Skip to main content

భారతదేశంలో టెథర్ (USDT) కాయిన్‌ను ఎలా కొనుగోలు చేయాలి (How to Buy Tether (USDT) Coin in India)

By ఏప్రిల్ 21, 2022మే 28th, 20224 minute read
how to buy tether (usdt) coin in India

టెథర్ (USDT)అనేది ఒక స్టేబుల్‌కాయిన్‌, దీని టోకెన్‌లు సమాన మొత్తంలో ఉన్న US డాలర్ల చలామణిలో ఉంటాయి, దీని ధర $1.00 గా ఉంటుంది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ BitFinex ద్వారా మొదలయ్యి USDT గుర్తు క్రింద ట్రేడ్ చేయబడిన టెథర్ టోకెన్‌లు టెథర్ నెట్‌వర్క్‌లోని స్థానిక టోకెన్‌లు.

ముఖ్యంగా, స్టేబుల్‌కాయిన్‌లు అనేవి ఒక రకమైన క్రిప్టోకరెన్సీ , ఇవి రిఫరెన్స్ అసెట్ లేదా దాని డెరివేటివ్‌లను కొని అమ్మే కొలేటరలైజేషన్ లేదా అల్గారిథమిక్ సిస్టమ్‌ల ద్వారా ఒక స్థిరమైన ధరని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాటిని US డాలర్ వంటి కరెన్సీకి లేదా బంగారం వంటి వస్తువుల ధరకు లింక్ చేయవచ్చు. స్టేబుల్‌కాయిన్స్ తరచుగా డాలర్, యూరో లేదా జపనీస్ యెన్ వంటి ఎంచుకున్న బ్యాంక్ అకౌంటులో నిర్వహించబడే పాత విధానాలలో ఫియట్ కరెన్సీలను తిరిగి ఇస్తాయి. ఊహించిన పెట్టుబడులకు మాత్రమే ఉపయోగించకుండా వాటిని మార్చుకునే ఒక సాధనంగా ఇంకా సంపదను దాచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

క్రిప్టోతో సంబంధం ఉన్న పెద్ద మొత్తాలలో ఉన్న ప్రమాదాల కారణంగా, చాలా సంస్థలు డిజిటల్ కరెన్సీ ఎక్స్ఛేంజీలతో ట్రేడ్ చేయడం మానుకుంటున్నాయి. ఇక్కడే స్టేబుల్‌కాయిన్‌లు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. క్రిప్టోకరెన్సీని హై-రిస్క్ పెట్టుబడిగా కాకుండా విలువకి తగిన స్టోర్‌గా పనిచేసే అవకాశం ఉండటం వలన, స్టేబుల్‌కాయిన్‌లు క్రిప్టో సెక్టార్‌లోని తీవ్రమైన అస్థిరత సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తాయి.  అల్లకల్లోలమైన క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో, క్యాష్ ఇంకా బిట్‌కాయిన్, వంటి క్రిప్టోకరెన్సీ మధ్య విలువలను ముందుకు వెనుకకు మార్చడం కష్టంగా ఉంటుంది, స్టేబుల్‌కాయిన్‌లు లిక్విడిటీని అందిస్తాయి.

US డాలర్‌తో ముడిపడి ఉన్న వివిధ స్టేబుల్‌కాయిన్‌లలో టెథర్ చాలా ప్రజాదరణ పొందింది. క్రిప్టోకరెన్సీ ట్రేడర్స్ క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసేడప్పుడు US డాలర్‌కు బదులుగా టెథర్‌ను తరచుగా ఉపయోగిస్తారు. క్రిప్టో మార్కెట్ ఎక్కువగా అస్థిరతలోఉన్నప్పుడు స్థిరమైన ఆస్తికి మరింతగా భద్రత పొందే అవకాశాన్ని సమర్థవంతంగా అందిస్తుంది.  టెథర్ ధర సాధారణంగా $1 కి సమానంగా ఉంటుంది, ఎందుకంటే ఇది డాలర్‌తో ముడిపడి ఉంటుంది. ఇతర క్రిప్టోకరెన్సీలలాగా కాకుండా, విలువలో తేడా ఉంటుంది, టెథర్ ధర సాధారణంగా స్థిరంగా ఉంటుంది.

ఏది ఏమైనప్పటికీ, స్టేబుల్‌కాయిన్‌లు 1:1 నిష్పత్తిలో ఉన్నప్పటికీ, వాటి ధర కొద్దిగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. ఇప్పటికీ, ఎక్కువ కాలం, స్టేబుల్‌కాయిన్ల ధరలలో తేడాలు 1 నుండి 3 సెంట్లు మాత్రమే. ఇది ఎక్కువగా లిక్విడిటీ, సప్లై మరియు డిమాండ్‌లో హెచ్చుతగ్గుల కారణంగా జరుగుతూ ఉంటుంది, ఇవి లావాదేవీలను బట్టి, మార్కెట్ అస్థిరత మరియు ట్రేడింగ్లను బట్టి ప్రభావితమవుతాయి.

2022 ఏప్రిల్ మధ్య నాటికి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం USDT మూడవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ దీని విలువ $82.7 బిలియన్ల కంటే ఎక్కువ. 

టెథర్ విలువైన పెట్టుబడేనా?

గతంలో అనేక వివాదాలు చుట్టుముట్టినప్పటికీ, టెథర్ కొంతవరకు స్థిరమైన క్రిప్టోకరెన్సీగా మిగిలిపోయింది. సంవత్సరాలుగా టెథర్ చాలా మంది పోటీదారులను ఎదుర్కొన్నప్పటికీ, అత్యంత ఎక్కువగా ఉపయోగించే స్టేబుల్‌కాయిన్‌గా నిలిచింది. టెథర్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, వీటిలో అత్యంత ప్రముఖమైనది ఏమిటంటే, మనం ఇప్పటికే చూసినట్లుగా, ఇతర క్రిప్టోకరెన్సీలలో ఉన్న తీవ్రమైన అస్థిరతను నివారించడానికి టెథర్ పెట్టుబడిదారులకు ఎంతో సహాయపడుతుంది. విలువను USDTకి మార్చడం ద్వారా, ట్రేడర్స్ క్రిప్టోకరెన్సీలధరలు అకస్మాత్తుగా తగ్గుదలకి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

టెథర్ వంటి స్టేబుల్‌కాయిన్‌లు టెథర్ కోసం ఏదైనా క్రిప్టోకరెన్సీని సులభంగా ఇంకా త్వరగాను మార్చుకునేలా చేశాయి, అయితే క్రిప్టోకరెన్సీని క్యాష్‌గా మార్చడానికి రోజులు పట్టి లావాదేవీ ఖర్చులు ఉంటాయి. ఇది పెట్టుబడిదారులకు మార్పిడి ప్లాట్‌ఫారమ్‌లు మరియు నో-కాస్ట్ ఎగ్జిట్ స్ట్రాటజీలకు లిక్విడిటీని అందించడమే కాకుండా వారి పోర్ట్‌ఫోలియోల సౌలభ్యాన్ని మరియు స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. క్రిప్టో కొనుగోళ్లను సులభతరం చేయడానికి టెథర్ చాలా అనువైనది, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు తమ అస్థిరత కారణంగా బిట్‌కాయిన్ లేదా ఎథెరియంపై ఆధారపడకుండా ఉండాలనుకుంటున్నారు.

టెథర్ గతంలో $1 కంటే క్రిందకి పడిపోయినప్పటికీ ఇంక $1 కంటే ఎక్కువ పెరిగినప్పటికీ దాని విలువను కొనసాగించగలిగింది ఎందుకంటే ఇది సరిపోలే ఫియట్ కరెన్సీ ఫండ్‌తో ముడిపడి ఉంది మరియు పూర్తిగా టెథర్ రిజర్వ్‌లచే మద్దతు ఇవ్వబడింది. ఈ కారణాలన్నీ ఖచ్చితంగా టెథర్‌ను విలువైన పెట్టుబడిగా చేస్తాయి. 

భారతదేశంలో INRతో USDTని ఎలా కొనుగోలు చేయాలి?

మీరు భారతదేశంలో INRతో USDTని కొనుగోలు చేయాలనేదాని గురించి వెతుకుతున్నట్లయితే, భారతదేశపు అత్యంత విశ్వసనీయ మరియు ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన WazirX కంటే మించిన దానిని వెతకకండి. USDT నుండి INR మార్పిడి రేట్లతో, WazirX భారతదేశంలో USDTని కొనుగోలు చేయడానికి కొన్ని సాధారణ దశల్లో మీకు అవకాశం కల్పిస్తుంది. 

WazirX ద్వారా భారతదేశంలో USDTని కొనుగోలు చేయడానికి, వినియోగదారులు ముందుగా WazirXలో రిజిస్టర్ చేసుకోవాలి. KYC ప్రాసెస్ పూర్తయిన తరువాత, వినియోగదారులు ఫండ్స్ డిపాజిట్ చేయడం ప్రారంభించి INRతో USDTని కొనుగోలు చేయవచ్చు

WazirXలో భారతదేశంలో USDTని కొనుగోలు చేయాలనే దానిపై ఇక్కడ ఒక వివరణాత్మక గైడ్ ఉన్నది.

స్టెప్1: మీ అకౌంటును తెరవండి

  • వెబ్‌సైట్ ద్వారా WazirXలో లేదా యాప్డౌన్‌లోడ్ చేసి సైన్ అప్ చేయండి. 
  • మీ ఇమెయిల్ అడ్రస్ రిజిస్టర్ చేసి పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.
  • సేవా నిబంధనలను పరిశీలించి, చెక్‌బాక్స్‌ మీద క్లిక్ చేసి, తరువాత సైన్-అప్ బటన్‌ మీద క్లిక్ చేయండి. 
Create your account

స్టెప్ 2: మీ ఇమెయిల్‌ను వెరిఫై చేయండి 

ఆ తరువాత మీరు రిజిస్టర్ చేసిన ఇమెయిల్ అడ్రస్‌కి వెరిఫికేషన్ ఇమెయిల్ పంపబడుతుంది. వెరిఫికెషన్‌లో, క్రింద చూపిన విధంగా మీకు మెసేజ్ వస్తుంది. 

Verify your email

 స్టెప్ 3: భద్రతా చర్యలను సెటప్ చేయండి

తరువాత, మీరు భద్రతా సెట్టింగ్‌ల పేజీకి వెళతారు. భద్రతా ప్రయోజనాల కోసం, గూగుల్ ఆథెంటికేటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ అకౌంటుకు కనెక్ట్ చేసి 2-ఫాక్టర్ ఆథెంటికెషన్ (2FA)ని ప్రారంభించాలని సిఫార్సు చేస్తున్నాము.

Set up security measures

 స్టెప్ 4: KYC వెరిఫికేషన్

ముందుగా, KYC వెరిఫికేషన్ను పూర్తి చేయడానికి అందించిన లిస్టు నుండి మీరు ఏ దేశస్తులో ఎంచుకోండి. మీరు మీ KYCని వెరిఫై చేసి ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. 

KYC Verification

స్టెప్ 5: మీ ఫండ్స్ డిపాజిట్ చేయండి

  • INR డిపాజిట్ అవుతోంది

INR ఫండ్స్ UPI/IMPS/NEFT/RTGS ద్వారా మీ బ్యాంక్ అకౌంటు నుండి మీ WazirX అకౌంటుకు డిపాజిట్ చేయవచ్చు. బ్యాంక్ పేరు, అకౌంటు నంబర్, IFSC కోడ్ మొదలైనవాటితో సహా మీ వివరాలను రిజిస్టర్ చేసి పని చేయడం మంచిది.

  • క్రిప్టోకరెన్సీ డిపాజిట్ అవుతోంది

క్రిప్టోకరెన్సీలను మీ వాలెట్ లేదా ఇతర వాలెట్ల నుండి మీ WazirX అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ముందుగా మీ WazirX వాలెట్ నుండి మీ డిపాజిట్ అడ్రస్ పొందండి. ఆ తరువాత, మీ క్రిప్టోకరెన్సీని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మీ ఇతర వాలెట్‌లోని ‘సెండ్ అడ్రస్’ భాగంలో ఈ అడ్రస్ షేర్ చేయండి.

స్టెప్  6: INRతో USDTని కొనుగోలు చేయండి

 USDT/INR ధరలను చూడటానికి WazirX యాప్ లేదా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి, ఆ తరువాత USDT/INR ధర టిక్కర్‌పై క్లిక్ చేయండి. 

Buy USDT with INR

క్రిందికి స్క్రోల్ చేస్తే BUY/SELL బటన్‌ను చూస్తారు. తరువాత, మీరు USDTని కొనుగోలు చేయాలనుకుంటున్న INR మొత్తాన్ని రిజిస్టర్ చేయండి. మీ WazirX అకౌంటులో డిపాజిట్ చేసిన మీ INR బ్యాలెన్స్ తప్పనిసరిగా ఈ మొత్తం కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉండాలి. 

Graphical user interface, text, applicationDescription automatically generated

BUY USDTపై క్లిక్ చేయండి. మీ ఆర్డర్ అమలు చేయబడిన తరువాత, మీరు కొనుగోలు చేసిన USDT మీ WazirX వాలెట్‌కి జోడించబడుతుంది. 

ఆ విధంగా కొన్ని సాధారణ స్టెప్స్‌తో భారతదేశంలో మీరు INRతో USDTని కొనుగోలు చేయవచ్చు. 
WazirX గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడక్లిక్ చేయండి.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply