Skip to main content

భారతదేశంలో కర్డానోను ఎలా కొనాలి (How to Buy Cardano in India)

By డిసెంబర్ 20, 2021డిసెంబర్ 23rd, 20215 minute read

కర్డానో

కర్డానో అనేది మూడవ తరంలో వికేంద్రీకృత ప్రూఫ్-ఆఫ్-స్టేక్ బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్. ఎథేరియమ్ మాదిరిగానే ఉన్నప్పటికీ, కర్డానో దాని నవీకరణల కోసం ప్రాథమిక యూనిట్లుగా పీర్-రివ్యూడ్ శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడుతుంది. OHK, కార్డానో ఫౌండేషన్ మరియు EMURGO- కర్డానో అభివృద్ధికి సమిష్టిగా బాధ్యత వహిస్తాయి. IOHK మరియు కర్డానో ఫౌండేషన్ లాభాపేక్ష లేని సంస్థలు; EMURGO అనేది లాభాపేక్షతో నడిచే సంస్థ. 

IOHK, కర్డానోను నిర్మించెందుకు బాధ్యత వహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న విద్యావేత్తల బృందంతో విశ్లేషణను ప్రదర్శించడానికి మరియు ప్లాట్‌ఫారమ్ అప్‌డేట్‌లను స్కేలబుల్ అని నిర్ధారించడానికి అమలు చేయడానికి ముందు వాటిని మూల్యాంకనం చేస్తుంది. కర్డానో “ada” అనే క్రిప్టోకరెన్సీపై చెలామణి అవుతోంది. ఇది గుర్తింపు నిర్వహణ మరియు స్టాక్ ట్రేస్‌బిలిటీ కోసం ఉత్పత్తులను జారీ చేసింది.

అదనంగా, బ్లాక్‌లను సృష్టించడానికి మరియు దాని బ్లాక్‌చెయిన్‌లో జరిగే లావాదేవీలను ప్రామాణీకరించడానికి— కర్డానో Ouroboroని దాని ప్రూఫ్-ఆఫ్-స్టేక్ అల్గారిథమ్‌గా ఉపయోగిస్తుంది.

కర్డానో చరిత్ర 

కార్డనో యొక్క అభివృద్ధి 2015 లో ఎథేరియమ్ సహ వ్యవస్థాపకుడు చార్లెస్ హోస్కిన్సన్ ద్వారా ప్రారంభమైంది. ఇది 2017 లో ప్రారంభిచబడింది. ADA మరియు ETH ఈ రెండూ స్మార్ట్ కాంట్రాక్టుల వంటి సారూప్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి, అంటే అనుసంధానించబడిన మరియు వికేంద్రీకృత వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. 

ఎథేరియమ్ రెండవ తరంలో ఉన్నప్పటినుండి, కార్డానో అనేది ఎథేరియమ్ మూడవ తరం యొక్క ఆధునికీకరించబడిన వెర్షన్. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను అందించడం దీని లక్ష్యం.

కార్డానో యొక్క ప్రధాన ఉపయోగాలు గుర్తింపు నిర్వహణ మరియు ట్రేసబిలిటీ. గుర్తింపు నిర్వహణ వివిధ వనరుల నుండి డేటా సేకరణకు సంబంధించిన పద్ధతులను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ట్రేస్‌బిలిటీ అనేది ఉత్పత్తి యొక్క ఉత్పాదక మార్గాలను మూలం నుండి పూర్తి చేసిన వస్తువుల వరకు ట్రాక్ చేయడానికి మరియు పరిశీలించడానికి మరియు నకిలీ వస్తువుల మార్కెట్‌ను తొలగించడానికి ఉపయోగించబడుతుంది.

“Ada,” కర్డానో యొక్క డిజిటల్ కరెన్సీ, మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గుర్తించబడిన 19 వ శతాబ్దపు కౌంటెస్ మరియు ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు అయిన అడా లవ్‌లేస్ పేరు మీద పెట్టబడింది.

విధులు, ఫీచర్లు, బృందం

కర్డాన్ వ్యవస్థాపకుడు BitShares మరియు ఎథేరియమ్ వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లతో పనిచేసే గొప్ప డెవలప్‌మెంట్ బృందాన్ని కలిగి ఉన్నారు. 

ఇది బహుళ లేయర్‌లను ఉపయోగించే మొదటి బ్లాక్‌చెయిన్ (అంటే సెటిల్‌మెంట్ మరియు కంప్యూటేషనల్ లేయర్). ADA క్రిప్టోకరెన్సీ చౌకైనా మరియు త్వరిత లావాదేవీలను అందిస్తుంది. కర్డానో యొక్క కన్సెంట్ మెకానిజం పర్యావరణపరంగా మరింత సహాయకారిగా ఇంకా సముచితంగా ఉంటుంది.

కర్డానో కాంక్షితాలు

కర్డానో యొక్క అల్గోరిథం Ouroboros మైన్ బ్లాక్‌లకు ప్రూఫ్-ఆఫ్-స్టేక్ (PoS) ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది. ఈ ప్రోటోకాల్ బ్లాక్ ఉత్పత్తి ప్రక్రియలో శక్తి వ్యయాన్ని తగ్గించెందుకు రూపొందించబడింది. దీనిని చేసేందుకు, ఇది బిట్‌కాయిన్ ఉపయోగించే ప్రూఫ్-ఆఫ్-వర్క్ (PoW) అల్గారిథమ్ పనితీరుకు కేంద్రంగా ఉన్న హాష్ పవర్ లేదా భారీ కంప్యూటింగ్ వనరుల అవసరాన్ని తప్పిస్తుంది. 

కార్డానో యొక్క PoS సిస్టమ్‌లో, బ్లాక్‌లను ఉత్పత్తి చేసే నోడ్ సామర్థ్యాన్ని స్టాకింగ్ నిర్ధారిస్తుంది. నోడ్ యొక్క వాటా దీర్ఘకాలికంగా అది కలిగి ఉన్న ada మొత్తానికి సమానం

లిక్విడ్ డెమోక్రసీ

ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మరియు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మధ్య పరివర్తన చెందుతుంది:

కర్డానో ఫీచర్లు:

  • ప్రజలు నేరుగా తమ విధానాలను నిర్ణయిస్తారు.
  • ప్రజలు తమ ఓటింగ్ బాధ్యతలను ప్రతినిధి లేదా ప్రతినిధులకు బదిలీ చేస్తారు, వారు తమ విధానాలపై ఓటు వేయవచ్చు.
  • ప్రతినిధులు తమ ఓటింగ్ బాధ్యతలను వారి తరపున ఓటు వేయగల మరొక ప్రతినిధికి అప్పగించవచ్చు. ఒక ప్రతినిధి ఈ ఆస్తిపై తమ ప్రతినిధిని నియమించగలిగే దాన్ని ట్రాన్సిటివిటీ అంటారు.
  • తమ ఓటింగ్‌ను బదిలీ చేసిన వ్యక్తికి వారి ప్రతినిధులు ఎంచుకున్న ఓటు నచ్చకపోతే, వారు తమ ఓటును వెనక్కి తీసుకుని, పాలసీపై ఓటు వారు వేయవచ్చు.

కర్డానో ప్రయోజనాలు:

  • తుది విధాన రూపకల్పనలో ప్రతి వ్యక్తి అభిప్రాయం తగిన పాత్ర పోషిస్తుంది.
  • ప్రతినిధి కావడానికి, మీరు ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని గెలుచుకోవాల్సివస్తుంది. మీరు ఖరీదైన ఎన్నికల ప్రచారాలకు మిలియన్ల డాలర్లు ఖర్చు చేయనవసరం లేదు. 
  • ప్రత్యక్ష మరియు ప్రతినిధి ప్రజాస్వామ్యం మధ్య డోలాయమానంగా ఉండే ఈ ఎంపిక మైనారిటీ సమూహాలకు నైతికంగా ప్రాతినిధ్యం వహించేలా చేస్తుంది.
  • ఇది స్కేలబుల్ మోడల్‌ను కలిగి ఉంది. వారి విధానాలపై ఓటు వేయడానికి సమయం లేని ఎవరైనా తమ ఓటింగ్ బాధ్యతలను ప్రతినిధులకు అప్పగించవచ్చు.

కర్డానో ఎలా పనిచేస్తుంది

లావాదేవీలను నిర్ధారిస్తుంది:

  1. లావాదేవీలను ధృవీకరించడంలో సహాయపడే వ్యక్తులను వ్యాలిడేటర్‌లు అంటారు.
  2. వాలిడేటర్లు వారి ADA నాణేలలో కొన్నింటిని “స్టేక్” గా స్తంభింపజేయాలి.
  3. వ్యాలిడేటర్ లావాదేవీని ధృవీకరించిన తర్వాత, వారు రివార్డ్‌గా అదనపు ADA క్రిప్టోకరెన్సీని పొందుతారు.
  4. అధిక వాటా, రివార్డ్‌ని గెలుచుకునే అవకాశం వాలిడేటర్‌కి ఎక్కువ!
  5. వారు పొందే నాణేల మొత్తం వారి “వాటా” మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

ఈ వ్యవస్థ సమర్థవంతమైంది ఇంకా పర్యావరణ అనుకూలమైనది, తక్కువ విద్యుత్ వాడుతుంది, అంటే లావాదేవీల రుసుములో తగ్గుదల.

చుట్టూ ఉన్న ఇతర ప్రూఫ్-ఆఫ్-స్టేక్ ప్రోటోకాల్‌లు ఏవీ యాదృచ్ఛికంగా వాలిడేటర్ ఎంపికను అందించవని కర్డానో బృందం చెబుతోంది. వారి స్టాండర్డ్ ప్రూఫ్-ఆఫ్-స్టేక్ మోడల్ ప్రతిఒక్కరూ రివార్డ్‌ను పొందే న్యాయమైన అవకాశాన్ని పొందేలా చేస్తుంది.దీనిని “హానెస్ట్ మెజారిటీ” అని పిలుస్తారు, అంటే బ్లాక్‌చెయిన్‌లో గణనీయమైన వాటాను కలిగి ఉన్న వ్యక్తులు (ఉదాహరణకు, చాలా ADA నాణేలు కలిగి ఉన్నవారు) నెట్‌వర్క్ సురక్షితంగా, స్థిరంగా మరియు విశ్వసనీయంగా ఉండేలా చూసుకోవడానికొక కారణం ఉంది.

కర్డానో భవిష్యత్తు & మార్గసూచీ

లావాదేవీలో పాల్గొన్న వ్యక్తులకు అసంబంధమైన డేటాను పంపిణీ చేయడం ద్వారా ప్రత్యేకంగా పనులను చేసే బ్లాక్‌చెయిన్‌ను కార్డానో నిర్మిస్తోంది. 

మీరు మీ స్నేహితుడికి 100 ADA నాణేలను పంపారని అనుకుందాం, అప్పుడు మీరిరువురు మాత్రమే లావాదేవీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు. వాలిడేటర్లు ఫండ్ కదలికను ధృవీకరించినప్పుడు, వారు లావాదేవీకి సంబంధించిన డేటాను నిర్వహించాలి.

ఈ బృందం “షార్డింగ్” అనే ప్రోటోకాల్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కువ మంది వ్యక్తులు నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నందున, సెకనుకు లావాదేవీల పరిమాణం పెరుగుతుంది.

కర్డానో 2017 చివరలో ఒక పరీక్షను నిర్వహించింది, ఇది బిట్‌కాయిన్ మరియు ఎథేరియమ్ కంటే సెకనుకు 257 లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి బ్లాక్‌చెయిన్‌ను అనుమతించింది. 

ఎథేరియమ్ మాదిరిగానే, కర్దానోఒక వినూత్న ఒప్పంద వేదిక. అయినప్పటికీ, కర్డానో ఒక లేయర్డ్ ఆర్కిటెక్చర్ ద్వారా స్కేలబిలిటీ మరియు భద్రతను అందిస్తుంది. ఇది శాస్త్రీయ సిద్ధాంతం మరియు పరిశోధన-ఆధారిత వ్యూహం నుండి ఉద్భవించిన మొదటి బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్. అంతే కాదు. హాస్కెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నిర్మించబడిన మొదటి ప్లాట్‌ఫారమ్‌లలో ఇది కూడా ఒకటి. డిజిటల్ నిధులను పంపడానికి మరియు స్వీకరించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.

ADA ట్రేడింగ్ సరళీకృతం చేయబడింది

WazirX రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ADA ఒక భాగం. WazirXలో ADAతో మీరు ఏమి చేయవచ్చో ఇక్కడ ఉంది.

  • డిపాజిట్లు – మీరు మరొక వాలెట్ నుండి మీ WazirX వాలెట్‌కి ADAని డిపాజిట్ చేయలేరు.
  • ట్రేడింగ్ – మీరు మా USDT లేదా BTC మార్కెట్లో సులభంగా ADAని కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు, వ్యాపారం చేయవచ్చు.
  • ఉపసంహరణలు – మీరు మీ WazirX వాలెట్ నుండి ADAని ఉపసంహరించుకోలేరు. దానికి బదులుగా మీరు మా USDT లేదా BTC మార్కెట్‌లో వాటిని విక్రయించవచ్చు.

కర్డానోను ఎలా కొనాలి

భారతదేశంలో అనేక ఎక్స్ఛేంజీలు కర్డానోను అందిస్తున్నాయి. ADA నాణేలలో కొనుగోలు చేయడం లేదా వ్యాపారం చేయడం BTC, ETH, మొదలైన క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ మాదిరిగానే ఉంటుంది. మీరు మీకు నచ్చిన ట్రేడర్‌ని ఎంచుకోవాలి, KYC తర్వాత ఖాతాను తెరవండి, మీ వాలెట్‌లో నిధులను డిపాజిట్ చేయండి ఇంకా ట్రేడింగ్ ప్రారంభించండి!

భారతదేశంలో WazirX నుండి కర్డానోను కొనుగోలు చేసేటప్పుడు మీరు అనుసరించాల్సిన కొన్ని సులభమైన దశలు ఇక్కడ ఉన్నాయి:

  1. WazirX లో ఖాతాను తెరవండి
  • WazirX వెబ్‌సైట్‌కి వెళ్లి సైన్ అప్ చేయండి.
  • మీ మెయిల్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ని జోడించండి.
  • WazirX నిబంధనలు మరియు షరతులను చదవండి మరియు మీరు అంగీకరిస్తే చెక్‌బాక్స్‌ని చెక్ చేయండి.
Signup to WazirX
  • మీరు పూర్తి చేసిన తర్వాత, సైన్ అప్ పై క్లిక్ చేయండి.
  • మీ ఇన్‌బాక్స్‌కి పంపబడిన స్వయంచాలకంగా పంపబడిన ధృవీకరణ ఇమెయిల్‌ను తెరిచి, ఇమెయిల్‌ని ధృవీకరించండి.
Sign up and Verify email - WazirX
  • KYCని ధృవీకరించడానికి, మీ దేశాన్ని ఎంచుకోండి.
verify KYC by select your country
  • ధృవీకరణ తర్వాత, మీ ఖాతా ఆచరణలోకి వచ్చి పనిచేస్తుంది.
  1. డబ్బు జోడించండి.

మీరు డబ్బును (ఈ సందర్భంలో భారతీయ రూపాయలు) రెండు విధాలుగా డిపాజిట్ చేయవచ్చు:

  1. ADA కొనండి.

మీరు ఎంచుకున్న ట్రేడర్ వెబ్‌సైట్‌లో మార్పిడి రేటును తనిఖీ చేయండి. ఉదాహరణకు, ఈ ఆర్టికల్ వ్రాసే సమయంలో, ధరలు:

Check the exchange rate - WazirX
  • మీ స్క్రీన్ దిగువన కుడి వైపున, మీరు కొనుగోలు/అమ్మకం ఎంపికను కనుగొంటారు
  • కొనుగోలుపై క్లిక్ చేయండి, మీరు కోరిన ధరను INRలో మరియు మీరు కొనాలనుకుంటున్న ADA మొత్తాన్ని నమోదు చేయండి.
  • On the bottom right of your screen, you will find a buy/sell option
  • Click on Buy, put in your sought-after price in INR and the amount of ADA you wish to buy.
  • “బై ADA” ని క్లిక్ చేయడం చివరి దశ.

టట్టడాయ్! అంతే ఐపోయింది! ఏమైనప్పటికీ, ఇది విజయవంతంగా పూర్తవుతుంది, ADA నాణేలు మీ వాలెట్‌కు జోడించబడతాయి!

WazirX లో మేము ADA కోసం లిక్విడిటీని అందించగల వారిని ఆహ్వానిస్తున్నాము. మేము మీకు ప్రత్యేకమైన డిపాజిట్ చిరునామాను అందిస్తాము, అది మీ టోకెన్‌లను WazirXలో మార్కెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫారమ్ ‌ను వెంటనే పూరించండి! 

WazirXలో మా USDT మరియు BTC మార్కెట్‌లలో కర్డానో (ADA)ని కొనడానికి, అమ్మడానికి, వ్యాపారం చేయడానికి అవకాశాన్ని కోల్పోకండి!

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply