Skip to main content

మీ క్రిప్టోకరెన్సీని క్యాష్‌గా మార్చుకోవడం ఎలా? (How To Convert Your Cryptocurrency Into Cash?)

By ఏప్రిల్ 26, 2022మే 27th, 20223 minute read
How to convert your cryptocurrency into cash - WazirX

క్రిప్టోకరెన్సీ ఫియాట్ మనీకి ప్రసిద్ది చెందిన ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారుల మరియు ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలలో చాలా ఆసక్తిని కలిగించింది. అయితే, బ్లాక్‌చెయిన్ ఆధారిత డిజిటల్ కరెన్సీల ఉద్ధేశానికి సవాలుతో కూడిన సమస్య ఉన్నది. ఈ కరెన్సీని సాధారణ ఫియాట్ కరెన్సీలాగా ఖర్చు చేయడం కష్టం. కానీ ప్రజలు తమ రోజువారీ ఆర్థిక అవసరాల కోసం ఉన్న ముఖ్యమైన మార్గాలలో క్రిప్టోకరెన్సీల వంటి బిట్‌కాయిన్ మరియు ఎథేరియం లను ఉపయోగిస్తూ సహాయం పొందే మార్గాలు ఉన్నాయి. 2022 లో క్రిప్టోను క్యాష్‌గా మార్చడం ఎలా అనేది క్రిప్టో గోళంలో ఉన్న అతిముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి?

డిజిటల్ కరెన్సీలు చాలా అస్థిరంగా ఉంటాయి మరియు వాటి విలువలు నాటకీయంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. డిజిటల్ కరెన్సీల చుట్టూ స్థిరత్వం లేని దృష్ట్యా తమ డిజిటల్ క్యాష్‌ను ఫియాట్ కరెన్సీగా మార్చడానిని రిస్క్-తీసుకోవడం ఇష్టంలేని పెట్టుబడిదారు దీనిని చూడవచ్చు. అయితే, క్రిప్టోను క్యాష్‌గా మార్చే అన్ని మార్గాలలో లాభాలపై ట్యాక్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో, 2022 లో క్రిప్టోను క్యాష్‌గా మార్చడం ఎలా అనే మీ ప్రశ్నకు మేము సమాధానం ఇస్తాము.

భారతదేశంలో క్రిప్టోను క్యాష్‌గా ఎలా మార్చుకోవాలో తెలిపే గైడ్

క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా

భారతదేశంలో క్రిప్టోను క్యాష్‌గా ఎలా మార్చాలనే దానిపై మా గైడ్‌లోని మొదటి మార్గం ఏమిటంటే  WazirX వంటి క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌ల  ద్వారా మార్చడం. ఆ తరువాత, మీరు ఏదైనా క్రిప్టోకరెన్సీని ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ లేదా బ్రోకర్ ద్వారా క్యాష్‌గా మార్చుకోవచ్చు. ఇది విదేశీ విమానాశ్రయాలలో కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ సిస్టమ్ లాగానే ఉంటుంది. 

  • మీరు మీ క్రిప్టోకరెన్సీని WazirX వంటి ఎక్స్‌ఛేంజ్‌లో డిపాజిట్ చేయాలి.
  • అప్పుడు మీరు మీకు నచ్చిన కరెన్సీలో విత్‌డ్రా కోసం అభ్యర్థన చేయాలి. 
  • కొంత సమయం తరువాత క్యాష్ మీ బ్యాంక్ అకౌంటులో డిపాజిట్ చేయబడుతుంది.

ఈ పద్ధతి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది, కానీ కొన్నిసార్లు మీ అకౌంటులోకి ఫండ్స్ రావడానికి 4-6 రోజులు పడుతుంది. ఇంకా, క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌లు లావాదేవీ ఫీజును వసూలు చేస్తాయి, ఇది ఒక ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ నుండి మరొకదానికి మారుతుంది.

పీర్-టు-పీర్ నెట్‌వర్క్ ద్వారా

పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతదేశంలో క్రిప్టోను క్యాష్‌గా ఎలా మార్చుకోవాలో మా గైడ్‌లోని తరువాతి అంశం. మీరు మీ క్రిప్టోకరెన్సీలను అమ్మడం ద్వారా క్యాష్‌గా మార్చడానికి పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి మీకు వేగంగాను ఇంక పేరులేకుండా విత్‌డ్రా చేసుకునే అవకాశం కలిగిస్తుంది. ఈ పద్ధతిలో ఉన్న ఇతర ప్రయోజనాలు, తక్కువ ఫీజు మరియు థర్డ్-పార్టీ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌తో పోలిస్తే మెరుగైన ఎక్స్‌ఛేంజ్ రేటు అవకాశం. 

  • ముందుగా, మీరు పీర్-టు-పీర్ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ కోసం సైన్ అప్ చేసి సరైన కొనుగోలుదారు లొకేషన్ కోసం వెతకాలి.
  • అప్పుడు, మార్కెట్‌లో కొనుగోలుదారుల కోసం చూడండి. చాలావరకు పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారమ్‌లు ఎస్క్రో సర్వీస్ అందిస్తాయి. పేమెంట్ వచ్చిందని మీరు నిర్ధారించే వరకు మీ క్రిప్టోకరెన్సీలను కొనుగోలుదారు యాక్సెస్ చేయలేరు.

పీర్-టు-పీర్ సెల్లింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు స్కామర్‌ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కొనుగోలుదారుకి మీ క్రిప్టోకరెన్సీని ఇవ్వడానికి ముందు మీరు వారి గుర్తింపును తప్పనిసరిగా వెరిఫై చేయాలి. కొనుగోలుదారు పేమెంట్ చేసే వరకు మీ క్రిప్టో అసెట్స్ లాక్‌లో ఉంచడానికి మీకు అవకాశం ఉండే పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని కూడా గట్టిగా సూచించబడింది.

క్రిప్టోకరెన్సీ బ్యాంకింగ్‌తో ఫియాట్ వంటి మీ క్రిప్టోకరెన్సీని ఉపయోగించండి

క్రిప్టోకరెన్సీ బ్యాంకింగ్‌ యూజర్స్ తమ డిజిటల్ అసెట్స్‌ను సాధారణ క్యాష్‌ను ఖర్చు చేసే విధంగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. క్రిప్టో బ్యాంకింగ్ యూజర్స్ తమ డిజిటల్ కాయిన్స్‌లను డిజిటల్ వాలెట్లలోనిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకమైన బ్యాంకింగ్ ద్వారా, మీకు క్రిప్టోకరెన్సీ డెబిట్ కార్డ్‌లకు అవకాశం ఉంటుంది. ఈ కార్డ్‌లు మీ డిజిటల్ కాయిన్ బ్యాలెన్స్‌ని ఉపయోగించుకునేలా మీరు రోజువారీ కొనుగోళ్లు చేయడానికి లేదా పెట్టుబడిగా ఉంచకుండా క్యాష్‌గా విత్‌డ్రా చేసుకోవడానికి ఏదైనా ఇతర కరెన్సీని ఉపయోగించుకునేలా మీకు అవకాశం ఉంటుంది.

క్రిప్టో డెబిట్ కార్డ్‌లు క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారాజారీ చేయబడతాయి. ఈ కార్డ్‌లను క్రిప్టోకరెన్సీతో లోడ్ చేసి డిజిటల్ కరెన్సీనిఅంగీకరించని ట్రేడర్స్ నుండి ఆన్‌లైన్‌లో మరియు స్టోర్‌లో కొనుగోళ్లు చేయడానికి ఉపయోగించవచ్చు.

ఈ డెబిట్ కార్డ్‌లు లేక ముందు, మీరు క్రిప్టోకరెన్సీలను పేమెంట్ పద్ధతిగా అంగీకరించడానికి లేదా క్రిప్టోను క్యాష్‌గా మార్చడానికి మార్గాలను వెతకడానికి ఎంచుకున్న రిటైలర్‌ల వద్ద మాత్రమే మీ క్రిప్టోకరెన్సీని ఖర్చు చేయగలిగేవారు. ప్రస్తుతం, ఫిన్‌టెక్ సంస్థలు ఈ క్రిప్టో కార్డ్‌లను అందించడానికి చార్టర్డ్ బ్యాంక్‌లు మరియు డెబిట్ కార్డ్ జారీదారులతో పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాయి, మీ క్రిప్టోకరెన్సీలను ఆటోమెటిక్‌గా అమ్మడానికి వారి భాగస్వాముల లాజిస్టికల్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి, వాటిని క్యాష్‌గా మార్చి రిటైలర్లు వాటిని అంగీకరించేలా చేస్తాయి. దీని అర్థం క్రిప్టో బ్యాంకింగ్ ద్వారా; సాధారణ డెబిట్ కార్డ్‌లు అంగీకరించే చోట మీరు మీ డిజిటల్ ఫండ్‌లను ఉపయోగించవచ్చు.

క్రిప్టో బ్యాంకింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న భావన అయినప్పటికీ, ఇది సాధారణ బ్యాంకులలాగా ప్రజాదరణ పొందేందుకు కొంచం సమయం పడుతుంది. అందువలన, భారతదేశంలో బిట్‌కాయిన్‌ను క్యాష్‌గా ఎలా మార్చాలనే శోధన కొనసాగుతుంది. ఈ పోస్ట్ క్రిప్టో/బిట్‌కాయిన్‌ని క్యాష్‌గా ఎలా మార్చుకోవాలో మీకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, క్రిప్టోకరెన్సీ మార్కెట్ అస్థిరంగా ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. అందువలన, మీరు క్రిప్టో గోళంలో ట్రేడ్ చేసే రిస్క్ తగ్గించడానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలి. 

PS: విశ్వసనీయ క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాత్రమే మీ క్రిప్టోను క్యాష్‌గా మార్చుకోండి!

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply