Skip to main content

DeFi Vs CeFi: వ్యత్యాసమేమిటి? (DeFi Vs CeFi: What’s The Difference)

By ఫిబ్రవరి 25, 2022మార్చి 10th, 20224 minute read

క్రిప్టోకరెన్సీలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశాయి. క్రిప్టోకరెన్సీలు ఫంగబుల్ కరెన్సీ ఇంకా ట్రేడబుల్ అసెట్ రెండింటి ప్రయోజనాన్ని అందజేస్తుండగా, బ్లాక్‌చెయిన్ ఇది అందరికీ అందుబాటులో ఉండేలా చేసింది. బ్లాక్‌చెయిన్ యొక్క ఈ మల్టీ-ఫంక్షనాలిటీ ప్రస్తుత ఆర్థిక సంస్థలను సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దానికి కేంద్రీకృతమై ఆర్థిక సేవల ప్రపంచాన్ని సృష్టించేలా ప్రేరేపించింది.

ఇప్పుడు, క్రిప్టోకరెన్సీలు ఇంకా బ్లాక్‌చెయిన్‌ల ఆర్థిక సేవల ప్రపంచాన్ని విస్తృతంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. అవి డీసెంట్రలైజ్(వికేంద్రీకృత) ఫైనాన్స్ (DeFi) ఇంకా సెంట్రలైజ్డ్ (కెంద్రీకృత) ఫైనాన్స్ (CeFi). ఈ రెండు వర్గాలు ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, దానిని సాధించే మార్గంలో అవి భిన్నంగా వ్యవహరిస్తాయి. వాటి నిర్వచనాలతోనే ప్రారంభిద్దాం. 

DeFi అంటే ఏమిటి?

వికేంద్రీకృత ఫైనాన్స్, సంక్షిప్తంగా DeFi, వాణిజ్యం, రుణాలు, ఉత్పన్నాలు ఇంకా అదేవిధంగా సేవల వంటి ఆర్థిక సేవలను పొందేందుకు వికేంద్రీకృత నెట్‌వర్క్ యొక్క అప్లికేషన్‌ను సూచిస్తుంది. DeFi ఒక వ్యక్తి లేదా సంస్థ రూపంలో ఏ మధ్యవర్తినీ కలిగి ఉండదు. అలా కాకుండా, సిస్టమ్ స్మార్ట్ కాంట్రాక్టులు ఇంకా మధ్యస్థ వ్యక్తి ప్రమేయం లేకుండా రెండు పార్టీల మధ్య సేవల మార్పిడిని అనుమతించే సారూప్యమున్న ప్రోటోకాల్‌లపై పనిచేస్తుంది.

క్విక్ నోట్:- స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో స్వీయ-అమలుచేసే ప్రోగ్రామబుల్ కోడ్, ఇది దాని అంతర్లీన ముందస్తుగా ఆమోదం పొందిన సూచనలు సంతృప్తి చెందినప్పుడు దానిని అమలు చేస్తుంది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, DeFi యొక్క పని క్రిప్టోకరెన్సీలు ఇంకా బ్లాక్‌చెయిన్ యొక్క స్వాభావిక లక్షణానికి అనుగుణంగా ఉంటుంది, ఇది వికేంద్రీకరించబడిన లక్షణం. DeFi బ్యాంకులు ఇంకా ఆర్థిక సంస్థల అవసరాన్ని తొలగిస్తుంది మరియు కేవలం ఒక వ్యక్తి బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడం మరియు వారి నిధులను ఉపయోగించి వారు ఇష్టపడే పనిని చేయడమే కావలసింది. 

CeFi అంటే ఏమిటి?

సెంట్రలైజ్డ్ ఫైనాన్స్, సంక్షిప్తంగా CeFi, ఒక సంస్థ లేదా మధ్యవర్తి, ట్రేడ్, రుణం, స్వాప్ ఇంకా మొదలైనటువంటి ఆర్థిక సేవలను సులభతరం చేసే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సరి సమానంగా ఉంటుంది, తరచుగా ఈ ప్రక్రియలో కేంద్ర నిర్ణయమే శిరోధార్యం. 

ఈ సంస్థ ఇంటర్‌ఫేస్, మద్దతును అందిస్తుంది ఇంకా కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. క్రిప్టో ప్రపంచంలో, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు CeFi ఎంటిటీకి ఒక ఉదాహరణ, ఇక్కడ కస్టమర్ తన సేవలను పొందేందుకు ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసుకుంటాడు. కాబట్టి వాస్తవ-ప్రపంచ ఆర్థిక సేవా సంస్థల వలె, ఒక వినియోగదారు తమ నిధులను కోరుకున్న సేవలను పొందడానికి కేంద్రీకృత సంస్థకు అధికారం ఇస్తారు.

DeFi vs CeFiని అర్థం చేసుకోవడం

ఈ చర్చతో అనుబంధించబడిన మెళుకువలను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, మొదట DeFi ఇంకా CeFi రెండింటి యొక్క లాభాలను చర్చించడం, తర్వాత వాటి ప్రతికూలతలను చర్చించడం. అయితే, ఇది ఒక నిర్దిష్ట పరామితిపై ఏకకాలంలో రెండు ఆర్థిక వర్గాలను మూల్యాంకనం చేయకుండా ఒకదాని స్థానాన్ని హరిస్తుంది.

కింది చర్చలో, మనం DeFi ఇంకా CeFi రంగాలలో అన్వయించబడ్డ ట్రెండ్‌లు మరియు సేవలను విస్తృతంగా విశ్లేషిస్తాము. ఏ రంగానికి చెందిన కొన్ని ఆర్థిక సంస్థలు జాబితా చేయబడిన ఫీచర్లకు భిన్నంగా ఉండవచ్చు. అయితే, చర్చ యొక్క పరిధి కోసం, రెండు రంగాలలోని ప్రముఖ ట్రెండ్‌లు చర్చించబడ్డాయి.

కాబట్టి ముఖ్యమైన కొలమానాలపై రెండు సేవల మూల్యాంకనం ఇక్కడ ఉంది:

#1 నిధులకు యాక్సెస్

CeFi ఒక వినియోగదారు వారి నిధులను CeFi సంస్థకు బదిలీ చేయడమనే సూత్రంపై పనిచేస్తుంది. ఆపై ఆ వినియోగదారు నిధుల వినియోగాన్ని నిర్దేశించవచ్చు, అయితే ఆ నిధులను ఆ సంస్థే నిర్వహిస్తుంది. ఇది కొనుగోలు చేసిన ఇంకా ట్రేడ్ చేసే క్రిప్టోకరెన్సీలకు కూడా వర్తిస్తుంది. సంస్థ క్రిప్టోను దాని వాలెట్‌లో నిల్వ చేస్తుంది ఇంకా ఆ వినియోగదారుకు దగ్గర దాని కీ ఉండదు..

అలా కాకుండా DeFi వినియోగదారు తమ ఫండ్‌లను వారు ఇష్టపడే విధంగా ఉపయోగించుకునే అధికారం ఇస్తుంది. ఒక వినియోగదారు కేవలం DeFi నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేస్తే చాలు, అది వినియోగదారుకు గుర్తింపు కోసం క్రమ సంఖ్యను ఇస్తుంది. ఒకసారి నెట్‌వర్క్‌లో ప్రవేశించాక, వినియోగదారు నెట్‌వర్క్‌ మద్దతు ఉన్న దేనికైనా నిధులను ఉపయోగించవచ్చు.

#2 యాక్సెసబిలిటీ

CeFiకి ఒక వినియోగదారు KYC ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా ఎక్స్‌చేంజ్‌లో నమోదు చేసుకోవాలి. దానివల్ల సంస్థలు తమ సేవలను కస్టమర్‌కు అందించడానికి నిరాకరించవచ్చు. DeFi వినియోగదారుని వారి గుర్తింపుతో సంబంధం లేకుండా ఇంకా వారు ఎక్కడి నుండి వచ్చినా (ప్రాథమిక షరతులకు లోబడి) నమోదు చేసుకుంటుంది.

#3 యూజర్ ఇంటర్‌ఫేస్

ప్రధాన ఆర్థిక సంఘాలు మరియు సంస్థలు CeFi సెక్టార్‌ను కలిగి ఉన్నందున, వారు కస్టమర్ యొక్క కోరుకున్న మద్దతు కోసం నావిగేట్ చేయడానికి సులభమైన ఇంకా వినియోగదారు సానుకూలత ఉన్న ఇంటర్‌ఫేస్‌ను అందిస్తారు. చాలా DeFi నెట్‌వర్క్‌లు ఈ లక్షణాన్ని కలిగి ఉండవు, అందువల్ల మొదట్లో ఉపయోగించడానికి కొంచెం క్లిష్టంగా కనిపించవచ్చు. 

#4 కస్టమర్ సేవ

CeFi అనేది ప్రతి ఎక్స్ఛేంజ్ ఇంకా ఈ సంస్థ కస్టమర్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఒక పోటీ ఉన్న ప్రదేశం. అందువల్ల ఈ రంగం అందించే కస్టమర్ కేర్ సేవ నిష్కళంకమైనది, కస్టమర్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేక విభాగాలు కేటాయించబడ్డాయి. ఇంకా, DeFi నెట్‌వర్క్‌లు స్వతంత్ర నెట్‌వర్క్‌లు అందువల్ల ఇది సాధారణంగా కస్టమర్ మద్దతు సేవలు కలిగిఉండవు. 

#5 పారదర్శకత

DeFi వికేంద్రీకరణ సూత్రంపై పనిచేస్తుంది. అందువల్ల గత లావాదేవీల నుండి నెట్‌వర్క్ సమాచారం, ఇప్పటికే ఉన్న సభ్యులు మరియు ఇతర కీలక సమాచారం లెడ్జర్‌లో పబ్లిక్‌గా అందరికీ అందుబాటులో ఉంటాయి. CeFi సంస్థలు, మరోవైపు, ట్రేడ్‌లను సులభతరం చేయడానికి తెర వెనుక పాత్రను నిర్వహిస్తాయి.

#6 ఫియట్ మార్పిడి

ఫియట్ మార్పిడి CeFi ఎంటిటీల యొక్క ముఖ్య లక్షణం. ఒకరు తమ డబ్బును సంస్థ ద్వారా క్రిప్టోస్‌కి మరియు దాని నుండి సంస్థలకు బదలాయించుకోవచ్చు. DeFi నెట్‌వర్క్‌లు తమ సభ్యులకు ఈ రకమైన సౌకర్యాన్ని అందించవు.

#7 ఆవిష్కరణ పరిధి

CeFi సేవల విషయానికి వస్తే చాలా ఆవిష్కరణలేమీ లేవు. ఏది ఏమైనప్పటికీ, బ్లాక్‌చెయిన్ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నందున, రొటీన్‌గా జరుగుతున్న అద్భుతమైన పురోగతితో, DeFi నెట్‌వర్క్‌లు తమను తాము ఉత్తేజకరమైన రేటుతో అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. ఇది వినియోగదారులకు మరిన్ని స్వయంచాలక ప్రయోజనాలను అందిస్తుంది.

#8 క్రాస్-చైన్ సేవలు

CeFi క్రాస్-చైన్ సేవలను సులభతరం చేస్తుంది, ఇక్కడ ఒకరు క్రిప్టోకరెన్సీ లేదా టోకెన్‌తో మరొక క్రిప్టోకరెన్సీ లేదా టోకెన్ కోసం అదే ప్లాట్‌ఫారమ్‌లో ట్రేడ్ చేయవచ్చు. ఉదాహరణకు, లైట్‌కాయిన్ కోసం బిట్‌కాయిన్ లేదా అలాంటివన్నీ.

అయినప్పటికీ, చాలా DeFi నెట్‌వర్క్‌లు అటువంటి వ్యాపారానికి మద్దతు ఇవ్వలేవు. ఒక క్రిప్టో ఆస్తిని మరొక దానితో మార్పిడి చేసుకోగల ‘అటామిక్ క్రాస్-చైన్ స్వాప్స్’ వంటి ప్రోటోకాల్‌లను కొందరు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ స్వాప్‌కు కోడింగ్ అవసరం, అది కొన్నిసార్లు సంక్లిష్టంగా ఉంటుంది.

#9 సంభవనీయ విపత్తులు

ఎక్స్ఛేంజీలు లేదా ఇతర సంస్థలకు పీడకలవంటిదైన హ్యాకింగ్ చేయడం అనేది CeFiతో అనుబంధించబడిన కీలక ముప్పు. ఎక్స్ఛేంజీలు మరియు అదే విధంగా ప్రొవైడర్లు తమను తాము రక్షించుకోవడానికి తరచుగా అత్యాధునిక భద్రతా చర్యలను నమోదు చేసుకుంటారు, మార్పిడి దోపిడీలు ఇప్పటికీ ప్రతి రెండు నెలలకు వార్తలకెక్కుతున్నాయి.

మరోవైపు, DeFi సిస్టమ్ యొక్క అతిపెద్ద శత్రువు మరేదోకాదు, నెట్‌వర్క్ మాత్రమే. కోడ్ లైన్‌లోని ఏదైనా లోపం లేదా బగ్ వినియోగదారుల ఆస్తులకు ముప్పు తెస్తుంది.

అయితే ఏది మంచిది?

దురదృష్టవశాత్తు, దీనికి సులువైన సమాధానం లేదు. ఇక్కడ, ట్రేడర్ ఏ ఫీచర్లకు ఎక్కువ విలువ ఇస్తారో తెలుసుకోవడానికి తన అవసరాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ నిధులపై నియంత్రణ కోల్పోవడం ఒక ప్రధాన ఆందోళన అయితే, DeFi ఈ చర్చలో అగ్రస్థానంలో ఉంటుంది. అయితే, దైనందిన జీవితంలో ఈక్విటీ ట్రేడింగ్‌లో ప్రతిరోజూ మిలియన్ల మంది పాల్గొనేవారు మధ్యవర్తి సంస్థలకు నిధులను బదిలీ చేయడం పరిపాటి. కాబట్టి, దీనిని పెద్దగా పట్టించుకోకూడదు.

అలాగే, ఫియట్ మార్పిడి లేదా క్రాస్-చైన్ లావాదేవీలు మీ క్రిప్టోకరెన్సీ వినియోగంలో కీలకమైన భాగమైతే, CeFi అనేది మార్కెట్‌లో అత్యంత విశ్వసనీయమైన ఎంపికగా కనిపిస్తుంది. మళ్ళీ, పైన చర్చించినట్లుగా, అటామిక్ క్రాస్-చైన్ మార్పిడులు DeFi పర్యావరణ వ్యవస్థలో ఈ సేవలను సులభతరం చేయగలవు. క్రాస్-చైన్ సేవలను సజావుగా పొందేందుకు మీరు సరైన DeFi నెట్‌వర్క్‌ను కనుగొనవచ్చు.

బహుశా, దీర్ఘకాలంలో, ఈ రెండు ఆర్థిక సేవా వర్గాల ప్రయోజనాలను మిళితం చేసే హైబ్రిడ్ బ్లాక్‌చెయిన్ ఆర్థిక వ్యవస్థ ఉద్భవించవచ్చు. అయితే, ప్రస్తుతానికి, ఇది వాస్తవ దూరంగా ఉంది. కాబట్టి ఒక సర్వీస్‌ని ఎంచుకునే ఈ అయోమయం మిమ్మల్ని ట్రేడింగ్ చేయకుండా ఆపనివ్వవద్దు. రెండింటినీ ప్రయత్నించండి మరియు మీ అవసరాలు ఇంకా డిమాండ్‌లకు అనుగుణంగా ఏది ఉందో నిర్ధారించుకోండి.


మీరు WazirXలో ప్రారంభించడానికి ఒక గైడ్ ఇక్కడ ఉంది.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply