మాధ్యమంగా చూస్తుంది. దేశంలో క్రిప్టోకరెన్సీలను డీల్ చేయడం లేదా ఉపయోగించడంపై ఎలాంటి నిషేధాలు లేవు. లక్సెంబర్గ్‌లో స్పష్టమైన క్రిప్టోకరెన్సీ నిబంధనలు లేనప్పటికీ, చట్టం పట్ల ప్రభుత్వ వైఖరి సాధారణంగా ప్రగతిశీలంగా ఉంటుంది.

లక్సెంబర్గ్‌లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు CSSFచే నియంత్రించబడతాయి మరియు ఇతర ఆర్థిక సంస్థల వలె అదే చట్టాలకు లోబడి ఉండాలి.

నేడు, దేశం క్రిప్టోకరెన్సీ పరిణామాలపై అవి చెలామణి అయ్యేలా ఉండటానికి ఇంకా వాటితో వ్యవహరించడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలను రూపొందించడానికి సిద్ధంగా ఉంది.

నెదర్లాండ్స్

క్రిప్టోకరెన్సీలకు సంబంధించి నెదర్లాండ్స్ ఉదారవైఖరినే కలిగి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇది సహాయపడగలదని అక్కడి అధికారగణం భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీల వినియోగాన్ని నిషేధించే బలమైన పరిమితులు నెదర్లాండ్స్‌లో లేనందున, వ్యక్తులు ఆందోళనలకు లోనుకాకుండా వాటిని ఉపయోగించుకుంటారు. వారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అవసరాలకు (FATF.) కట్టుబడి ఉంటారు.

నెదర్లాండ్స్‌లో, క్రిప్టోకరెన్సీని డచ్ నేషనల్ బ్యాంక్ (DNB) నియంత్రిస్తుంది.

భారతదేశం

ఐతే భారతదేశం మాటేమిటి?

వివిధ దేశాలు క్రిప్టోకరెన్సీలను వేర్వేరుగా నియంత్రిస్తాయి, అయితే భారతదేశం ఇప్పటివరకు క్రిప్టోకరెన్సీల పట్ల అత్యంత నిరోధకతను కలిగి ఉందని చెప్పడం సమంజసం. క్రిప్టో చట్టంలో ప్రభుత్వం ఏమి ప్రతిపాదించబోతోంది అనే విషయం గురించి మీడియా కథనాల ప్రకారం, ఈ స్థితి పెద్దగా మారే అవకాశం లేదని తెసుస్తోంది.

RBI వాటిని నిషేధించే ప్రయత్నం చేసినప్పటికీ, భారతదేశం ఇప్పటికీ క్రిప్టోకరెన్సీల పట్ల నిశితమైన వైఖరినే కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా, సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన పరిస్తితి అలాగే ఉంది. మరోవైపు, భారత ప్రభుత్వం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగానికి మద్దతు ఇస్తూనే, అదే సమయంలో క్రిప్టోకరెన్సీలను కఠినంగా నియంత్రించే జంట వ్యూహాన్ని అవలంబిస్తోంది.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply