Skip to main content

WazirXలో KYC వెరిఫికేషన్ ఎలా పూర్తి చేయాలి? (How to complete KYC verification on WazirX?)

By ఏప్రిల్ 27, 2022మే 19th, 20222 minute read
WazirX Introduces Dedicated Phone Support For Users

ప్రియమైన ప్రజలకి!

మీ క్రిప్టో ప్రయాణంలో మేము భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirX లో మేము మీ కోసం ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాము. మీకేమైనా సందేహాలుంటే, మా గైడ్‌లను చదివి తరువాత, మీరు ఎప్పుడైనా మమ్మల్ని ఇక్కడసంప్రదించవచ్చు. 

WazirX గైడ్స్

KYC ప్రాసెస్ అవుతోంది

మీరు WazirXలో మీ అకౌంటును తెరచిన తరువాత KYC రెండవ స్టెప్. ఇక్కడ, WazirX లో మేము మీ వివరాలను వెరిఫై చేసి మీరు మాతో సున్నితమైన, సురక్షితమైన మరియు సంతృప్తికరమైన అనుభవాన్ని పొందుతున్నారని నిర్ధారిస్తాము. ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో చూద్దాం:

స్టెప్ 1: ప్రాసెస్ ప్రారంభించండి: WazirXలో KYC వెరిఫికేషన్ కోసం ఎంపికను ఎక్కడ చూడాలి?

మొబైల్:

  1. పైన ఎడమ బటన్ నుండి వినియోగదారు సెట్టింగ్‌లకు వెళ్లండి.

2. “మీ KYCని వెరిఫై చేయండి” సెక్షన్ మీద క్లిక్ చేయండి.

వెబ్: 

అదేవిధంగా, సెట్టింగ్‌లలో మీ KYCని వెరిఫై చేయండి మీద క్లిక్ చేయండి.

స్టెప్ 2: KYC ప్రాసెస్ ప్రారంభం

మొబైల్:

  1. స్టెప్స్ చదివి ఏ డాక్యుమెంటేషన్ (PAN, ఆధార్/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్) అవసరమో అర్థం చేసుకోండి.
  2. కంప్లీట్ KYC నౌ మీద క్లిక్ చేయండి.

వెబ్: 

  1. క్రింద చూపిన మీ వ్యక్తిగత సమాచారాన్ని రిజిస్టర్ చేయండి.
Graphical user interface, applicationDescription automatically generated

స్టెప్ 3: సెల్ఫీ వెరిఫికేషన్

మొబైల్:

  1. మంచి సెల్ఫీ వచ్చిందని నిర్ధారించుకున్న తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.

సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు దయచేసి గమనించండి:

  • కళ్ళద్దాలు పెట్టుకోకూడదు.
  • టోపీలు ధరించకూడదు.
  • ముఖం స్పష్టంగా కనిపించాలి.
  • మీ ముఖం మీద మంచి వెలుతురు ఉండేలా చూసుకోండి.
  • నేరుగా కెమెరా వైపు చూడండి.
  1. సెల్ఫీని క్లిక్ చేయండి. 
  2. సెల్ఫీ చుట్టూ “గ్రీన్ సర్కిల్” ఉందని నిర్ధారించుకోండి.
  3. నెక్స్ట్ క్లిక్ చేయండి.

వెబ్: 

  1. మీ డివైస్‌లోని వెబ్‌క్యామ్ ద్వారా సెల్ఫీని క్యాప్చర్ చేయండి
Graphical user interface, applicationDescription automatically generated

స్టెప్ 4: PAN వెరిఫికేషన్

మొబైల్: 

  1. PAN సరిగ్గా ఉన్నదని నిర్ధారించుకోండి.
  2. నెక్స్ట్ క్లిక్ చేయండి.
  3. బాక్స్ లోపల పాన్ కార్డ్ ముందు భాగాన్ని క్యాప్చర్ చేయండి.
  4. బాక్స్ లోపల పాన్ కార్డ్ వెనుక భాగాన్ని క్యాప్చర్ చేయండి.

వెబ్:

  1. PANను ఒక తెల్లటి షీట్‌పై ఉంచి క్యాప్చర్ చేయండి.
Graphical user interface, applicationDescription automatically generated

స్టెప్ 5: అడ్రస్ వెరిఫికేషన్

మొబైల్:

  1. అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు ఇస్తున్న డాక్యుమెంటుని ఎంచుకోండి.
  2. క్యాప్చర్ చేయడానికి కావలసిన విధంగా అన్నీ సిద్దంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
  3. డాక్యుమెంట్ ముందు భాగాన్ని క్యాప్చర్ చేసి అది బాక్స్‌లో సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి.
  4. డాక్యుమెంట్ వెనుక భాగాన్ని క్యాప్చర్ చేసి అది బాక్స్‌లో సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి.

వెబ్:

  1. అడ్రస్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోండి.
  2. అడిగిన వివరాలను రిజిస్టర్ చేయండి (ఆధార్ నంబర్/పాస్‌పోర్ట్ నంబర్/డ్రైవింగ్ లైసెన్స్ నంబర్).
  3. నంబర్‌ని మళ్లీ రిజిస్టర్ చేయండి.
  4. డాక్యుమెంట్ ముందు భాగాన్ని క్యాప్చర్ చేయండి.
  5. డాక్యుమెంట్ వెనుక భాగాన్ని క్యాప్చర్ చేయండి.
Graphical user interface, applicationDescription automatically generated

స్టెప్ 6: KYCని సబ్మిట్ చేయండి:

Graphical user interface, text, applicationDescription automatically generated

స్టెప్ 7: KYC వెరిఫికేషన్.

మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తరువాత, వాటిని చూసి ప్రాసెస్ పూర్తయిన తరువాత, మీరు మా దగ్గర నుండి ఇమెయిల్‌ను అందుకుంటారు. 

మా టీమ్ KYC వెరిఫికేషన్ను నిమిషాల్లో పూర్తి చేస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో దీనికి గరిష్టంగా 3 పనిరోజులు పట్టవచ్చు. వెరిఫికేషన్ పూర్తయిన తరువాత, మీరు WazirXలో మీ క్రిప్టో ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. 

హ్యాపీ ట్రేడింగ్!

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply