Skip to main content

భారతదేశంలో రిపల్‌ను ఎలా కొనాలి? (How to Buy Ripple in India?)

By డిసెంబర్ 20, 2021డిసెంబర్ 23rd, 20214 minute read
భారతదేశంలో రిపల్‌ను ఎలా కొనాలి? (How to Buy Ripple in India?)

ఈ రోజుల్లో క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టే అవకాశాలను మీరు పరిగణించని మార్గమంటూ ఏదీ లేదు. ఇటీవలి క్రిప్టో అనూహ్య పెరుగుదల 2020 లో ప్రారంభమైనప్పటికీ, ఈ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అయోమయంలోకి నెట్టివేసింది, ఈ ధోరణి ఇప్పటికీ బలంగా ఉంది ఇంకా సంవత్సరం తర్వాత కూడా పెరుగుతూనేఉంది. ప్రతికూల ప్రెస్ ఇంకా ప్రభుత్వ నిబంధనల కారణంగా క్రిప్టోకరెన్సీల గురించి సాధారణ ప్రజానీకం చాలావరకు సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, ప్రజలు ఇప్పుడు వీటి గురించి ఆలోచిస్తున్నారు. సాంకేతిక నిపుణులు లేదా ఔత్సాహికులు మాత్రమే గ్రహించి ఆచరించే భావన కానే కాదు. క్రిప్టో-మేనియా సోషల్ మీడియా నుండి మీ ఉద్యోగం మీ కుటుంబం మరియు స్నేహితుల వరకు ఇంకా ఈ నడుమ అంతటా ఆవరించి ఉంది.

వాస్తవానికి, క్రిప్టోకరెన్సీలు ప్రారంభమైనప్పటి నుండి 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికగా మారడం వరకు సాగిన ప్రస్థానం ఎంతో పెద్దది. క్రిప్టో మార్కెట్లు, స్వతహాగా, తక్కువ కాలవ్యవధిలో తక్కువ విపత్తుతో అద్భుతమైన రివార్డులను అందిస్తాయి. ఇంకా మీరు ఇప్పటికే ఉన్న కేంద్రీకృత ఆర్థిక సేవలు అలాగే ఉత్పత్తులను పరిశీలించినట్లయితే, క్రిప్టోకరెన్సీలు అందించే ఆర్థిక స్వేచ్ఛ మరియు ఇతర ప్రయోజనాలు అసమానమైనవి. అటువంటి లాభదాయకమైన భావనతో, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులు వివిధ రకాల క్రిప్టోకరెన్సీలైన బిట్‌కాయిన్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన ఇతర ఆల్ట్‌కాయిన్ ‌లైన ఎథేరియమ్, డోజ్‌కాయిన్, కర్దానో, వరకు వాటిపై పెట్టుబడి పెట్టడంలో అతిశయోక్తి లేదు.

మార్కెట్ క్యాపిటలైజేషన్ మరియు ధర పనితీరు పరంగా బిట్‌కాయిన్ క్రిప్టో మార్కెట్ ‌లో అగ్రగామిగా కొనసాగుతుండగా, అనేక ఆల్ట్‌కాయిన్‌లు కూడా మంచి పనితీరును కనబరుస్తున్నాయి. మరియు ఈ రోజుల్లో, క్రిప్టో మార్కెట్‌లలో రిపల్ (XRP) అనేది క్రొంగొత్త ఆసక్తికరమైన వాస్తవం.మీరు భారతదేశంలో రిపల్‌ని ఎలా కొనాలిఅనే దానితో సహా రిపల్ గురించి మీరు తెలుసుకోవలసిందంతా ఇక్కడ ఉంది. 

రిపల్ (XRP) అంటే ఏమిటి?

US-ఆధారిత టెక్ కంపెనీ రిపల్ ల్యాబ్స్ ద్వారా రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది, XRP అనేది నిజ-సమయ స్థూల పరిష్కార వ్యవస్థ, కరెన్సీ మార్పిడి మరియు చెల్లింపుల నెట్‌వర్క్. రిపల్ ఇంకా XRP అనే పదాలు తరచుగా పరస్పరం మార్చుకోబడతాయి, వాస్తవానికి, రిపల్ అనేది XRP యొక్క కంపెనీ పేరు మరియు నెట్‌వర్క్. దీనికి విరుద్ధంగా, XRP అనేది రిపల్ ల్యాబ్స్ ఉత్పత్తులకు స్థానిక క్రిప్టోకరెన్సీ.

ప్రధాన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను కస్టమర్‌లుగా కలిగి ఉన్న గ్లోబల్ పేమెంట్స్ నెట్‌వర్క్‌గా రిపల్ తననుతాను తప్పనిసరిగా ప్రచారం చేసుకుంటుంది మరియు 3-5 సెకన్ల కంటే ఎక్కువ కాలం ఉండే వివిధ కరెన్సీల మధ్య తక్షణ సెటిల్‌మెంట్‌లను అనుమతించడానికి రిపల్ ఉత్పత్తుల కొరకు XRP ఉపయోగించబడుతుంది. లావాదేవీలను ప్రామాణీకరించడానికి బ్లాక్‌చెయిన్ మైనింగ్‌ని ఉపయోగించకుండా, రిపల్ నెట్‌వర్క్ ఒక ప్రత్యేకమైన పంపిణీ ఏకాభిప్రాయ పద్ధతిని ఉపయోగిస్తుంది, దీనిలో పాల్గొనే నోడ్‌లు లావాదేవీల చెల్లుబాటును ధృవీకరించడానికి పోల్‌ను నిర్వహిస్తాయి. మరియు ఇది కేంద్ర యంత్రాంగపు అవసరం లేకుండా దాదాపు తక్షణ నిర్ధారణలను అమలు చేయడానికి రిపల్‌ని అనుమతిస్తుంది. 

పర్యవసానంగా, XRP వికేంద్రీకరించబడింది ఇంకా వేగం మరియు విశ్వసనీయత పరంగా దాని పోటీదారులలో చాలా వాటిని అధిగమిస్తుంది. ఇంకా, XRP లావాదేవీలు ప్రూఫ్ ఆఫ్ వర్క్ అవసరం లేకుండా త్వరగా పరిష్కరించబడతాయి, ఇది మైనింగ్‌లో శక్తిని ఆదా చేస్తుంది. XRP ఏకాభిప్రాయ వ్యవస్థ తక్కువ శక్తిని మాత్రమే ఉపయోగిస్తుంది, ఇది భారీ మొత్తంలో శక్తిని ఉపయోగించే బిట్‌కాయిన్ కంటే పర్యావరణపరంగా స్థిరమైనది. ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ వ్యాలిడేటర్‌లతో కూడిన వికేంద్రీకృత నెట్‌వర్క్ ద్వారా ఆధారితం, కావున XRP కూడా అత్యంత స్కేలబుల్ మరియు సెకనుకు 1,500 లావాదేవీలను రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు నిర్వహించగలదు, వీసా చెల్లింపుల నెట్‌వర్క్ వలె అదే త్రూపుట్‌ను అందించగలదు.ఈ సమయంలో, XRP అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఆరవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇంకా $1.14వద్ద ట్రేడవుతోంది. భారతదేశంలో రిపల్ ధర ₹88.9997. భారతదేశంలో క్రిప్టోకరెన్సీరాకతో, వన్నాబే పెట్టుబడిదారులు వారు ఎంచుకోవడానికి అనేక క్రిప్టో ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో రిపల్‌ని కొనేందుకుఉత్తమ ప్లాట్‌ఫారమ్ కోసం వెదుకుతున్నట్లయితే, WazirX మీ ఉత్తమ ఎంపిక అవుతుంది. 

భారతదేశంలో రిపల్‌ని కొనుగోలు చేయడానికి WazirX ఎందువల్ల ఉత్తమమైనది

భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఒకటి, WazirX అనేక కీలక లక్షణాలను కలిగి ఉంది, ఇది ఉత్తమమైనది. ప్లాట్‌ఫారమ్ యొక్క కొన్ని ప్రధాన ఫీచర్లలో ఉన్నతమైన భద్రత, త్వరిత KYC విధానాలు మరియు వేగవంతమైన లావాదేవీలు, బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రాప్యత, సరళమైన ఇంకా సులభంగా నావిగేట్ చేయగల ఇంటర్‌ఫేస్ మరియు ప్లాట్‌ఫారమ్‌ను సానుకూలంగా ఉంచి క్రిప్టో అనేది భవిష్యత్తు అని నమ్మే ఉద్వేగభరితమైన బ్లాక్‌చెయిన్‌ను విశ్వసించే బృందం నిర్మించింది. WazirX భారతదేశంలో రిపల్ కొనడానికి మాత్రమే కాదు – ఇది బిట్‌కాయిన్, ఎథేరియమ్, పాలిగాన్ (గతంలో మ్యాటిక్ నెట్‌వర్క్) మొదలైన అనేక ఇతర ప్రముఖ క్రిప్టోకరెన్సీలకు కొనేందుకు కూడా ఒక ఉత్తమ వేదిక. 

దీనితో పాటు, ఈ ప్లాట్‌ఫారమ్ WRX టోకెన్ అని పిలువబడే దాని స్వంత యుటిలిటీ టోకెన్‌ను కూడా కలిగి ఉంది. WRX టోకెన్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడంలో సహాయం చేయడంలో WazirX కమ్యూనిటీని నిమగ్నం చేయడం మరియు వారి సహకారానికి రివార్డ్ ఇవ్వడం.

మీరు భారతదేశంలో రిపుల్‌ని ఎలా కొనాలోఇప్పుడు చూద్దాం.

WazirX ద్వారా ఆన్‌లైన్‌లో రిపుల్‌ని కొనండి.

WazirX ద్వారా ఆన్‌లైన్‌లో రిపల్ కొనే ముందు, మీరు మొదట ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. మీకు దాని గురించి తెలియకుంటే, దిగువ దశలను అనుసరించండి. 

 1. ఒక ఖాతాను తెరవండి
 • Google Play Store లేదా App Store నుండి WazirX యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి లేదా WazirX వెబ్‌సైట్‌ని సందర్శించండి. 
 • మీ ఇమెయిల్ చిరునామా మరియు పాస్‌వర్డ్‌ని పూరించడం ద్వారా ప్లాట్‌ఫారమ్‌లో సైన్ అప్ చేయండి.
 • తరువాత, మీ ఇమెయిల్ చిరునామాను ధృవీకరించండి. 
 1. మీ ఖాతాను సురక్షితం చేసుకోండి
 • మీరు Authenticator యాప్‌ని ఉపయోగించడం ద్వారా లేదా మొబైల్ SMS ద్వారా మీ ఖాతాను సురక్షితం చేసుకోవచ్చు. మీరు ఈ ప్రక్రియను దాటవేయడానికి కూడా ఎంపికను కలిగి ఉన్నారు, కానీ సాధారణంగా మీ స్వంత భద్రత కోసం 2-కారకాల ప్రమాణీకరణతో మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాలని సిఫార్సు చేస్తున్నాము.
 1. KYCని ధృవీకరించండి
 • తదుపరి దశ KYC ధృవీకరణ, ఇది క్రిప్టో ట్రేడింగ్‌కు అవసరమైన దశ. WazirX మీ KYCని సాధ్యమైనంత వేగంగా ప్రాసెస్ చేసే టాప్-ఆఫ్-ది-లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సిస్టమ్‌లను అందిస్తుంది, తద్వారా నిరాటంకమైన ట్రేడింగ్ అనుభవం కోసం మీ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
 1. నిధులు జమ చేయండి
 • తదుపరి దశ మీ నిధులను ప్లాట్‌ఫారమ్‌లో డిపాజిట్ చేయడం. మీరు మీ నిధులను భారతీయ రూపాయలో లేదా క్రిప్టోకరెన్సీలలో డిపాజిట్ చేయవచ్చు. 
 • భారతీయ రూపాయలో నిధులను డిపాజిట్ చేయడానికి, ఖాతా నంబర్, బ్యాంక్ పేరు, IFSC కోడ్ మరియు ఇతర సంబంధిత వివరాలను సమర్పించండి. మీరు UPI, IMPS, NEFT మరియు RTGS వంటి విభిన్న చెల్లింపు పద్ధతుల ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుండి మీ WazirX ఖాతాకు సులభంగా భారతీయ రూపాయలలో నిధులను జమ చేయవచ్చు.
 • మీ వాలెట్ నుండి (లేదా ఇతర ఎక్స్ఛేంజీల నుండి కూడా) క్రిప్టోకరెన్సీ నిధులను డిపాజిట్ చేయడం కూడా చాలా సరళమైన ప్రక్రియ ఇంకా అదనపు ఛార్జీలు కూడా వర్తించవు. దీని కోసం, ముందుగా, మీ WazirX వాలెట్‌కి వెళ్లి, మీ డిపాజిట్ చిరునామాను పొందండి. ఆపై, మీ క్రిప్టోకరెన్సీలను బదిలీ చేయడానికి, మీ ఇతర వాలెట్‌లోని ‘సెండ్ అడ్రస్’ విభాగంలో ఈ చిరునామాను షేర్ చేయండి.
 1. XRP కొనండి
 • మీరు మీ WazirX వాలెట్‌లో నిధులను డిపాజిట్ చేసిన తర్వాత, మీరిక సిద్ధంగా ఉండండి. WazirX ఎక్స్ఛేంజీని సందర్శించి, భారతదేశంలో ప్రస్తుత రిపల్ ధరను వీక్షించడానికి “XRP/INR”ని ఎంచుకోండి.
 • “బై” మరియు “సెల్” అని చూపించే బాక్స్‌లో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న XRP యొక్క INR మొత్తాన్ని నమోదు చేయండి, “వై” బటన్‌పై క్లిక్ చేసి, ఆర్డర్ అమలు చేయబడిన తర్వాత XRP మీ వాలెట్‌కి బదిలీ అయ్యే వరకు వేచి ఉండండి. 

అంతే సునాయాసంగా ఆన్‌లైన్‌లో రిపుల్‌ని కొనేయొచ్చు. WazirX గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడక్లిక్ చేయండి.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply