Skip to main content

భారతదేశంలో సూషీస్వాప్ (SUSHI)ని ఎలా కొనాలి? (How to Buy Sushiswap (SUSHI) in India?)

By ఏప్రిల్ 19, 2022మే 30th, 20224 minute read
How to buy Sushiswap (SUSHI) in India

డెఫి రంగంలో, యునిస్వాప్ అనేది పెద్ద ట్రేడింగ్ వాల్యూమ్‌తో అందరికీ బాగా తెలిసిన ప్లాట్‌ఫారమ్. అయినా కూడా, ఎంతగా జనాదరణ ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ డెవలప్‌మెంట్ డైరెక్షన్‌కు సంబంధించిన విషయాలలో యునిస్వాప్ యూజర్స్‌కు పెద్దగా చెప్పనందున క్రిప్టో వరల్డ్‌లోని వ్యక్తులు నిరాశ చెందారు. అయినప్పటికీ, సూషీస్వాప్  అనేది యూనిస్వాప్ వారి ఫోర్క్, ఇది వారి స్థానిక క్రిప్టో SUSHI యజమానులను నెట్‌వర్క్ గవర్నెన్స్‌లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. 

$4.5 బిలియన్లకు పైగా TVLతో, సూషీస్వాప్ డెఫి వరల్డ్‌లోని ప్రముఖ AMMలలో (ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్) ఒకటి. ఈ పోస్ట్‌లో, మీరు  భారతదేశంలో SUSHIని కొనుగోలు చేసే ముందు సూషీస్వాప్ గురించి, అలాగే సూషీస్వాప్ ధరల వివరాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకునే ప్రతివిషయాన్ని మేము మీకు అందిస్తాము. 

సూషీస్వాప్ గురించి మీరు తెలుసుకోవలసినది

సూషీస్వాప్ 2020లో చెఫ్ నోమి అనే మరొకపేరుతో స్థాపించబడింది. సూషీస్వాప్ మరియు ఓక్స్‌మకి అని పిలువబడే సూషీస్వాప్ స్తాపనలో మరొకపేరుగల ఇద్దరు సహ-వ్యవస్థాపకులు పాల్గొన్నారు- వీరిని కేవలం మకి అని కూడా పిలుస్తారు. వారి ముగ్గురి గురించి కాని లేదా వారు యూనిస్వాప్ నుండి బయటికి రావడానికి వారికి ఉన్న కారణాల గురించి చాలా తక్కువగా తెలుసు, వారు సూషీస్వాప్ కోసం ప్రాజెక్ట్ అభివృద్ధి ఇంకా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ప్లాట్‌ఫారమ్ కోడ్‌బాధ్యత కూడా వహిస్తున్నారు.

సూషీస్వాప్ తన డెక్స్- లేదా డిసెంట్రలైజ్డ్ ఎక్స్చెంజ్ ప్రొటొకాల్ కోసం ఆటోమేటెడ్ మార్కెట్ మేకింగ్ (AMM) మోడల్‌ను స్వీకరించింది. అందువలన, ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్ బుక్ అందుబాటులో లేదు; క్రిప్టో కొనుగోలు మరియు అమ్మకపు పనులు స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా సులభతరం చేయబడి ధరలు అల్గారిథమ్ ద్వారా నిర్ణయించబడతాయి.

సూషీస్వాప్ ప్రాథమికంగా  యూనిస్వాప్, బేస్ కోడ్‌పై స్తాపించబడినప్పటికీ, రెండింటి మధ్య కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి. సూషీస్వాప్ పూల్స్‌లోని అన్ని లిక్విడిటీ ప్రొవైడర్లు SUSHI టోకెన్‌లతో రివార్డ్ చేయబడతారు, ఇది గవర్నెన్స్ టోకెన్‌గా రెట్టింపు అవుతుంది.  SUSHI  క్రిప్టో హోల్డర్‌లు ప్లాట్‌ఫారమ్‌లో లిక్విడిటీని అందించడం మానేసిన తర్వాత కూడా వారికి రివార్డ్‌ను కొనసాగించవచ్చు.  

సూషీస్వాప్ ఎలా పని చేస్తుంది?

వివిధ క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయడం మరియు అమ్మడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి సూషీస్వాప్ అనేక లిక్విడిటీ పూల్‌లను ఉపయోగిస్తుంది; ఉదాహరణకు, సూషీస్వాప్‌లో USDT/ETH పూల్ ఉంది, ఇది USDT మరియు ETH నాణేల సమాన విలువలతో ఉండే లక్ష్యంతో ఉంటుంది. LPలు లేదా లిక్విడిటీ ప్రొవైడర్లు రెండు (లేదా అంతకంటే ఎక్కువ) క్రిప్టో అసెట్స్‌లను స్మార్ట్ కాంట్రాక్ట్‌లోకి లాక్ చేస్తూ ఈ పూల్స్‌కు సహకరించవచ్చు. 

కొనుగోలుదారులు తమ క్రిప్టోను కొన్ని లిక్విడిటీ పూల్‌లలో నిల్వ చేసిన క్రిప్టోతో మార్చుకోవచ్చు. లిక్విడిటీ పూల్‌లో క్రిప్టో టోకెన్‌ల బ్యాలెన్స్‌ను ఎప్పుడూ కొనసాగిస్తూ, కొనుగోలుదారు ట్రేడ్ అవుట్ చేయాలనుకుంటున్న టోకెన్‌లను స్మార్ట్ కాంట్రాక్టులు స్వీకరించి వారికి అవసరమైన టోకెన్‌లకు సమానమైన మొత్తాన్ని తిరిగి పంపుతాయి.  

లిక్విడిటీ ప్రొవైడర్లు సూషీస్వాప్ ప్లాట్‌ఫారమ్ వారి డిపాజిట్లకు రివార్డ్‌గా పొందే ఫీజులో కొంత భాగాన్ని అందుకుంటారు. అంతేకాకుండా, SUSHIబార్ అనేది సూషీస్వాప్‌లోని ఒక అప్లికేషన్, ఇది ఎక్స్‌SUSHI టోకెన్‌ను సంపాదించడానికి వినియోగదారులు వారి SUSHI వాటాని పొందేలా చేస్తుంది, ఇది ఎక్స్ఛేంజ్ ద్వారా సేకరించబడిన అన్ని ట్రేడింగ్ ఫీజులలో 0.05% రివార్డ్‌ను సంపాదించడానికి వారికి అవకాశం కలిగిస్తుంది. 

ఇప్పుడు సూషీస్వాప్ ఎలా పనిచేస్తుందనే దాని గురించిన ప్రాథమిక విషయాలు మనకి తెలిశాయి కాబట్టి, SUSHI ధరల వివరాలు, అలాగే భారతదేశంలో కొనుగోలు ప్రాసెస్ చేసే ముందు మీరు SUSHIని ఎందుకు కొనాలో తెలుసుకుందాం.  

SUSHIని ఎందుకు కొనాలి?

సూషీస్వాప్ వారి స్థానిక SUSHI క్రిప్టో ERC-20 కాయిన్ ఇంక దీనికి మొత్తం 250 మిలియన్ టోకెన్‌ల సరఫరా ఉన్నది. నవంబర్ 2021 నాటికి, కొత్త SUSHI కాయిన్స్ ప్రతి బ్లాక్‌కు 100 టోకెన్ల స్థిరమైన రేటుతో ముద్రించమింట్ చేయబడుతున్నాయి. వాటి పంపిణీ సరఫరా మొత్తం సరఫరాలో 50%కి చేరుకున్నది, దాదాపు 127 మిలియన్ నాణేలు చలామణిలో ఉన్నాయి.

SUSHI క్రిప్టో ఉపయోగానికి అనేక కారణాలు ఉన్నాయి. స్టార్టర్స్, సూషీస్వాప్ నెట్‌వర్క్‌ను మేనేజ్ చేయడములో మరియు ఆపరేట్ చేయడములో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. SUSHIని కొనుగోలు చేసే వినియోగదారులు ప్లాట్‌ఫారమ్ గవర్నెన్స్‌లో పాల్గొని వారి తదుపరి అభివృద్ధి గురించి చర్చించే ప్రతిపాదనలపై ఓటు వేయవచ్చు. నిజానికి, సూషీస్వాప్  లో ఎవరైనా SIP లేదా సూషీస్వాప్ ఇంప్రూవ్‌మెంట్ ప్రతిపాదనను ఇవ్వవచ్చు, ఇతర SUSHI హోల్డర్‌లు దానికి ఓటు వేయవచ్చు. 

చివరగా, SUSHI హోల్డర్‌లు ఈ కాయిన్స్‌ను ఎక్స్‌SUSHI పూల్‌లో ఉంచి ప్లాట్‌ఫారమ్ ఫీజులో కొంత భాగాన్ని సంపాదించవచ్చు. అయితే ముఖ్యంగా, సూషీస్వాప్ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్‌తో ఉండి SUSHI కాయిన్స్‌లను స్వంతం చేసుకుని ప్రోటోకాల్‌ను అమలు చేయడంలో సహాయం చేస్తూ భవిష్యత్తులోని అభివృద్ధి విషయాలలో సరైన అభిప్రాయంతో ఉంటుంది. 

భారతదేశంలో SUSHIని ఎలా కొనుగోలు చేయాలి?

WazirX ఇప్పటికే అగ్ర క్రిప్టో ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా స్థిరపడింది. వారు అందించే అనేక ఆల్ట్‌కాయిన్‌లలో SUSHI ఒకటి; అందువలన మీరు ఈ క్రింద లిస్టు చేయబడిన కొన్ని సాధారణ దశలను అనుసరిస్తూ WazirX ద్వారా  భారతదేశంలో SUSHIని కొనవచ్చు :

  1. WazirXలో సైన్ అప్ చేయండి 

ప్రారంభించడానికి  ఇక్కడక్లిక్ చేసి WazirXలో అకౌంటును తెరవవచ్చు.

Sign Up on WazirX 
  1. అవసరమైన వివరాలను పూరించండి

మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఇచ్చి సురక్షితమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. 

choose a secure password
  1. ఇమెయిల్ వెరిఫికేషన్ మరియు అకౌంట్ సెక్యురిటి సెటప్

ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ తరువాత అకౌంట్ తెరవడానికి కొనసాగించండి, ఇమెయిల్ అడ్రస్‌కు పంపిన వెరిఫికేషన్ లింక్‌ మీద క్లిక్ చేసి అకౌంట్ తెరవడానికి కొనసాగించండి. తరువాత, మీ అకౌంట్ సెక్యూరిటీని నిర్ధారించడానికి, మీరు ఈ క్రింది చిత్రంలో చూపినట్లుగా WazirX మీకు రెండు ఎంపికలను అందిస్తుంది. ఎంపికను ఎంచుకునే సమయంలో, మొబైల్ SMS కంటే ఆథెంటికేటర్ యాప్ మరింత సురక్షితమైనదని గుర్తుంచుకోండి, ఎందుకంటే రిసెప్షన్ ఆలస్యమవ్వడం లేదా SIM కార్డ్ హ్యాకింగ్ అయ్యే ప్రమాదాలు ఉండవచ్చు.

Email Verification and Account Security Setup
  1. మీరు ఏ దేశస్తులో ఎంచుకుని, KYCని పూర్తి చేయండి

మీరు ఏ దేశస్తులో ఎంచుకున్న తరువాత, KYCని పూర్తి చేయకుండా, మీరు పీర్-టు-పీర్ ట్రేడ్ చేయలేరు లేదా ఫండ్స్ విత్‌డ్రా చేయలేరు అందువలన మీరు KYC ప్రాసెస్ పూర్తి చేయాలని సిఫార్సు చేయబడింది. 

KYCని పూర్తి చేయడానికి, మీరు తప్పనిసరిగా ఈ క్రింది వివరాలను ఇవ్వవలసి ఉంటుంది:

  1. మీ పూర్తి పేరు మీ ఆధార్ లేదా దానికి సమానమైన డాక్యుమెంట్‌లో ఉన్న విధంగా,
  2. మీ ఆధార్ లేదా దానికి సమానమైన డాక్యుమెంట్‌లో ఉన్న మీ పుట్టిన తేదీ,
  3. మీ పూర్తి పేరు మీ ఆధార్ లేదా దానికి సమానమైన డాక్యుమెంట్‌లో ఉన్న విధంగా,
  4. స్కాన్ చేసిన డాక్యుమెంట్ కాపీ,
  5. చివరగా, ప్రాసెస్ పూర్తి చేయడానికి మీ ఒక సెల్ఫీ. 

ఇంక మీరు మీ అకౌంటును తెరవడం పూర్తి చేశారు! 24 నుండి 48 గంటలలోపు, అకౌంట్ సాధారణంగా వాలిడేట్ చేయబడుతుంది.

  1. ఇప్పుడు మీ WazirX అకౌంటుకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయండి

మీరు మీ WazirX అకౌంటుకి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన తరువాత, మీరు మీ WazirX వాలెట్‌లో ఫండ్స్ డిపాజిట్ చేయవచ్చు. IMPS, UPI, RTGS మరియు NEFTని ఉపయోగించి INRలో డిపాజిట్‌లను ఈ ప్లాట్‌ఫారమ్ అంగీకరిస్తుంది. మీరు కనీసం రూ. 100 మీ WazirX అకౌంటులో డిపాజిట్ చేయవచ్చు, ఇంక గరిష్ట పరిమితి లేదు.

ఫండ్స్ డిపాజిట్ చేయడానికి, మీ WazirX అకౌంటుకు లాగిన్ అయ్యి, క్రింది చిత్రంలో చూపినట్లుగా “ఫండ్స్” ఎంచుకోండి. ఆ తరువాత కేవలం “రూపాయిలు (INR)” ఎంచుకుని, ఇంక “డిపాజిట్” క్లిక్ చేయండి. 

Now Transfer Funds to Your WazirX Account
  1. భారతదేశంలో SUSHI క్రిప్టో ధరను చెక్ చేసిన తరువాత WazirXలో SUSHIని కొనుగోలు చేయండి

మీరు WazirX ద్వారా INRతో SUSHIని కొనుగోలు చేయవచ్చు. మీ WazirX అకౌంటుకు లాగిన్ అయ్యి, “ఎక్స్ఛేంజ్” ఎంపిక నుండి INRని ఎంచుకోండి. మీరు భారతీయ రూపాయితో సరిపోలిన అన్ని క్రిప్టోల స్పాట్ మార్కెట్‌కి మళ్లించబడతారు. స్క్రీన్ కుడి వైపున, మీరు అన్ని ధరల చార్ట్‌లు, ఆర్డర్ బుక్ డేటా మరియు ఆర్డర్ ఇన్‌పుట్ ఫారమ్‌ను చూస్తారు. 

ఇక్కడ SUSHIని కొనండి

మీరు కొనుగోలు ఆర్డర్ ఫారమ్‌ను పూరించడానికి ముందు భారతదేశంలో SUSHI క్రిప్టో ధరను చూసేవిధంగా చేసుకుని “SUSHIని కొనండి” మీద క్లిక్ చేయండి. ఫారమ్ క్రింది చిత్రంలో BTC ఆర్డర్ కోసం చూపిన విధంగానే ఉండాలి.

ఆర్డర్ అమలు కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆర్డర్ అమలు చేయబడిన వెంటనే, మీరు మీ WazirX వాలెట్‌లో కొనుగోలు చేసిన SUSHI కాయిన్స్‌లను అందుకుంటారు.

Buy SUSHI on WazirX after Checking SUSHI Crypto Price in India

భవిష్యత్తులో సూషీస్వాప్ ఎలా ఉంటుంది?

2020లో ఇటీవలే మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ, 2022 ప్రారంభంలో సూషీస్వాప్ మార్కెట్ క్యాప్ ఇప్పటికే దాదాపు $545 మిలియన్లకు చేరుకుంది. సూషీస్వాప్ ధర మార్చి 13, 2021న $23.38 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. కాయిన్ 2021లో ముగిసినప్పటికీ సరిగ్గా చెప్పాలంటే, SUSHI క్రిప్టో భవిష్యత్తుకు సంబంధించి నిపుణులు బుల్లిష్ సెంటిమెంట్‌లతో ఉన్నారు. 

అల్గారిథమ్ ఆధారిత ఫోర్‌కాస్టింగ్ సైట్ వాలెట్ ఇన్వెస్టర్, ప్రకారం, జనవరి 2023 ప్రారంభం నాటికి SUSHI ధర $8.4కి మరియు ఇప్పటి నుండి ఐదేళ్లలో $25కి చేరుకోవచ్చు. మరోవైపు, DigitalCoin 2022లో సూషీస్వాప్ ధర సగటున సుమారు $6 ఉండవచ్చని, 2025 నాటికి సుమారు $10గా ఉండవచ్చని, ఆ తరువాత 2029 నాటికి $18.18కి పెరగవచ్చని సూచించింది.

 యూనిస్వాప్ ఫోర్క్ అయినప్పటికీ, సూషీస్వాప్ కమ్యూనిటీ గవర్నెన్స్ కోసం పెద్ద స్కోప్‌తో AMM మోడల్‌కు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. SUSHI కమ్యూనిటీ సభ్యుడు సూచించిన షోయు అనే NFT ప్లాట్‌ఫారమ్ క్రొత్తగా జతచేసిన – సూషీస్వాప్ ఆవిష్కరణ మరియు స్థిరమైన అభివృద్ధి పట్ల తన నిబద్ధతను చూపుతుంది. సూషీస్వాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లతో, DeFi భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply